S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/24/2016 - 12:31

చిత్తూరు: ఓ కేసు విషయమై పోలీసులు వేధించడంతో మనస్తాపం చెందిన రామనాథం అనే యువకుడు వాల్మీకిపురంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఇతను కొన్నాళ్ల క్రితం వాల్మీకిపురం వచ్చి స్వీట్‌స్టాల్ నడుపుతున్నాడు. ఆన్‌లైన్‌లో పలువురిని మోసగించిన ఓ నిందితుడి గురించి వివరాలు చెప్పాలంటూ పోలీసులు రామనాథాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు రామనాథాన్ని శారీరకంగా హింసించారన్న ఆరోపణలున్నాయి.

03/24/2016 - 12:31

హైదరాబాద్: కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కె.సాయిప్రతాప్ గురువారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన యుపిఎ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సాయిప్రతాప్ చేరికతో కడప జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని టిడిపి నాయకులు భావిస్తున్నారు.

03/24/2016 - 08:42

ఏలూరు, మార్చి 23: తానెంతో అభిమానించే చెల్లి ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్న కూడా 24గంటలు తిరగకుండా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో మనస్తాపానికి గురైన తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

03/24/2016 - 08:41

విజయవాడ, మార్చి 23: 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే, ఒక్కపూటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అథినేత జగన్ అన్నారో? లేదో? తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ దీన్ని ఒక సవాలుగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ 21 మంది ఎమ్మెల్యేలను వైకాపా నుంచి తమ పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో టిడిపి అథినేత ఉన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మరింత ప్రణాళికాబద్ధంగా చేపట్టనున్నారు.

03/24/2016 - 08:11

విజయవాడ: విజయవాడ మెట్రో రైలు అనుకున్న సమయానికి పట్టాలెక్కేట్టు కనిపించడం లేదు. 2018 నాటికి మెట్రో రైలును పట్టాలపై పరుగులు తీయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతోపాటు ఇతరత్రా కారణాల వలన ఈ ప్రాజెక్ట్ 2020 నాటికి కూడా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

03/24/2016 - 07:52

నెల్లూరు: రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలని వాటిని మార్గదర్శకాలుగా పాటించాలని చంద్రబాబునాయుడుకు అవి రెండూ లేవని ఉన్నదల్లా అబద్ధాలు చెప్పటం, నమ్ముకున్న వారిని మోసం చేయటమేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

03/24/2016 - 07:51

విశాఖపట్నం /తాడేపల్లి: హోలీ పండుగలో విషాదం నెలకొంది. ఐదుగురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. విశాఖ బీచ్‌లో ఇద్దరు. కృష్ణా నదిలో ఇద్దరు మునిగి మృతి చెందారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయ. కృష్ణానదిలో స్నానానికి వచ్చి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందారు. సదరు ఘటనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

03/24/2016 - 07:51

విజయవాడ: సరిగ్గా మరో ఐదు నెలల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కర ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. గోదావరి పుష్కరాల్లో కూడా ఇటువంటి జాప్యం కారణంగానే హడావుడిగా పనులు చేపట్టారు. అందులో చాలా వరకూ నాశిరకం పనులే జరిగాయన్న ఆరోపణలను ప్రభుత్వం మోయాల్సి వచ్చింది. దీనిపై దర్యాప్తునకు కూడా ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

03/24/2016 - 05:35

హోలీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తనను కలిసిన బంజారా మహిళలతో డాన్స్ చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు

03/24/2016 - 05:33

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి రాష్ట్ర పరిణామాలను వివరించారు.

Pages