సబ్ ఫీచర్

పిల్లలు రాని సర్కారీ బళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కారీ ఉపాధ్యాయులు బృందాలుగా పిల్లల వేటలోమండుటెండలను కూడా లెక్క చేయకుండా,పాంప్లెట్లు, ఫ్లెక్సీలతో ఊళ్లలో తిరుగుతున్నారు. ఇప్పుడు సర్కారు ఎప్పటికప్పుడు బడి ఈడు పిల్లల్ని లెక్కకడుతోంది. ఇంతకీ ఎందుకీ శ్రమ? ఇన్నాళ్లూ లేని ఆర్భాటాలు-ప్రచారాలు ఎందుకు? తమ పిల్లలను కార్పొరేట్ చదువు చదివిస్తూ మాకొచ్చే జీతాలు సరిపోవడం లేదని గగ్గోలు పెట్టే ఉపాధ్యాయులు మీ పిల్లల్ని సర్కారు బడిలో చేర్చండంటూ ఎందుకు ఢంకా భజాయిస్తున్నారు? ఒత్తిడిలేని చదువు, ఉచిత సదుపాయాలతో మీ పిల్లల వికాసానికి భరోసా అంటూ ఎందుకు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు? ఎంత గింజుకున్నా చేరేవాడు చేరతాడనేది నిరూపితమవుతూనే ఉంది. కార్పొరేట్ స్కూళ్ల పట్ల ఉదారతను ప్రదర్శించేసి వాటి విచ్చలవిడి సామ్రాజ్యానికి ఊతమిచ్చిన సర్కారు ఇప్పుడు దుందుడుకు దాడులు చేస్తే ఏమిటి ఒరిగేది? విద్యకోసం ఎనె్నన్నో ప్రణాళికల్లో ఎన్నో కేంటాయింపులు చేస్తూ వస్తున్నా ఎన్నడూ లేని బాధ్యత ఈనాడు ఎందుకు పెరిగినట్టు?
2006 విద్యాహక్కు చట్టం ప్రకారం 6-14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని చట్టం తెగేసి చెప్పినా, సర్కారీ బళ్లలో చేరేవారి సంఖ్య నానాటికీ పడిపోతూనే ఉన్నది. మధ్యాహ్న భోజన పథకం ద్వారానైనా పిల్లల డ్రాపౌట్స్ శాతాన్ని తగ్గించాలన్న యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో దాదాపు 14 కోట్ల మందికి పైగా పిల్లలు మధ్యాహ్న భోజనం చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ రాష్ట్రాలలో ఒక్క పిల్లవాడిపై సగటున విద్యకోసం రూ.1000లు ఖర్చు చేస్తుంటే, హర్యానలో అత్యధికంగా రూ.2000 ఖర్చు చేయడం విశేషం. ఇంత చేసినా ఇవన్నీ లెక్కలకే పరిమితమవుతున్నాయి తప్ప, విద్యార్థుల చేరిక శాతాన్ని పెంచలేకపోతున్నాయి. అందుకే బడి వీలీన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. ఇది ఉపాధ్యాయ వృత్తి మనుగడకే పెను ముప్పుగా మారనుంది. అందుకే మండువేసవిలో సైతం ఉపాధ్యాయ బృందం రొడ్డెక్కి మరీ విజ్ఞప్తులు చేస్తున్నాయి. అంతేకాదు సర్కారు బడికి కార్పొరేట్ లుక్ ఇవ్వడానికి తిప్పలు పడుతున్నారు.
‘అంతేకాదు పైసా ఖర్చులేకుండా సర్కారు బడిలో చదివి పైకొచ్చాను’ అని విద్యార్థులు చెప్పుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ‘అపరేషన్ బ్లాక్‌బోర్డు పథకం కింద సదుపాయాలు కల్పిస్తూ, కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా స్కైబ్ ద్వారా సంభాషించే విధానానికీ శ్రీకారం చుట్టింది. అయితే ఇన్ని సౌకర్యాలు తమ పాఠశాలలో ఉన్నాయని ప్రచారం చేసే అవసరం ఇన్నాళ్లూ ఉపాధ్యాయులకు లేకపోయింది. ఇప్పుడు వృత్తే ప్రశ్నార్థకంగా మారేసరికి ఏకంగా విద్యావిప్లవంగా ప్రచారాలు మొదలయ్యాయి. సర్కారీబళ్లుకనుమరుగయ్యే పరిస్థితుల్లో చికిత్స తప్పదన్న అంశాన్ని ఉపాధ్యాయులు గుర్తించడం అభినందనీయం. అయితే వీరిలో ఎంతమంది ఈ కార్యక్రమాల పట్ల మనసు పెడుతున్నారనేది ఓ సంశయం. నేడు కార్పొరేట్ దిగ్గజాలుగాన్నవారిలో వారిలో చాలామంది ఒకనాడు సర్కారీ బళ్లలో చదివినవారేనన్నది అక్షర సత్యం. మండల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ఉపాధ్యాయ అవార్డులను అందుకునేవారు...అందుకోవాలని ఆరాటపడేవారు, గుర్తించుకోవాల్సింది ఒక్కటే. విద్యార్థులలో శాశ్వతమైన ప్రవర్తనా మార్పులు తీసుకొచ్చే అభ్యసనకు అవసరమయిన బోధనను అంకితభావంతో చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులు ఒకింత వెనుకబడి ఉన్నారనేది సత్యం. పనిగంటలు, పనిదినాల సమయాన్ని ఆసరాగా తీసుకొని సర్కారీ విద్యపట్ల చులకన వ్యాఖ్యలు చేస్తూ ఆదాయాన్నిచ్చే ఇతర పనులు చేస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ తీరు మారాలి. విద్య, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ నేడు ఈ రెండింటినీ కార్పొరేట్ రంగం శాసిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యా విప్లవం రావడం సంతోషదాయకమే అయినా, దీన్ని ఎంతవరకు నడిపిస్తారు, ఉపాధ్యాయుల అంకితభావమెంత? అనేవి శేష ప్రశ్నలే.

- పిఎన్‌బిఎస్ శ్రీనివాస్