S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/24/2016 - 23:54

వేధింపులు... మానసిక, శారీరక హింస, ప్రేమ పేరుతో మోసాలు అత్యాచారాలు... ఇవి తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులు, విద్యార్థినులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇంటా బయటా కొందరు నేరాగళ్ళ పాశవికతకు ‘బలి’అవుతున్నారు. వేధింపులు జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు సరైన విధంగా స్పందించటం లేదు.

03/24/2016 - 23:55

శ్రీరామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాఖీయ శ్రీవైష్ణవులే- చాత్తాద శ్రీవైష్ణవులు. వీరు 11వ శతాబ్దానికి ముందే వున్నట్లు లిఖిత శాస్త్రాలలో పరిచయం. చాత్తాద శ్రీవైష్ణవులు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రలో సర్వత్రా వ్యాపించి వున్నారు.

03/24/2016 - 07:30

కుటుంబంలో భర్త, అత్తమామలు, ఆడపడుచులు ఇతర కుటుంబ సభ్యులద్వారా శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసలకు గురవుతున్న మహిళలు తమ బాధల విముక్తికోసం సివిల్‌చట్టం కింద విడాకులు, లేదా క్రిమినల్ చట్టంకింద ఐపిసి 498ఎ సెక్షన్‌ను ఆశ్రయించేవారు.

03/24/2016 - 07:29

కొన్ని పాఠశాలలను సమర్ధవంతమైన స్కూళ్లంటాం. కొన్నింటిని ఎక్స్‌లెన్సీ స్కూళ్లంటాం. కొన్నింటిని విశిష్టమైన స్కూళ్లంటాం. సమాజంలో పాఠశాలల్లో ఈ సున్నితమైన ఈ తేడాకు కారుకులెవరు? ఆ పాఠశాల యొక్క నాయకుడే. కొంతమంది హెడ్‌మాస్టర్ అంటే తలపంతులు అనుకుంటారు. భౌతికమైన ఆకారమే కాదు, హెడ్‌మాస్టర్‌కు ఒక దృక్పథముంటుంది. ఆ దృక్పథాన్ని దీక్షతో అమలుచేస్తే అది మిషన్ అవుతుంది.

03/23/2016 - 00:38

కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లో సయితం ఎనలేని గుర్తింపు పొందిన పొందూరు సన్నఖాదీ పరిశ్రమ నేడు క్లిష్ట దశలో ఉంది. కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో పలువురు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళ్తున్నారు. మరికొందరు పొట్టకూటికోసం సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. తన మనుగడను నిలుపుకొనేందుకు పరిశ్రమ అష్టకష్టాలు పడుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ పరిశ్రమ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది.

03/23/2016 - 00:32

మనదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాణాంతక సమస్య ‘క్షయ’. ఈ వ్యాధి ముఖ్యంగా మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాపిస్తుంది. ఇది స్ర్తిపురుష తారతమ్యం లేకుండా, ఏ వయసులో వారికైనా రావచ్చు. ఇది శరీరంలో (తల వెంట్రుకలు, గోళ్లు తప్ప) రక్తప్రసరణ ఉన్న ఏ భాగానికైనా రావచ్చు. క్షయ క్రిమికి ఆక్సిజన్ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది.

03/22/2016 - 00:31

విద్యార్థులకు చక్కని విద్యాబోధన చేసేవారికి, చేయించే వారికి రక్షణ లేదా? సమయపాలన పాటించని టీచర్లకు ఆబ్సెంట్ వేస్తే, దారితప్పిన టీచర్లను దారిలోకి తెస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పీజీ హెడ్మాస్టర్లకు, మండల విద్యాధికారులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు వేధింపులు, సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు తప్పటం లేదు.

03/21/2016 - 01:02

జన్మించి శతవత్సరాలు, మరణించి 55 సంవత్స రాలు గడిచి, తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దాదాపు రెండు వసంతాలు పూర్తయనా గుర్తింపునకు నోచ ని తెలంగాణ తొలి నవలా కారుడు వట్టికోట అళ్వారు స్వామి. నిజాం సర్కారు దమ న నీతిని దునుమాడుతూ, అక్షరానే్న ఆయుధంగా సంధిం చి అళ్వారు చేసిన అక్షర యుద్ధమే ఆయన్ను ‘ప్రజల మనిషి’గా నిలిపింది.

03/19/2016 - 23:36

పూర్తి భావస్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ హిందువులకు ఉంది. ఇతరమతాల్లో లేదు. ఇతర మతాల్లో కొనసాగే అసహనం భావస్వేచ్ఛ ఎట్లా అవుతుంది. హైందవంలో నిరీశ్వర సాంఖ్యం అని ఒక తత్వం ఉంది. భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు సాంఖ్యం- అంటే దేవుడు లేడు అనేవారు కూడా మన్నింపబడ్డారు. ఇదొక ఆలోచనావిధంగా గౌరవించారు. ఇక దేవుడున్నాడనేవాడు ఒకే దేవుణ్ణికాదు మూడుకోట్ల మంది దేవతలను ఆరాధించుకోవచ్చునన్నారు. ఇదే హైందవం.

03/18/2016 - 23:42

రాష్ట్రంలో వేసవి తాపం మొదలైంది. జనం తాగునీటికి అల్లాడుతున్నారు. బిందె నీటి కోసం మైళ్లు నడక. అడుగంటిన భూగర్భ జలాలు.. నదులన్నీ ఎడారులుగా మారాయి. పాపం ప్రజలు కలుషిత నీటినే సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకా మార్చి రాకుండానే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్రలో నీటిఎద్దడి ప్రస్తుతానికే తీవ్రంగా ఉంది.

Pages