S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/08/2016 - 04:01

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా బలహీన పడిపోతున్నాయనడంలో సందే హంలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పునాదిరాళ్ళుగా ఉంటుంటాయి. అయితే అవినీతి జాడ్యంవల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్ధే బీటలువారుతోంది. వాస్తవ సిద్ధాంతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అయితే రాజ్యాధికారం ప్రజలపైనే చెలాయించటం ఇక్కడి వైపరీత్యం.

06/08/2016 - 03:59

ఈ మధ్య ఏ పత్రిక తిరగేసినా వృద్ధుల దైన్యస్థితి పిల్లల నిరాదరణ వంటి అంశాల మీద కథలు, వ్యాసాలు వస్తూ ఉన్నాయి. ఉదయం పూచిన పూవు సాయంకాలానికి వాడిపోవటం ఎంత సహజమో వృద్ధాప్యం కూడా అంతే. మరీ మంచాన పడి తమ పనులుకూడా తాము చేసుకోలేని వారిని మినహాయించి కొన్ని వర్గాలుగా వృద్ధులను విభజించవచ్చు. 1. ప్రభుత్వ ఉద్యోగులు. వీరు సర్వీసులో తీసుకొన్న జీతానికి రెండింతల పెన్షను పొందుతూ ఉంటారు.

06/07/2016 - 00:43

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పేరిట పలు రాష్ట్రాలలో జరిగే శక్తి పూజల్ని, అమ్మవారి మహోత్సవాల్ని భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జాతర రీతిలో ఉత్సవాల్ని నిర్వహించడం ఆనవాయితీ. భక్తుల మొక్కులను ఆశీస్సులతో ఆదిపరాశక్తి వరాల కల్పవల్లి కోరికల్ని తీర్చడం అనాదిగా వస్తున్న ఆచారం.

06/06/2016 - 05:41

ఎనిమిదవ తేదీ వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారు నాటికి రెండేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తిచేసుకుంటున్నాడు. ఈలోగానే, రెండవ తేదీనాడు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంనాడు- అవతల ధూంధాంలు ప్రేలిపోతూంటే- తాత్కాలిక రాజధాని అంటూ మనం చెప్పుకుంటున్న బెజవాడలో, బెంజి సర్కిల్‌లో నిలబడి, నాయుడుగారు- ప్రజలందరికీ సుదీర్ఘమైన దీక్షోపదేశం అందించారు.

06/06/2016 - 05:40

ఈనాడు విశ్వవిద్యాలయాలల్లో జరుగుతున్న దారుణ పరిస్థితులను చూస్తే చాలా ఆవేదన కలుగుతున్నది. విద్యార్థులను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, సంఘ విద్రోహకర శక్తులు పావులుగా ఉపయోగించుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. ఆ ఖర్చుపెడుతున్న డబ్బు అంతా కూడా ప్రజల సొమ్ము అని తెలుసుకోవాలి.

06/03/2016 - 04:01

వాతావరణ మార్పులు దేశంలోని వివిధ ప్రాంతాలను వైపరీత్యాలతో వణికిస్తున్నాయి. తరచు అనావృష్టి, తుఫాన్లు, వరదలకు గురౌతున్నాయి. వాటి ఉధృతి మునుపటికన్నా ఎక్కువైంది. ఇటీవలి కాలంలోనే ఈ మూడురకాల వైపరీత్యాలు పెరగటం ఆందోళన కలిగించే అంశం. గతంలో దేశం చాలానే అనావృష్టులను చవిచూచింది. కాని 1998 తరువాత వాటి రాక ఎక్కువైంది. 1999, 2002, 2009, 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టుల చేదు రుచి చూడక తప్పలేదు.

06/03/2016 - 04:00

మా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంకోసం కట్టుబడి ఉంటుందని, తాను మారిన మనిషినని ఉద్యోగులకి వేధింపులు ఇబ్బందులు అంటూ ఉండవని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీలమీద హామీలు ఇచ్చిమరీ ఓట్లేయించుకున్నారని అవసరం తీరాక పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకి రావలసిన కరువుభత్యం ఇవ్వకుండా ఇంతకాలం నెట్టుకొచ్చారు. కరువుభత్యం అడిగితే 43% ఫిట్‌మెంటు ఇచ్చాం.

06/02/2016 - 05:53

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటికీ చాలా ఊళ్ళలోని వీధులు కులాల పేరుతోనే చెలామణి అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడూ కూడా కులాలు సజీవంగానే ఉన్నాయి. కులాభిమానం ఉండేదే తప్ప కుల దురభిమానం ఉండేది కాదు. కులం తిట్లు సజీవమే. ఇప్పుడా తిట్లు కొన్ని వర్గాల వారికి పరమ నేరం.

06/02/2016 - 05:52

ఉపాధ్యాయుడనే వ్యక్తికి ప్రతిరోజు కొత్తే. ప్రతిరోజు ఒక నూతన సూర్యోదయం. అది కాదనుకునేవాడికి ఇది అరిగిన పాఠం. లేదనుకుంటే అది అయిపోయిన పాఠం. అమెరికన్ అధ్యక్షుడు ఐరన్ ఓవర్ ఒకసారి ఇలా అన్నాడు. ‘‘ఉపాధ్యాయులకై నిరంతరం శోధన జరుగుతూనే ఉండాలి.’’ తరగతి గదికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థి పరీక్షకు వెళుతున్నట్లు ఉంటుంది. పరీక్షకుపోయే విద్యార్థికి ఏమి జ్ఞప్తికి రాదు. అప్పుడు భయపడుతుంటాడు.

05/31/2016 - 23:48

మే నెలలో విజయవాడ, హైదరాబాద్‌లలో 3వేదం వర్సెస్ స్వేదం2 అని రెం డు సభలు జరిగాయి. తరువాత నాటకీయంగా బ్రాహ్మణకులం ఉత్పత్తికి సంబంధించనిదని, వారికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు కేటాయించరాదని ఇచ్చినది ఉపసంహరించాలని కొన్ని సంఘాలు కోరాయి.
నాలుగువేదాలు చదివి, బ్రాహ్మణుల వృత్తి ని పరిశోధించిన ఎవరీ నిర్ణయం చేశారో?

Pages