S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/20/2019 - 05:39

భావి భారత పౌరులైన పిల్లలకు ఎలాంటి ఒత్తిళ్లూ ఉండని సామాజిక వ్యవస్థలో వారిని ఎదిగేందుకు కుటుంబ వ్యవస్థలు, విద్యాబోధనాలయాలు అప్రమత్తంగా కృషిచేయాలి. విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న సహజమైన శక్తియుక్తులను వెలికితీసి, సామాజిక ఆర్థిక వికాసానికి తోడ్పడే విశిష్ట ప్రక్రియే విద్యగా శ్రీ స్వామివివేకానంద ప్రవచించారు. విద్య వైయక్తిక వృద్ధితోపాటు దేశాభివృద్ధికి దోహదపడుతుంది.

12/17/2019 - 01:58

నల్ల తిమింగలాలు (వీటినే రైట్ వేల్స్ లేదా బ్లాక్ వేల్స్ అంటారు) మూడు రకాలు. అవి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉండేవి. ఉత్తర పసిఫిక్ సముద్రంలో ఉండేవి. భౌగోళం దక్షిణార్థం సముద్రంలో ఉండేవి. వీటిలో ఉత్తర అట్లాంటిక్ తిమింగలాలు స్కూల్ బస్సు పరిమాణంలో నల్లగా, పెద్దగా ఉంటాయి. వీటి నోరు గరిటెలా పొడవుగా ఉండి, ముఖంమీద తెల్లటి మచ్చలు ఉంటాయి. ఇవి సముద్రపు అట్టడుగున ఉండే గడ్డి మొక్కలని తింటాయి.

12/15/2019 - 02:29

మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఏ) 19వ వార్షిక వారోత్సవం (డిసెంబర్ 2-8) ప్రశాంతంగా ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మందుపాతర పేల్చేందుకు సన్నాహాలు చేస్తున్న ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మరణించారు.

12/15/2019 - 00:20

సరిగ్గా సంవత్సరం గుర్తులేదు కానీ, ఐదారేళ్ళ క్రితం శ్రీకాకుళం జిల్లా, రాజాం పట్టణంలో ‘మిథునం’ చిత్ర నిర్మాత ఆనందరావు మొయిద గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు, గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

12/13/2019 - 03:38

తెలంగాణలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం క్రమంగా అదృశ్యమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 97 శాతం పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో ఉండగా, మిగిలిన స్కూళ్లు సైతం అదే బాటలోకి వెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సమాజం ఆంగ్ల మాధ్యమం మోజులోపడి తెలుగుకు తిలోదకాలు ఇవ్వడమే. ప్రభుత్వ విద్యకంటే ప్రైవేటు విద్య మెరుగ్గా ఉంటుందన్న సంకుచిత దృష్టి నుంచి తల్లిదండ్రులు బయటపడేలా ప్రభుత్వాలు చొరవ చూపాలి.

12/11/2019 - 05:11

గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తున్న క్రమంలో గ్రంథాలయాల వినియోగం తగ్గి పాఠకుల సంఖ్య రోజురోజుకు తగ్గి సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య తగ్గి వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది.

12/10/2019 - 23:49

నేడు ఎక్కడ చూసినా అవినీతే.. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కా ర్యాలయాలలో పనికాని పరిస్థితి. అక్రమార్కుల భరతం పడతామని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ సమాజంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది. అవినీతి, అధికారం అనేవి ఒకే నాణానికి రెండు ముఖాలుగా మారిపోయాయి. 2003 అక్టోబర్ 31న అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కనె్వన్షన్ తరువాత ప్రతి ఏటా డిసెంబర్ 9న ‘అవినీతి వ్యతిరేక దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

12/10/2019 - 23:40

హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వ వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’పై నలుగురు యువకులు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఉదంతం యావత్ దేశాన్ని కుదిపివేసింది. ఆ నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ చేయడం కూడా అంతే సంచలనం సృష్టించింది. ‘దిశ’ ఘటన పార్లమెంటును సైతం కుదిపివేసింది. దేశవ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు స్పందించి కొవ్వొత్తులతో ఊరేగింపులు జరిపారు.

12/05/2019 - 00:47

సర్గాస్సో సముద్రం.. ఇది ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని ఒక ప్రాం తం. ప్రపంచంలోని మిగతా సముద్రాలకన్నా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే- ఏ దేశానికి చెందిన భూభాగమూ దీనికి తీరంగా ఉం డదు. అట్లాంటిక్ సముద్రంలో నాలుగు దిశల నుంచి వచ్చే ప్రవాహాలే సర్గాస్సో సముద్రానికి సరిహద్దులు.

12/04/2019 - 00:03

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. ఎనె్నన్నో మలుపులు తిరిగి 55 రోజుల అనంతరం, ఎందరో బలిదానాల తరువాత సమ్మెకు తెరపడింది. సమ్మెను నడిపిన అశ్వత్థామరెడ్డి, ఆయన బృందం గాక సమ్మె బాణం ఎవరిపై ఎక్కుపెట్టారో వారు కార్మికుల మనసు దోచుకునేలా ఘన విజయం సాధించడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు.

Pages