S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/05/2016 - 15:10

హైదరాబాద్: ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఎపికి అన్యాయం చేస్తే ప్రజల పక్షాన పోరాడతామని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రత్యేకహోదాపై ప్రధాని మోదీ ప్రకటన చేస్తే స్పష్టత వస్తుందన్నారు. తాము కేంద్రంతో రాజీపడుతున్నామన్న ఆరోపణలు వస్తున్నా జనం కోసం ఇంకా ఓపికపడుతున్నామని ఆయన చెప్పారు.

05/05/2016 - 12:18

శ్రీకాకుళం: ఎపి సిఎం చంద్రబాబు గురువారం ఉదయం ఇక్కడి అరసవిల్లిలోని ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆదిత్యుడిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లారు.

05/05/2016 - 12:17

శ్రీకాకుళం: జిల్లాలోని భావనపాడు వద్ద పోర్టు నిర్మిస్తే పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ టెక్కలి, పలాస నియోజకవర్గాల టిడిపి నాయకులు, భూనిర్వాసితులతో మాట్లాడారు. భూసేకరణ న్యాయబద్ధంగా జరుగుతుందని గనుకు పోర్టు నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

05/05/2016 - 12:17

అనంతపురం: రంగనాయకులు అనే ఆర్టీసీ డ్రైవర్ బుధవారం అర్ధరాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ సంచలనం సృష్టించింది. అధికారుల వేధింపుల వల్లే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఉదయం కార్మికులు ఆందోళన చేపట్టారు.

05/05/2016 - 12:16

విజయవాడ: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఎపి ప్రజలను బిజెపి నేతలు దారుణంగా వంచించారని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ విమర్శించారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఎపికి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని రాష్ట్ర విభజన సమయంలో గొప్పలు చెప్పిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఇపుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

05/05/2016 - 12:16

విశాఖ: ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రం ప్రకటించినందుకు నిరసనగా గురువారం ఇక్కడ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదాపై ఇకనైనా నోరు విప్పకపోతే బిజెపి నేతలను ఎక్కడికక్కడ ఘెరావ్ చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రధాని అమలుచేయాలని వారు నినాదాలు చేశారు.

05/05/2016 - 12:15

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటూ కేంద్రమంత్రులు చేసిన ప్రకటనలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ ధర్నా జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎపి ప్రజలను టిడిపి, బిజెపి మోసం చేశాయని విమర్శించారు. కేంద్రమంత్రులు తమ ప్రకటనలను వెనక్కి తీసుకుని వెంటనే ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

05/05/2016 - 12:14

విశాఖ: ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో ఇక్కడి కెజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది గిరిజనులు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి స్వస్థలమైన జి.మాడుగుల మండలానికి వైద్యసిబ్బంది చేరుకుని గాలిస్తున్నారు.

05/05/2016 - 08:20

తిరుమల, మే 4: అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన ట్రరిజల్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ డైరెక్టర్ రాజేష్‌కుమార్ రూ.1.5కోట్లు విలువ చేసే రెండు స్వర్ణ సుదర్శన సాలగ్రామాల హారాలను విరాళంగా అందించారు.

05/05/2016 - 04:05

శ్రీకాకుళం, మే 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనానికి గురైనట్లు కన్పించింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి హోదాపై కేంద్రం ప్రకటన చిరాకు తెప్పించినట్లు స్పష్టంగా కన్పించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం చేరుకున్న బాబు మూడు గంటల వరకూ తన ప్రత్యేక బస్సులో ఉండిపోయారు.

Pages