సబ్ ఫీచర్

తెలుగు భాషకు ప్రయోగాల తెగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన తెలుగు భాష కూడా అతి త్వరలో మృతభాషల్లోకి చేరిపోతూ ఉందని యునెస్కోవారు ప్రకటించగానే తెలుగు తెలిసిన ప్రతివారూ ఆందోళన చెం దుతూ ఉన్నారు. పుండుమీద కారం చల్లినట్లు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ, మలయాళీలు వారి భాషకు పట్టం కట్టటం మరింత బాధిస్తూ ఉన్నది. అయితే నిజానికి వారి భాషకు వారు పట్టం కట్టిందెక్కడ. అంటే నామ ఫలకాలలో మాత్రమే అని నాకు అర్థం అయింది. ప్రతి ఏడూ సెలవులకు పిల్లలు పొరుగు రాష్ట్రాలనుండి వస్తారు. వారి మాతృభాషలోనే కాయగూరల పేర్లు ఆంగ్లంలో అనువాదం చేసి చెపితేనే అర్థం చేసుకుంటారు. మన పరిసరాల జంతువుల పేర్లూ అంతే. ఇక బంధు వాచకాలు అసలే తెలియవు. అంతెందుకు ప్రయాణాల్లో యువత చేతుల్లో ఆంగ్ల పుస్తకాలు కనబడతాయే తప్ప మరో భాషా పుస్తకం చేతిలో కనబడదు. ఒకసారెప్పుడో ‘‘యునెస్కోవారి జేజమ్మ చెప్పినా తెలుగు చావదు’’అంటే ‘‘మేకపోతు గాంభీర్యం’’అని ఎద్దేవా చేసినారు.
స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భైకి దగ్గరపడుతున్నా అక్షరాస్యత ఇంకా 70కి చేరలేదు. అంటే 30శాతం మంది వారి మాతృభాషలోనే మాట్లాడుతారన్నమాట! అక్షరాస్యులైన 70 శాతం మందికి సగానికి పైబడి మన భాష అంతరించిపోతునదన్న తపనతో తెలుగును కాపాడటానికి గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. శ్రీ వైష్ణవులకు చాలావరకు తమిళం మాతృభాషలాగా మాధ్వులకు కన్నడం మాతృభాష మాత్రమేకాక దాస సాహిత్యమంతా కన్నడ భాషలోనే ఉంటాయి. మధ్వుల మఠాలలో ఒకటైన శ్రీ ఉత్తరాధి మఠం యతీశ్వరులవారు శ్రీశ్రీశ్రీ సత్యాత్ములవారికి సం స్కృతము ప్రాంతీయ భాషలైన మరాఠీ, హిందీ, కన్నడం తప్ప తెలుగురాదు. ‘సోన్’అనే ఊరిలో ఉత్తరాది మఠానికి చెందినవారే అందరూ. ఒక్క ముక్క కన్నడం రాదువారికి. అక్కడొక ముఖ్య కార్యక్రమం జరిగితే తెలుగు నేర్చుకొని ప్రసంగించినారు. ఇప్పుడు తెలుగు చదవటం, మాట్లాడ్డం నల్లేరుమీద నడకే వారికి. అలా అవసరంకొద్ది చాలామంది తెలుగు నేర్చుకుంటున్నారు.
అది ఆధ్యాత్మిక రంగమైతే వినోదాన్ని అందించే తెలు గు చిత్రసీమనే చూడండి. సాంకేతిక రంగంలోను పరభాషా నిపుణులే. గాయకులు, నటీమణులు చాలామంది తెలుగు నేర్చుకొనటానికి ప్రయత్నిస్తున్నవారే. అంటే మన తెలుగువారేకాక అన్యులు కూడా తెలుగు నేర్చుకుంటూ ఉన్నారన్నమాట! ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో పద్యాలు, పాటలు, ప్రహేళికలు వంటి వాటిని తెలుగు, బాలలకోసం నిర్వహిస్తూ ఉన్నారు. స్పర్ధయా వర్ధతే విద్యకదా! ఆ పోటీతత్వం వలన భాష మీద అభిరుచి పెరుగుతుంది తప్ప చచ్చిపోదు కదా! ఇక రాష్టమ్రంతటా (రెంచుచోట్లా) ఎక్క డో ఒకచోట తెలుగు పుస్తకావిష్కరణ చేస్తూనే ఉన్నారు. కవులకు సన్మానం జరుగుతూనే ఉంటుంది. అన్ని పత్రికలు కథల పోటీలు, కవిత్వాలు, నవలల పోటీలు, సమస్యాపూరణలు ఇలా ఎన్నోవిధాలుగా ఎగదీసి ప్రాణం పోతున్న తెలుగును బతికించుకోటానికి పడరాని పాట్లు పడుతూ ఉన్నారు. ప్రాచీన హోదా దక్కించుకున్న తెలుగుకు మరింత మెరుగులద్దే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇవన్నీ తెలుగు బతికి బట్టకట్టటానికి చేస్తున్న ప్రయత్నాలే అయినప్పటికీ తప్పులు లేకుండా తెలుగును చక్కగా ప్రచురించి మన పిల్లలకు అందించటంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నాము.
