సబ్ ఫీచర్

నైతిక విలువలు పెంచే విద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే మా అబ్బాయి అచ్చు చిన్న డబ్బా చేతిలో పట్టుకుని వచ్చాడు. ‘‘రోడ్డుపై ఉమ్మివేయటం అనైతికమైనది ఆ క్రిములు వాతావరణంలో కలిసి కలుషితం చేస్తాయి. రోడ్లపై బైట మాత్రం, మల విసర్జనలు చేయటం ఏ రకంగా తప్పో, అనైతికంగా భావిస్తామో, రోడ్డుపై ఉమ్మివేయటం కూడా తప్పే’’అని మా అబ్బాయి అచ్చు అన్నాడు.
దీంట్లో అనైతికం ఏం ఉందిరా? అని అడిగాను.
‘‘రోడ్లపై మల, మూత్ర విసర్జనలు చేయటంవల్ల అది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని ఆఫ్రికాలో సర్వేలో తేలింది. వాకింగ్ చేసేటప్పుడు నీకు ఉమ్మివస్తే ఈ డబ్బాలో ఉమ్మివేయమని’’ మా అచ్చు అన్నాడు.
నైతికత అన్నది ప్రభుత్వం చెప్పేది కాదు. సమాజమే కొన్ని విలువలను ఏర్పరుచుకుంటుంది. ఆ విలువలను పాఠశాల విద్యార్థుల్లో కల్పిస్తుందని సమాజం ఆశిస్తుంది. భువనగిరి హైస్కూల్‌లో నేను పనిచేస్తున్నప్పుడు మా తెలిదేవర వెంకట్రావుగారిని పలు విషయాలు అడిగేవాణ్ణి.
విలువల గురించి మన సిలబస్‌లో ఎందుకు పెట్టకూడదని అడిగాను.
విలువలు నైతికత అన్నవి పరీక్షల్లో సిలబస్ కాదు అని తెలిదేవర భానుమూర్తి చెప్పాడు.
మరి ఎలా వస్తుందన్నాను.
దేశభక్తిని ప్రజల్లో మనం కలిగించామా? లేక స్కూల్లో దాన్ని పాఠ్య ప్రణాళిక చేసి చెప్పానా? అని తెలిదేవర అన్నారు.
‘‘జనగణమన’’అనగానే, ఆ పద ఉచ్ఛారణ జరగగానే ఆవరణలో ఉన్నవారంతా ఎట్లా నిలబడతారో చూస్తున్నావా అని తెలిదేవర చెప్పాడు.
జనగణమన అంటే అందరూ ప్రార్థనా గీతాన్ని చదవటంకోసమే కదా వచ్చేదని అన్నాను.
పిల్లల దగ్గరనుంచి వృద్ధులవరకు ప్రార్థనా గీతం అంటే అటెన్షన్‌లో నిలుచుంటారు. పిల్లలు ఒక్కొక్కరు రెండు మీటర్లదూరంలో నిలుచుంటారు. ఏకధాన్యంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దీంతో విద్యార్థుల్లో ఎంత జాతీయత ఏర్పడుతుందో తెలుస్తుంది కదా అని తెలిదేవర అన్నాడు.
నైతిక విలువలు ఒక రోజుతో రావు. కుటుంబం, పాఠశాలలు ఏ ఒత్తిడి లేకుండా పాటించే జీవితంలో భాగంగా నైతిక విలువలు ఉంటాయి.
ఆడ పిల్లలను కొట్టగూడదని నీకు ఎవరు చెప్పారని తెలిదేవర అడిగాడు. మా అమ్మ నాకు చెప్పింది. అమ్మాయిలను ఏ చేతితో కొడతావో ఆ చేయికి కుష్టురోగం వస్తుందని చెప్పిందని అన్నారు. కుటుంబ వ్యవస్థలో భయంతోనో, భక్తితోనో కొన్ని నైతిక విలువలు నేర్పుతాయి. పాఠశాలల్లో కూడా నైతిక విలువలు నేర్పబడతాయి. అదే విధంగా శాసన మండలి కౌన్సిల్‌లో చైర్మన్ చక్రపాణి నైతిక విలువలు ఆయన అనుభవంతో, చలోక్తులతో నేర్పాడు. ఎవరైనా మంత్రి మాట్లాడుతుంటే జవాబు చెబుతుంటే ప్రతిపక్షంగా అడ్డుతగిలే వాళ్లం.
మంత్రి చెబుతున్న విషయాల్ని వింటున్నావా? అని చక్రపాణి అడిగారు.
ఆయన కౌన్సిల్‌లో అనుభవం గలవాడు. బాగా చదువుకున్నవాడు. ప్రాపంచిక జ్ఞానం తెలిసినవాడు. భారతంలో చదువుకున్న జరిగిన కొన్ని క్యారెక్టర్లను చెప్పి సభను కంట్రోల్ చేసేవాడు. చైర్మన్‌కున్న అపూర్వమైన జ్ఞానం ఆ మండలికి నైతిక విలువలను నేర్పుతుంది.అదే విధంగా ఉపాధ్యాయుని యొక్క నైతిక స్థాయినిబట్టి పిల్లల్లో విలువలను నాటగలుగుతుంది. స్కూల్‌లో నైతిక విలువలను చెప్పుతాం. కొందరు తూచా తప్పకుండా ఆ విలువలను పాటిస్తారు. కొందరు పాటించరు. నైతిక విలువలను పాఠశాల చెబుతుంది. అదే విధంగా వాటిని పాటించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. పిల్లల్లో నైతిక విలువలు 12 సంవత్సరాల లోపే నాటవలసి ఉంది. ఎలిమెంటరీ విద్యే వారికి నైతిక విలువలు వంట పట్టించుకునే సమయం. తర్వాత పిల్లల్లో పొరలు ఏర్పడుతాయి. 25 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా నైతిక పొరలు డ్యామేజ్ కూడా కావచ్చును. అధ్యయనమో లేదా మంది సాహవాసాలు, లేక చుట్టుపక్కల వాతావరణం నైతిక విలువలను పటిష్టం చేయవచ్చును. లేదా బలహీనపరచవచ్చును. సమాజంలో ఏర్పడే మార్పులు కూడా నైతిక విలువలను ప్రభావితం చేస్తాయి. నైతిక విలువలు బోధించబడవు. విద్యాలయాలు నైతిక విలువలకు సరైన వాతావరణాన్ని సృష్టించ గలుగుతాయి.

- చుక్కా రామయ్య