సబ్ ఫీచర్

కర్రపెత్తందార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు కొందరు అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏ రాష్ట్రంలో వసూలైన పన్నులు ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమానికే ఖర్చు పెట్టాలి కాని వారి స్వప్రయోజనానికి వారి పార్టీ ప్రచారానికి అధిక ప్రాధాన్యమిచ్చి సామాన్యుల బాగోగులు పట్టించుకోకుండా కర్రపెత్తందార్లుగా వ్యవహరిస్తూ అర చేతిలో స్వర్గం చూపిన ఎన్నికల ముందు వాగ్దానాలు అమలుచేయకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలుగు టీ.వి చానల్స్‌లో వ్యవసాయ, వైద్య, విద్య వగైరా ఐదారు రకాల ప్రచారాలు కార్యక్రమాల మధ్య మొత్తంమీద రోజుకో గంటైనా స్వంత ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ ప్రచారం ఢిల్లీ ప్రభుత్వం పేరుతో చేయిస్తున్నాడు. ఢిల్లీలో తెలుగువారుండొచ్చుగాక కాని ప్రచార సరళి వారినుద్దేసింది కానే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలనాకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ ఒక మహా నగరమూ ఒక రోజులోనో కొద్ది సంవత్సరాలలోనో కేవలం ప్రభుత్వం డబ్బుపై నిర్మించబడలేదు. (అందుకే రోమ్‌వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని ఆంగ్ల సామెత) అనే విషయం మరచి అమరావతిని అజరామరంగా తీర్చిదిద్దుతానని పార్టీలో ఎదురులేదని ఏ పనికావాలన్నా కేంద్రం నిధులివ్వాలని కాలక్షేపం చేస్తున్నారు. ఆనాడు తిరుగులేదనుకొన్న తన మామ యన్.టి.రామారావుకు, లక్ష్మీపార్వతికి మామ లొంగిపోయాడనే మిషతో పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకొన్న సంగతి మరచి వ్యవహరిస్తున్నారు.
ఈరోజు కాకపోతే రేపు తమని కాదని కొడుకు లోకేష్‌ను పైకెత్తుతున్నాడని అల్లుడే గదా లోకేష్’ అని బాలకృష్ణ అనుకోవచ్చేమోగాని మంత్రి మండలిలో వారే ఎదురుతిరగవచ్చునని గుర్తించడం లేదు.
సాంప్రదాయంగా జరిగే ఏ ఉత్సవాలకైనా గుమిగూడే జనాన్నిబట్టి కొన్ని సదుపాయాలు ప్రభుత్వపరంగా చేయవచ్చు. కాని హిందూ దేవాలయ ధార్మిక సంస్థలను గుప్పిట్లోకి తీసుకొని గోదావరి పుష్కరాలకు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే ఖర్చుచేసి వ్యాపార ప్రచారం చేసి కొంతమందిని బలితీసుకున్నట్లే ఇప్పుడు కృష్ణాపుష్కరాలకు చేస్తున్నారు. టి.టి.డి నిధులో మరింకో నిధులో మళ్ళింప చేస్తారు. మిగతా మతాల వాళ్ళు నోరెత్తకుండా ఉండడానికి చర్చిలు కట్టడానికో, మసీదులకో, దర్గాలకో గుణదల మాత తిరునాళ్ళకో ప్రభుత్వ సొమ్ము వెచ్చిస్తారు. వ్యవసాయానికి గ్రామీణాభివృద్ధి విద్యారంగానికి మాత్రం నిధులు సరిపడా వుండవు.
ఈ రాష్ట్రంలోని కృష్ణలో కలిసే మునేరు వగైరాల పరీవాహక ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురిస్తే లేదా ఎగువ నిర్మించిన తుంగభద్ర, కృష్ణా ప్రాజెక్టుల నుండి నీరొదిలితే తప్ప శ్రీశైలం జలాశయం నిండదు. అక్కడొదిలితే గాని కృష్ణా బ్యారేజిలో వి.టి.పి.యస్.కైనా సరిపడే నీరు రాదు. ఇప్పటికే విజయవాడలో కూడా నీటి (మంచినీటి) ఇబ్బంది ఉంది. వ్యవసాయానికి నీరు లేనే లేదు. కృష్ణలోనే లేనపుడు గోదావరి నుండి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ నీరు కృష్ణా కాలవల పంట భూములకు అందవు. వాటి సంగతి పట్టదు. రాబోయే అమరావతికి ఒక జలాశయం కడతారట!
చెరువులన్నీ పూడ్చేశారు. విపరీత తుఫానులు కుంభవర్షాలు ఆదుకున్నా ప్రకాశం బ్యారేజీ దిగువ మరో ఆనకట్ట లేదు అందు నీరంతా సమద్రం పాలే అవుతుంది. వ్యవసాయ భూముల్లో వేసిన బోర్‌వెల్స్‌లో రోజురోజుకు ఇంకా ఇంకా లోతు తీయాల్సి వస్తోంది. వాటిలోనూ నీరు పూర్తిగా అడుగంటిపోవచ్చు. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ ఆలోచించిన విషయాలు. ప్రభుత్వానికి, అధికార్లకు రాజకీయ నాయకులకు మాత్రమే చర్చనీయాంశం కారాదు.

- గొట్టిపాటి మురళీమోహన్