వెనుకటికి దాదాపు 15-20 ఏళ్ళ క్రితందాకా తెలుగును మధించిన మహామహులు పత్రికారంగంలో ఉండేవారు కనుక 99 శాతం తప్పులు ఉండేవి కావు. ఏ పదాన్ని ఎలా వాడాలో అలాగే వాడేవారు. అయితే ఇప్పుడు ‘మాయాబజార్’లోని చిన్నమయ్య శిష్యబృందం లాంటివారు బయలుదేరారు. పనివేళల్లో క్రికెట్ చూడటాన్ని గురించి రాయటానికి ‘ఆటం’కం అని రాసినారు. ఆటకు సంబంధించిన దాన్ని రాస్తున్నామన్న ఉబలాటంతో ‘ఆటంకం’అన్న పదంలోని ‘ఆట’ను విడగొట్టి ‘క’అక్షరానికి ముందువెనుక సున్న చేర్చితే ఎలా చదువుతారన్న ఇంగితం ఉందా? ‘‘అల‘వాట్స్’మారితేనే ఆదా’’ఇది విద్యుత్తు పొదుపుకోసం తెలుగు ‘‘అలవాటు’’ పదానికిచ్చిన షాక్. ఇక సాధారణంగా (అలవాటుగా మారిపోయిన అంటే బాగేమీ!) వాడే పదాలు ‘శాఖాహారము’ ‘ఖచ్చితము’ ‘్భద’ భోదన కళ్యాణం బేధము, మాంగళ్యం వంటివి. ఇవి చదివి ఒక్కోసారి (సారీ ప్రతిసారీ)నేనే తప్పేమో అని నిఘంటువు చూడనిదే రాయలేని స్థితికి చేరుకున్నాను. వ్యవ ‘‘సాయము’’ భా‘రథ’చక్రాలు అన్న పదాలతో ‘వ్యవసాయము’అన్న పదాన్ని విడదీసినా యథాతథంగానే రాసే అవకాశం ఉందికాబట్టి దానిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. అయితే ‘్భ‘రథ’చక్రాలు’అన్న పదము రెండు పదాల కలయిక ‘్భరత’ ‘రథచక్రాలు’ నేటి పిల్లలకు ఇవి రెండు పదాలని తెలియక ‘్భరథదేశము’ అని రాసినా మనం విస్తుపోనక్కరలేదు. అలాటిదే ‘‘్ఫలానా ఆస్పత్రిలో ప్ర‘శవం’అన్న వాక్యం. ప్రసవానికి వెళ్ళిన గర్భిణి మరణించింది. ప్రసవము, శవము అన్న రెండు పదాలను కలగాపులగంచేసి ప్ర‘శవం’ అని తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. ‘ప్రశవం’ తప్పునాయనా ‘ప్రస వం’అన్నది సరిఅయిన పదం అంటే పత్రికల వాళ్ళకంటే నీవు మేధావివా? అంటే చచ్చినట్లు నోరుమూసుకోవటం తప్ప ఏంచేయగలం? ఎలా మార్చగలం? మనమూ బాల్యంలో ‘‘మా టీచరు చెప్పిందే రైటు’’అనే వాళ్ళంకదా! అయితే అప్పట్లో సాధారణంగా తప్పులు దొర్లేవికావు అంతే తేడా. యువకులు అవయవదానంచేస్తే ‘అవ’ ‘యువ’దానం’’. దారిలేక ఇబ్బందులు పడుతూ ఉంటే ‘దారిణం’అని చదివిన యువతనుద్దేశించి దారిణం కాదు తల్లుల్లారా అంటే మనమీదా దారుణంగా విరుచుకపడరూ!!
రాష్ట్రంలో విద్యుత్‌‘సౌర’్భం! - సౌర విద్యుత్తుకు వచ్చిన తిప్పలు ఇది. సౌరభం అంటే సువాసన కదా! మరి సూర్యుడినుండి వచ్చే విద్యుత్తుకు సువాసనకు ఏమి సంబంధం ఉన్నది? ఓ రంగుల పక్షిని వర్ణించటానికి ‘రంగు’రించుకొంది’అన్న వాక్యం రాసిన పెద్దమనిషికి ఆ వాక్యంలోని తప్పులతో సంబంధంలేదు కాబోలు! అంగన్‌వాడీ నిధులు అందలేదని రాయటానికి చమత్కారాలు, శే్లషలు అలంకారాలు అవసరం లేదు. అయితే పత్రికలవారికి మాత్రం దాన్ని అందంగా చూపించాలన్న తపన ఎక్కువ. అందుకే ‘నిధులు’అందని వాడీలు! అనవసరపు ఆశ్చర్యార్థకాలు ‘ఇన్‌వర్టెడ్’కామా’’లు వాడి ఉన్న మతిపోగొడుతూ ఉన్నారు. ‘శీర్షాసనం’అంటేనే తల కిందగా అని అర్థం అవుతుంది- దానికి మరో విశేషణాన్ని జోడించి ‘తలక్రిందులుగా శీర్షాసనం’అన్నది చదివేసరికి ఉన్న మతిపోయింది. అలాటిదే ‘మరో శీర్షిక ‘అలసత్వర చికిత్స’ అలసత్వం అంటే నిర్లక్ష్యాన్ని సూచించే పదం. ‘‘సత్వరం’’అంటే వెంటనే లేదా తక్షణమే అని కదా! మరి ఈ పదబంధం చదివి చికిత్సను నిర్లక్ష్యం చేసినారనుకోవాలా? లేదా తక్షణమే చేసినారనుకోవాలా? అసలీ రెంటిని అంటుకట్టిన మహానుభావులయిన మేధావుల మెదడు ఎక్కడ ఉందో అర్థమయి మరికాస్తా కిందికి వంగి దండం పెట్టాలని పించింది. ఈ విధంగా తెలుగుభాష పత్రికారంగలో ప్రయోగాలకు గురవుతోంది. అసలే మాతృ భాషకు సరైన ప్రోత్సాహం లేదన్న ఆవేదన వ్యక్తమ వుతున్న తరుణంలో ఇటువంటి ప్రయోగాలు మరింత గందరగోళంలో పడేస్తాయ.

- అయ కమలమ్మ