S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/01/2019 - 22:16

టిబెటియన్ల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా ఇటీవల బౌద్ధులనుద్దేశించి కొన్ని ‘రాడికల్’ భావాలు వ్యక్తం చేశారు. అవి అందరూ ఆలోచించదగ్గవి. ముఖ్యంగా బౌద్ధమత అవలంబికులు. మత విశ్వాసం కన్నా విజ్ఞానం ముఖ్యమని ఆయన ఇటీవల నాగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో అన్నారు. ఏ రకంగా చూసినా ఇది గొప్ప పరిణామం. రాడికల్ వ్యక్తీకరణ. భారతీయ విలువలకు ఆయన పెద్దపీట వేశారు.

12/01/2019 - 04:43

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరగాలంటూ తీసుకున్న నిర్ణయంపై కవులు, రచయితలు, మేధావులు, భాషాపండితులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విస్తృతంగా చర్చలు, నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు ప్రముఖులే ఆంగ్లమాధ్యమంలో బోధనను సమర్థించడం తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నది.

11/29/2019 - 01:29

‘మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం’ అంటూ ఈనెల 26న- 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంపీలు ఎంతో ఉత్తేజకరంగా ఉపన్యాసాలు ఇచ్చారు. అదే రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ ఎస్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మహారాష్టలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సంచలన తీర్పు ఇచ్చింది.

11/27/2019 - 00:54

ఝార్ఖండ్ శాసనసభకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 20 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోలు హల్‌చల్ సృష్టిస్తున్నారు.

11/26/2019 - 23:31

ప్రభుత్వాలు నడుచుకునేందుకు విధివిధానాలు, ఆదే శిక సూత్రాలను తెలియజేస్తూ దిశానిర్దేశం చేసేది ‘రాజ్యాంగం’. ‘ప్రభుత్వం శరీరం అయితే, దానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది’. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అలాగే భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి? పరిపాలన ఎలా జరగాలి? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల ఏర్పాటు ఎలా ఉండాలి? వాటిమధ్య సమన్వయం ఎలా ఉండాలి?

11/24/2019 - 01:59

మావోయిస్టులకు మరోసారి ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పశ్చిమ కనుమల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించగా, ఆ కాల్పుల్లో గాయపడిన మావోయిస్టు కీలక నేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒకటవ బెటాలియన్ నాయకుడు, బాంబుల తయారీలో దిట్ట అయిన దీపక్‌ను తమిళనాడు పోలీసులు కోయంబత్తూర్ సమీపంలో ఇటీవల అరెస్టుచేశారు.

11/22/2019 - 05:12

సన్నఖాదీ అంచు పంచె,లాల్చీ,కండువా ధరించి ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆత్మస్థైర్యంతో ఆయన పూర్ణపురుషునిగా కనిపించేవారు. ప్రజాసేవే పరమావధిగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ‘మహోదయ’ వారపత్రికను (తెలుగు, ఆంగ్లం) శ్రీకాకుళం కేంద్రంగా తిమ్మరాజు వెంకట శివరావు స్థాపించారు. నేడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆ పత్రిక ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది.

11/21/2019 - 01:28

కేంద్ర కార్మిక, ఉపాధిశాఖల మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ ఇటీవల మాట్లాడుతూ, ‘ఒకే దేశం-ఒకే వేతన దినం’ విధానంలో కార్మికుల బ్యాంకు అ కౌంట్లలోకి నేరుగా జీతాలు వెళ్లేలా చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు ప్రకటించారు. ఈ యోచన పట్ల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నది. ఇది అమల్లోకి వస్తే- ప్రపంచ కార్మిక లోకం సర్వత్రా హర్షం వ్యక్తం చేయనున్నది.

11/20/2019 - 02:12

ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వింత, విడ్డూరం, వెగటు కలిగించే తీర్మానం. సామాజిక వికాస మేథావి అనుకుంటున్న ఆర్. కృష్ణయ్య ఈ తీర్మానాన్ని చప్పట్లుకొట్టి స్వాగతించటం మరింత దారుణం. ఇది ప్రగతి నిరోధక తీర్మానం.

11/19/2019 - 00:35

యూరి బెంజ్మెవోవ్ రష్యా గూఢచారి. శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో భారతదేశంలో పనిచేయడానికి అతడిని రష్యన్ గూఢచర్య సంస్థ కెజిబి పంపించింది. కమ్యూనిజం సిద్ధాంతాన్ని వొంటబట్టించడం ద్వారా భారతదేశంలో తమకు అనుకూలంగా పనిచేసే ‘మూర్ఖ మేధావుల’ బృందాన్ని తయారుచేయడానికి తన బృందానికి ఆదేశాలు అందాయని ఒక అమెరికా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూరి అన్నారు.

Pages