S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/23/2016 - 05:18

సింహాచలం, మార్చి 22 : శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనం చెక్క అరగదీత ప్రారంభ ప్రక్రియపై గతంలో నెలకొన్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గంధం చెక్కల అరగదీతకి సంబంధించి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి వ్యాఖ్యానించిన నేపథ్యంలో దేవస్థానంతో పాటు అడివివరం ప్రాంతంలో ఈ అంశంపై మళ్లీ చర్చకి తెరలేచింది.

03/23/2016 - 05:18

విశాఖపట్నం, మార్చి 22: పన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆస్తిపన్ను చెల్లించాలంటూ ఎన్ని నోటీసులిచ్చినా స్పందన కానరావట్లేదు. దీంతో మొండి బకాయిల వసూలు ఒక్కటే మార్గమని మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) అధికారులు తలపోశారు. దీంతో గాంధీగిరీని అశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖలో మంగళవారం చోటుచేసుకున్న సంఘటన పన్నుల వసూళ్లలో స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టింది.

03/23/2016 - 05:01

విశాఖపట్నం: మండే ఎండలకు ఈక్వినాక్స్ ప్రభావం తోడవడంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూమధ్య రేఖ మీద సూర్యుడు నిట్టనిలువుగా ఉండటానే్న ఈక్వినాక్స్ ఫినామినాగా వ్యవహరిస్తారు. ఏటా మార్చి 21, 22 తేదీల్లో ఇది చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో భూమి సూర్యుడి నుండి దూరంగా కానీ దగ్గరకు కానీ వెళ్లకుండా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.

03/22/2016 - 16:49

విజయవాడ: ఏపిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలులు వీస్తున్నందున జనం రోడ్డెక్కేందుకు భయపడుతున్నారు. చాలాచోట్ల పగటిపూట రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది. అనంతపురం, నందిగామలో అత్యధికంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.

03/22/2016 - 15:54

హైదరాబాద్: జలవనరులను సంరక్షించడం ద్వారా రాబోయే అయిదేళ్లలో ఏపిని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. ప్రపంచ జలసంరక్షణ దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటిని పరిరక్షించుకునేందుకు అందరూ దీక్ష వహించాలన్నారు. నదుల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దీక్ష వహించిందని తెలిపారు.

03/22/2016 - 15:52

హైదరాబాద్: ఏపి అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల మంగళవారం సభలో ప్రకటించారు. హోళీ, గుడ్‌ఫ్రైడే సెలవుల కారణంగా మూడు రోజులపాటు అసెంబ్లీని వాయిదా వేశారు. ఈరోజు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు జలసంరక్షణ విధానం, సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం గురించి మాట్లాడారు.

03/22/2016 - 15:52

హైదరాబాద్: ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయబోనని, అయితే తాము న్యాయ పోరాటం చేస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ మంగళవారం తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

03/22/2016 - 15:52

కడప: చిట్టీల పేరిట వసూలు చేసిన కోటి రూపాయల నగదుతో ప్రభావతి అనే మహిళ ఉడాయించిన సంఘటన రైల్వే కోడూరులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందరితోనూ నమ్మకంగా ఉంటూ ఆ మహిళ భారీగా డబ్బులు వసూలు చేసి, ఇపుడు ఆచూకీ లేకుండా పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభావతిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

03/22/2016 - 15:51

కడప: ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేసేందుకు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వైద్య విద్యార్థులు అడ్డుకోవడంతో ఇక్కడి ఫాతిమా మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు కోటిన్నర రూపాయల పన్ను బకాయిలను చెల్లించాలని మున్సిపల్ కార్పొరేషన్ పలుసార్లు నోటీసులు పంపినా ఫలితం దక్కలేదు. దీంతో మెడికల్ కాలేజీ భవనాలను జప్తు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు.

03/22/2016 - 15:51

హైదరాబాద్: అసెంబ్లీలో వైకాపా సభ్యులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు వారికి చెంపపెట్టులాంటిదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. వ్యక్తుల కన్నా వ్యవస్థలు గొప్పవన్న నిజాన్ని ఇప్పటికైనా వైకాప్ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలన్నారు.

Pages