ఆంధ్రప్రదేశ్‌

కడపలో వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేసేందుకు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వైద్య విద్యార్థులు అడ్డుకోవడంతో ఇక్కడి ఫాతిమా మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు కోటిన్నర రూపాయల పన్ను బకాయిలను చెల్లించాలని మున్సిపల్ కార్పొరేషన్ పలుసార్లు నోటీసులు పంపినా ఫలితం దక్కలేదు. దీంతో మెడికల్ కాలేజీ భవనాలను జప్తు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే, వారిని లోనికి రానీయకుండా విద్యార్థులు, ఇతర సిబ్బంది అడ్డుకున్నారు. కళాశాలలోకి అడుగుపెడితే సహించేది లేదని విద్యార్థులు హెచ్చరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.