S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/13/2016 - 13:10

తిరుపతి: తిరుమల ఘాట్‌రోడ్‌లో బుధవారం తెల్లవారు జామున ఎలుగుబంటి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్లే ఇది మరణించి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎలుగు మృతదేహంపై బలమైన గాయాలున్నందున వాహనం ఢీకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

04/13/2016 - 13:10

విజయనగరం: ఎమ్మెల్యేల వలసలతో ఇప్పటికే డీలా పడిపోతున్న వైకాపాకు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బొబ్బిలి వైకాపా శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తన మద్దతుదార్లతో విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఆయన టిడిపిలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

04/13/2016 - 13:08

చిత్తూరు: జిల్లాలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించి 11 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు టన్నుల దుంగలను, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు బడా స్మగ్లర్లు ఉన్నట్లు చెప్పారు.

04/13/2016 - 13:07

ఏలూరు: ఇక్కడికి సమీపంలోని వట్లూరు వద్ద బుధవారం ఉదయం విజయవాడ వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి తల్లి (30), కూతురు (6) మరణించారు. ప్రమాదవశాత్తూ వీరు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలకు కొద్దిదూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

04/13/2016 - 08:49

హైదరాబాద్, ఏప్రిల్ 12: అమరావతి రాజధాని ప్రాంతంలోని భూములను భూసమీకరణ, భూసేకరణ చట్టం కింద మళ్లీ వర్గీకరించాలని నిర్ణయించినట్లు, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

04/13/2016 - 08:45

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలో ప్రజలకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, వేధింపులు లేకుండా పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆదాయ సముపార్జిత శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.

04/13/2016 - 08:30

భీమవరం, ఏప్రిల్ 12: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 6 నుండి 9వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఉమ్మడి ప్రశ్నాపత్రాన్ని ప్రవేశపెట్టింది. మంగళవారం నుంచి ప్రారంభమైన పరీక్షలకు ఈ ఉమ్మడి ప్రశ్నాపత్రం విధానం అమలుచేస్తున్నారు. తొలిసారిగా ఎస్‌ఇఆర్‌టి ప్రశ్నాపత్రాలను అన్ని తరగతులకు అమలుచేశారు. ఇప్పటివరకు జిల్లాల స్ధాయిల్లో ప్రశ్నాపత్రాల రూపకల్పనచేసి, డిసిఇ బోర్డు ద్వారా అందచేసేవారు.

04/13/2016 - 08:29

విశాఖపట్నం, ఏప్రిల్ 12: గత ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఈసారి మండుతున్న ఎండలతో కోస్తా జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కృష్టా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే మూడు మీటర్ల దిగువకు భూగర్భజలాలు వెళ్లాయి. రాష్ట్రంలో భూగర్భజలాల తీరును పరిశీలించేందుకు భూగర్భ జలవనరుల శాఖ వివిధ ప్రాంతాల్లో పీజోమీటర్లు ఏర్పాటు చేసింది.

04/13/2016 - 08:28

ఒంటిమిట్ట, ఏప్రిల్ 12: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలు తిరుమల వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న తరహలోనే జరుపుతామని టిటిడి ఇఓ సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా అధికారులతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించేందుకు ఒంటిమిట్ట విచ్చేశారు. ముందుగా సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు.

04/13/2016 - 08:27

విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస గృహం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రి ఇంటి మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించేవారు. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. అంతేకాకుండా భద్రతను మరింత పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కలిగి ఉన్నారు.

Pages