సబ్ ఫీచర్

కులరహిత సమాజంతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఏ దేశంలో కులాలు లేవు. మన దేశంలో మాత్రమే కులాలు ఉన్నాయ. కుల రహిత సమాజం ఐనప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అణగారిన వర్గాల వారికి దేవుడిలాంటి డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మా వాడని చెప్పుకోవడానికి అగ్రవర్ణాలైన ముఖ్యమంత్రులు పోటీపడి ఎతె్తైన విగ్రహాలను స్థాపించడానికి పూనుకొనడం రాజకీయ ఎత్తుగడలో భాగం. కుల నిర్మూలన జరగాలంటే కులాలకతీతంగా వివాహాలు జరగాలి. వాటిని ప్రోత్సహించాలి. అపుడే కుల రహిత సమాజం ఏర్పాటవుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 66 సంవత్సరాలైనా రిజర్వేషన్ ఫలితాలు పొందని కులాలింకా ఉన్నాయ. రిజర్వేషన్లపై చర్చ జరపదాలనడం శుభపరిణామం. నిరంతరంగా రిజర్వేషన్స్ పొందుతున్న కులాలవారు మాత్రమే రిజర్వేషన్స్‌పై చర్చను వ్యతిరేకిస్తున్నారు.
భారత రాజ్యాంగాన్ననుసరించి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన కొన్ని పార్టీలను మరికొన్ని పార్టీలు మతతత్వ పార్టీలని ప్రజా వేదికల మీదినుండి మాట్లాడడం కేంద్ర ఎన్నికల సంఘాన్ని, భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కాదా? అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించడం, మోసం చేయడం కాదా? ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగాన్ని కలిగివుండి అరవైతొమ్మిది సంవత్సరాలుగా పరిపాలించబడుతున్న ప్రజాస్వామ్య దేశంలో ఏ వర్గానికి సంబంధించిన వారైనప్పటికి అభివృద్ధి చెందుతున్నవారే! మరీ మరీ అభివృద్ధి చెందుచున్నవారు గుప్పెడుమంది మాత్రమే. వివిధ వర్గాలకు సంబంధించిన అత్యధిక సంఖ్యాకులు పీడితులుగానే మిగిలిపోతున్నారు. కాబట్టే వీరు వివిధ కారణాలతో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్నారు. మన దేశం అనేక కులాలతో నిండి ఉన్నందున అభివృద్ధి చెందడం లేదు. సమస్యలకు నిలయంగా మారింది. కాబట్టి కుల రహిత సమాజం కావాలని ఈమధ్య అనేక సంఘాలవారు ప్రజావేదికల మీద, టివి చర్చలలోను ప్రింట్ మీడియాలో వ్యాసాల రూపంలోను, విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘాల మధ్య నిరంతరం చర్చ జరుపుతున్నారు. వీరు ప్రతి సమస్యకు కులమే ప్రాతిపదికగా భావిస్తున్నారు. కులాలు లేని ఐరోపా దేశాలలోను ఇస్లాం, బౌద్ధ దేశాలలోను ఎలాంటి సమస్యలు లేకుండా ఆయా దేశాల ప్రజలు సుఖజీవనం గడుపుతున్నారా? ఎలాంటి పోరాటాలు జరగడం లేదా? ఆర్థిక సమస్యలు లేకుండా, అప్పులు లేని, స్కాములు లేని దేశాలు ఏవైనా ఉన్నాయా? మన దేశంలో కులాల మధ్య వైవిధ్యం ఉన్నదిగాని వైరుధ్యాలు లేవు. కాబట్టే కులాల మధ్య పోరాటాలు జరుగలేదనేది సత్యం. మన దేశంలో మతాల మధ్య, ఇజాల మధ్య పంథాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు ఉండడంవల్ల ఒకరిపై ఒకరు దాడులు జరుపుకొంటున్నారనేది వాస్తవం.
‘సమసమాజం’ నిర్మాణం కావాలంటే, మతాలను, పంథాలను, ఇజాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి సంఘాలను రద్దుచేయాలి. మన దేశంలోని వివిధ మతాల ప్రార్థనాలయాలను, పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా మార్చినట్లయితే అందరికీ ప్రవేశం ఉంటుంది. ఇజాలను తొలగిస్తే వర్గపోరాటాలు ఆగిపోతాయ. రాజకీయ పార్టీలను రద్దుచేసి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన అభ్యర్థుల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటైతే నిష్పక్షపాతంగా పరిపాలన జరుగుతుంది. చట్టసభలకు ఎన్నుకోబడే అభ్యర్థులకు ఒక పర్యాయం మాత్రమే అవకాశం ఇస్తూ కుటుంబ సభ్యులలో ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించినట్లైతే పాలితులు అత్యధిక సంఖ్యలో పాలకులుగా మారడంవల్ల స్వచ్ఛపాలన జరుగుతుంది. కుల రహిత సమాజం కోరుకునేవారు, అభ్యుదయవాదులు, బుద్ధిజీవులు, వివిధ మతాలకు సంబంధించిన మత పెద్దలు, వివిధ రాజకీయ నాయకులు దేశ సమగ్రతను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒకే వేదిక మీది నుండి తగు నిర్ణయాలు తీసుకొని వివాదాస్పదమైన చర్చలకు తెర దించగలరని ఆశిద్దాం.

- బలుసా జగతయ్య