S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/29/2016 - 23:54

అసలు భవిష్యత్తులో మురికివాడలు లేని భారతదేశాన్ని చూడగలమా? స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఎన్నో ప్రభుత్వాలు మారినా మురికి వాడలు లేని భారతాన్ని చూపిస్తామని నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. మురికివాడలు లేని భారతాన్ని చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాజీవ్ ఆవాస్ యోజన పథకం ఆలోచనకు, ఆచరణకు మధ్య ఎంతో వ్యత్యాసం వుంది.

03/29/2016 - 23:54

మన మాతృభాషగా, ఎంతో ప్రాచీనతను కలిగి పరిపుష్టమైన తెలుగును, మనమే గౌరవించకపోవడం, దానిపట్ల నిర్లక్ష్యం వహించడమంత దౌర్భాగ్యం మరోటి లేదు. మన తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు కూడా తెలుగు భాషను రక్షించడానికి ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 1956నుంచి ఈనాటి వరకు పరిపాలనా వ్యవహారాల్లో తెలుగుకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం దురదృష్టకరం.

03/29/2016 - 01:58

రాజకీయాల కోసం పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కటం సిగ్గు చేటు. కాంగ్రెస్, వామపక్షాలు పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్, వామపక్షాలు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒకరినొకరు ఛెడామడా తిట్టుకుంటూ తమ సిగ్గు లేని ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నాయి.

03/29/2016 - 01:53

విద్యా రంగాన్ని యుద్ధ ప్రాతిపదికన సరిచేయకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుంది. ప్రాధమిక పాఠశాలనుండి విశ్వ విద్యాలయాల వరకు విషబీజాలు నాటే చదువును చెప్తున్నారు. సామాజిక శాస్త్రాలు, చరిత్రను జిహాద్, మతమార్పిడి, ఎర్ర విప్లవ వాదుల రచనలు, బోధన, నిర్వహణలో ఆరు దశాబ్దాలుగా నేర్పుతున్నారు. ఫలితంగా నేడు సెంట్రల్ యూనిర్సిటీలు దేశ ధర్మ విద్రోహులకు నిలయాలుగా మారాయి.

03/28/2016 - 01:59

ఖాకీ నిక్కర్‌లు, శాండోబనియన్‌లు ప్రదర్శించి అది కొంటే యిది కొంటే దీనితో అది ‘‘ఫ్రీ’’అంటూ అమ్మే ఒక ‘‘మెగాషాపు’’కి ప్రారంభోత్సవం చేయడానికి ఒక వర్థమాన టి.వి, ఫిలిమ్ స్టార్ ‘‘రుచిర’’ వస్తోందీ అంటే కుప్పలు కుప్పలుగా ‘‘జీన్సు’’ ‘‘టీ-షర్టులు’’వచ్చిపడ్డారు. రిబ్బన్ కత్తిరించడానికి యింత హంగామావా?

03/28/2016 - 01:57

విద్యాశాఖలో జరుగుతున్న తంతు తమాషాల పై నవ్యాంధ్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. రాష్టవ్య్రాప్తంగా విద్యాశాఖలో జరుగుతున్న జరిగిన అవినీతి అక్రమాలు మరే శాఖలోను లేవన్నది నిర్వివాదాంశం. రాష్టవ్య్రాప్తంగా వివిధ పాఠశాలలకు చదువుల నిమిత్తం వేలాది బాల బాలికలు హాజరవుతున్న మాట వాస్తవం. అయితే సంక్షేమ పథకాల ద్వారా విద్యాశాఖ ద్వారా కోట్లాది రూపాయలు ధన ప్రవాహం బయల్దేరింది.

03/26/2016 - 00:27

జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని 2013లో ప్రభుత్వం ఆమోదించింది. అది మొదలు విధానకర్తలు ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణపై అనేక వాగ్దానాలను గుప్పిస్తున్నారు. ప్రజారోగ్యం, క్షేమం, పనిసామర్థ్యాల పెరుగుదలకు ఆహార భద్రత చాలా అవసరం. దాదాపు భారతీయ మహిళలు అందరూ గర్భిణులుగా వున్న కాలంలో నీరసంగానే వుంటున్నారు. 15-18 మధ్య వయస్సు అమ్మాయిల్లో సగం మంది ఉండాల్సినంత శరీర బరువు వుండటం లేదని తాజా ఆరోగ్య సర్వే చెబుతోంది.

03/24/2016 - 23:54

వేధింపులు... మానసిక, శారీరక హింస, ప్రేమ పేరుతో మోసాలు అత్యాచారాలు... ఇవి తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులు, విద్యార్థినులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇంటా బయటా కొందరు నేరాగళ్ళ పాశవికతకు ‘బలి’అవుతున్నారు. వేధింపులు జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు సరైన విధంగా స్పందించటం లేదు.

03/24/2016 - 23:55

శ్రీరామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాఖీయ శ్రీవైష్ణవులే- చాత్తాద శ్రీవైష్ణవులు. వీరు 11వ శతాబ్దానికి ముందే వున్నట్లు లిఖిత శాస్త్రాలలో పరిచయం. చాత్తాద శ్రీవైష్ణవులు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రలో సర్వత్రా వ్యాపించి వున్నారు.

03/24/2016 - 07:30

కుటుంబంలో భర్త, అత్తమామలు, ఆడపడుచులు ఇతర కుటుంబ సభ్యులద్వారా శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసలకు గురవుతున్న మహిళలు తమ బాధల విముక్తికోసం సివిల్‌చట్టం కింద విడాకులు, లేదా క్రిమినల్ చట్టంకింద ఐపిసి 498ఎ సెక్షన్‌ను ఆశ్రయించేవారు.

Pages