S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/18/2016 - 00:07

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. విద్యార్థుల సంక్షేమం రికార్డులకే పరిమితమైంది. వసతులు లేమి, మెనూను పాటించకుండా సమకూరుస్తున్న భోజనం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా అన్ని వసతి గృహాల్లోనూ వీటి కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

03/18/2016 - 00:06

వసుధైక కుటుంబమని మనం గర్వంగా చెప్పుకొనే ప్రపంచ దేశాలలో శాంతికరువై ప్రజలు అభద్రతాభావంతో మనుగడ సాగిస్తున్నారు. ఎప్పుడు ఉగ్రవాదులతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని మానవాళి భయావహ స్థితిలో అట్టుడికిపోతున్నారు. మతోన్మాదులైన జిహాదీలను మట్టికరిపించే విధానాలను కఠినతరం చేయాల్సిన అవసరం ప్రపంచ దేశాల ముందుంది.

03/17/2016 - 06:38

తాము పండించిన పంటకు ఆశించిన మద్దతు ధర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించక పోవడంతో రైతులలో నిరాశ నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికీ కాడిమేడిని పక్కనపెట్టి వ్యవసాయ రంగంనుంచి తప్పుకుంటున్న రైతులకు కొదవలేదు. భూమిని నమ్ముకొని వృత్తిపరంగా కొనసాగే వ్యవస్థ కొరవడడంతో ‘బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతకవచ్చనే..’ సామెతకు అనుగుణంగా సన్న, చిన్నకారు రైతులు నగరాలకు వలసబాట పడుతున్నారు.

03/17/2016 - 06:36

ప్రతిరోజు జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్‌పైన ఐదారు యాక్సిడెంట్స్ అవుతాయి. అదే సిలిసినాటి నుంచి ప్రిన్స్‌బర్గ్ వరకు కారులో ప్రయాణం చేశాను. ఆ దారిలో యాక్సిడెంట్లు అంతగా కావు. ఆ రోడ్డుపై కారు 120నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మన జాతీయ రహదారి రోడ్డులాగే అమెరికాలో కూడా అంతే వెడల్పు రోడ్లున్నాయి. నివాస స్థలాల మధ్యనుంచి అక్కడ రోడ్లుండవు.

03/16/2016 - 00:51

కాంగ్రెస్‌కు స్వర్ణయుగం 1952-67 మధ్య కాలమని చెప్పవచ్చు. దేశా న్ని పాలించే హక్కు ఒక్క కాంగ్రెస్‌కే ఉంది అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అధికారంలోకి అది రాకపోతే ఎవరొస్తారనిపించేది. ఆ తర్వా త కాంగ్రెస్ అంతటి ధీమాను ఎన్నడూ కనబరచలేక పోయింది. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజంలోని అ పెద్ద వర్గాలను ప్రాంతీయ పార్టీలకు కోల్పోడం ప్రారంభించింది.

03/16/2016 - 00:50

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న సెక్టోరల్ అధికారుల మధ్య సమన్వయ లోపం కొన్ని పాఠశాలలకు శాపంగా మారింది. ప్రతి యేటా పాఠశాలల నిర్వహణకోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇచ్చే పాఠశాలల గ్రాంటు వివరాలను సక్రమంగా పంపని కారణంగా లక్షల రూపాయల గ్రాంటును ఆయా పాఠశాలలు కోల్పోవాల్సి వస్తున్నది.

03/15/2016 - 01:23

సంక్క్షేమానికి పెద్దపీట వస్తూ, అసహాయులకు అండగా నిలుస్తూ ముందుకెళుతున్న కేసిఆర్ నాయకత్వంలోని తెరాసా ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఈ బడ్జెట్‌లో బ్రాహ్మణ సంక్షేమం కోసం నిధులను కేటాయించడం అభినందించాల్సిన విషయం. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘‘సమాజంలో ఇతర వర్గాల లాగానే, బ్రాహ్మణ సమాజంలో పేదలున్నారని ప్రభుత్వం భావిస్తున్నది.

03/14/2016 - 00:38

అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి రేటును పెంచడంలోనూ, జీవ నాణ్యతను పెంచడంలోనూ వెనకబడ్డాయి. కొన్ని దేశాలు అభివృద్ధి రేటు పెంచుకున్నా (ఉదాహరణకు, భారతదేశం) జీవ నాణ్యత విషయంలో బాగా వెనకబడ్డాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డి.పి) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

03/11/2016 - 23:51

రేపు నంద కృష్ణమూర్తి 95వ జయంతి
=======================

03/11/2016 - 01:32

అంతా మామూలుగానే ఉంది. ఏదీ క్రొత్తగా లేదు. పెను సంచలనాలు ఏవీ లేవు. సూర్యచంద్రులు గతులు తప్పలేదు. పగలురాత్రి మామూలుగానే వస్తున్నాయి. దొరికినవాడు ముప్పూటలా మేస్తూనే ఉన్నాడు. వాలెంటైన్స్‌డేను ఎవ్వరూ మరచిపోలేదు. వార్తాపత్రికలు నానా చెత్తనూ యథాప్రకారం దేశంపైకి వదుల్తూనే ఉన్నాయి. దృశ్యమాధ్యమాల్లో వేదాంత ప్రవచనాలు నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకుల దినవారీ నిందారోపణలు సాగుతూనే ఉన్నాయి.

Pages