సబ్ ఫీచర్

ప్రజాధనం అంటే ఇంత చులకనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ ఖజానా పరిస్థితి ‘కంచె చేనుమేస్తే...’ అన్న చందాన మారింది. ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే సొమ్ము అంతా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిందే. ఈ ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండి, అవి సక్రమంగా అభివృద్ధి పనులకు వినియోగించేలా చూడాల్సిన గురుతర బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అటువంటి ప్రజాప్రతినిధులు నేడు వేతనాలు, అలవెన్సుల రూపంలో లక్షలాది రూపాయల ప్రజాధనం పొందుతున్నారు.
అవినీతి అనేది నేటి మన సమాజంలో భాగమైపోయింది. అందువలన, అవినీతి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకొంటే అంత మంచిది. ప్రజాప్రతినిధుల వేతనాలు, ఇతర అలవెన్స్‌లను పెంపుచేస్తూ ఇటీవల అటు తెలంగాణా ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించాయి. గతంలో ఎంపీ లేదా ఎంఎల్‌ఏ పదవులను ఒక హోదాగా మాత్రమే భావించేవారు. దీనిని ఒక ఆర్థిక వనరుగా వారు ఎప్పుడు భావించలేదు. అయితే, నేటి మన ప్రజాప్రతినిధులు మాత్రం దీనిని ఒక ప్రధాన ఆర్థిక వనరుగా భావిస్తున్నారు. ప్రజాసేవకన్నా తాము సంపాదించుకొన్న సొమ్ము భద్రపరచుకోవడానికి, సంపదను మరింతగా పెంచుకోవడానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వడం ఒక్కటే మార్గమనే భావన నేటితరం నాయకులలో నానాటికీ పెరిగిపోతున్నది. దీని కారణంగా, అన్ని రాజకీయ పార్టీలలోను ప్రజాప్రతినిధి కావాలని కోరుకొనేవారి సంఖ్య నానాటికి పెరిగిపోత్నుది. ఈ నాయకుల కోరికను తీర్చడం ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో స్థానాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతున్నది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. అయితే ఇదే చిత్తశుద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంలో చూపకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175, తెలంగాణ శాసనసభలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. విభజన చట్టం ప్రకారం, తెలంగాణలో శాసనసభ స్థానాలు 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 225కు పెంచాలన్నది ప్రతిపాదన. అయితే, ఈ ప్రతిపాదనను అమలుచేయాలంటే, అందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ప్రభుత్వ ఖజానా మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు ఆర్థిక భారం పడుతుంది. శాసనసభ స్థానాలు పెరిగితే, మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. శాసనసభ్యుల సంఖ్య పెంచడం వలన ప్రభుత్వంపై మరింత ఆర్థికభారం పడుతుందే తప్ప, మరే ఇతర ప్రయోజనం ఉండదు. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యంకోసం మాత్రమే శాసనసభ స్థానాల పెంపు ప్రతిపాదన చేశామని చెబుతున్న మాటలు సత్యదూరం. స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించాలని నిర్దేశిస్తూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ రాజ్యాంగ సవరణ చేశారు. అయితే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడ 73,74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంపువలన భవిష్యత్‌లో రాజకీయ నిరుద్యోగులు మరింతగా పెరగడం మినహా, ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు రాబట్టాలి అంటే అది లోక్‌సభ సభ్యులవల్లనే సాధ్యం. లోక్‌సభ స్థానాల సంఖ్య 2034 వరకు పెంచడానికి సాధ్యంకాదు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన వారిలో అత్యధిక శాతం వ్యాపారులు, కంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలే. వీరు తమ వ్యాపార ప్రయోజనాలకే తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉండేవి. లోక్‌సభ ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి మెజార్టీ ఇవ్వడం ఆంధ్రుల ప్రత్యేకత. అటువంటి తరుణంలో కూడ ఈ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంనుంచి ఎక్కువ నిధులు రాబట్టిన దాఖలాలు ఏమిలేవు. అందువలన, శాసనసభ్యుల సంఖ్య పెంచడంవలన, ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడటం మినహా, మరే ఇతర ప్రయోజనం ఉండదు.

- పి.మస్తాన్‌రావు