S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/19/2019 - 00:35

యూరి బెంజ్మెవోవ్ రష్యా గూఢచారి. శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో భారతదేశంలో పనిచేయడానికి అతడిని రష్యన్ గూఢచర్య సంస్థ కెజిబి పంపించింది. కమ్యూనిజం సిద్ధాంతాన్ని వొంటబట్టించడం ద్వారా భారతదేశంలో తమకు అనుకూలంగా పనిచేసే ‘మూర్ఖ మేధావుల’ బృందాన్ని తయారుచేయడానికి తన బృందానికి ఆదేశాలు అందాయని ఒక అమెరికా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూరి అన్నారు.

11/18/2019 - 21:58

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఒకటవ తరగతినుండి ఆరవ తరగతివరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని చూస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కొద్దిమంది సమర్థించినవారైతే అధిక శాతంమంది వ్యతిరేకించిన వారున్నారు. ప్రభుత్వాలు మారుతున్నపుడల్లా విద్యారంగానికి వారు చేసిందేమీ ఉండదు.

11/17/2019 - 04:09

భారత రాజ్యాంగాన్ని (భారతీయ సంవిధాన్) ఆమోదించి 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 26న పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇదొక చారిత్రక సందర్భం. అలనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన ‘డ్రాఫ్టింగ్ కమిటీ’ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా ప్రతిని ఆమోదిస్తూ 284 మంది సభ్యులు సంతకాలు చేశారు.

11/13/2019 - 22:50

రాజనీతిజ్ఞుడు, శాంతిదూత, స్వాతంత్య్ర సమరయోధుడు, మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఆయన 1889 నవంబర్ 14న మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు అలహాబాద్‌లో జన్మించాడు. నెహ్రూ సంపన్న కుటుంబంలో జన్మించడం వలన ఇంటివద్దనే గుఱ్ఱపు స్వారీ, ఈత, వ్యాయామం, సాముగరిడీలు మొదలైన సాంప్రదాయ విద్యలన్నీ నేర్చుకున్నాడు.

11/13/2019 - 01:51

ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ ఇకపై ఆంగ్లంలోనే విద్యాబోధన జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం అనాలోచితమైనది. తెలుగు భాష కు సమాధి కట్టి, ఈ భాషను మాట్లాడేవారి నాశనానికి పాలకులు తీసుకున్న నిర్ణయం ఇది. సుమారు 250 ఏళ్లు మనల్ని పాలించిన బ్రిటిష్ వారి అనుభవం ఏమి చెప్తున్నది?

11/11/2019 - 23:11

‘మంచి వార్తాపత్రిక అంటే ఒక జాతి తనతో తాను మాట్లాడుకోవడమే’’ అంటారు ఆర్థర్ మిల్లర్. ఇందుకు చక్కని ఉదాహరణ మహాత్మా గాంధీ. ఆయన ఒక పాత్రికేయునిగా ఎలా సమాజంతో మాట్లాడుతూ ఉండేవారో అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. లండన్, దక్షిణాఫ్రికా, భారత్‌లలో ఎక్కడైనా, ఎప్పుడైనా గాంధీ పూర్తిస్థాయి పాత్రికేయునిగా జీవించారు. భారత స్వతంత్ర ఉద్యమ నాయకుడి కన్నా పాత్రికేయునిగా ఆయనకు వున్న అనుభవం ఇరవై ఏళ్ళు ఎక్కువ.

11/08/2019 - 22:31

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశానికి రెండవ రాజధానిగా అవుతుందన్న ఊహాగానాలు ఇపుడు జోరుగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందన్న అంశం తెరపైకి వచ్చింది. ఒక దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూనే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది.

11/07/2019 - 01:48

ఇప్పటిదాకా జల వనరులు, భూమి పొరల్లో, గాలిలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా పేరుకుపోతున్నాయి? వాటి దుష్ప్రభావం ఏమిటి? అనే అంశాలపై ఎనె్నన్నో అధ్యయనాలు జరిగాయి. పర్యావరణవేత్తలను, పరిశోధకులను కలవరపెడుతున్న విషయం మరొకటి ఉంది. అదేమిటంటే మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు మానవ శరీరాలలో ఎలా, ఏమేరకు పేరుకుంటున్నాయి, మానవుల ఆరోగ్యం, జీవన క్రియలపై వాటి ప్రభావం ఎలా ఉంటోంది అన్నదే.

11/05/2019 - 22:34

చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. నవంబర్ 1న చైనా 5జి సర్వీసులను ప్రారంభించి సాంకేతిక రంగంలో తన సత్తా చాటుకుంది. వర్తమాన సాంకేతిక రంగంలో తానే అగ్రగామి అని చైనా ప్రపంచానికి చాటింది. అలా పెద్ద ముందడుగు వేసింది. ఇరు దేశాల మధ్య ‘స్పర్థ’ సరికొత్త తీరాలకు చేరింది.

11/05/2019 - 03:14

పత్రికల్లో, టీవీ చానళ్లలో, ఇతర ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు కానీ పోస్టింగులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను తప్పు పట్టేలా ఉండకూడదట. అలావుంటే మీడియాపై కేసులు పెడతారట. ప్రాసిక్యూట్ చేసి శిక్షలు కూడా విధిస్తారట. ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో సారాంశం.

Pages