S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/02/2016 - 05:50

అనకాపల్లి, మే 1: విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో కిడ్నాప్‌కు గురైన బాలుడు కొణతాల ఉదయ్ (8) హత్యకు గురయ్యాడు. బాలుడి మృతదేహాన్ని ఏలేరు కాలవ గట్టు పొదల్లో పోలీసులు ఆదివారం గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, బాలుని దుస్తుల ఆధారంగా ఉదయ్ మృతదేహాన్ని గుర్తించారు. గత శుక్రవారం గుర్తు తెలియని కొంతమంది ఉదయ్‌ను కిడ్నాప్ చేసినట్టు తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెప్పారు.

05/02/2016 - 05:46

విజయవాడ, మే 1: ‘స్వార్ధ ప్రయోజనాల కోసం తాను కేంద్రంతో రాజీపడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం నాకెం తో బాధ కలిగిస్తోంది. అలా రాజీపడటం నా జీవితంలోనే లేదు. అయితే ప్రజల కోసం ఎలాంటి రాజీకైనా, త్యాగానికైనా సిద్ధపడతా’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

05/02/2016 - 05:43

హైదరాబాద్, మే 1: వచ్చే నెల 15వ తేదీ నాటికి హైదరాబాద్‌నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి తరలించనున్న మొదటి విడత ప్రభుత్వ శాఖల గుర్తింపు దాదాపు ఖరారైంది. అమరావతి రాజధాని ప్రాంతంలో వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు వేగవంతమవుతున్న విషయం విదితమే.

05/02/2016 - 05:38

విజయవాడ, మే 1: హైదరాబాద్ నుంచి రాజధానికి ఉద్యోగులు తరలి రానున్నారు. వారు నివాసం ఉండేందుకు కావల్సిన ఇళ్ళను నిర్మించేపనిలో పడ్డారు రైతులు. ఈ ఇళ్ళు నిర్మించాలంటే కూలీలు కావాలి కదా! అసలు సమస్య ఇక్కడే మొదలైంది. వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు తయారవుతున్నాయి. వీటికి వేల సంఖ్యలో కూలీల అవసరం ఉంది. ఉన్న ఊళ్ళో తాపీ మేస్ర్తీ పని చేసేవారితో కథ నడిపిద్దాం అని రైతులు అనుకున్నారు. అయితే, వారు హ్యాండిచ్చారు.

05/01/2016 - 17:15

విజయవాడ:విభజన చట్టం మేరకు కేంద్రంనుంచి రావలసిన నిధులకోసం రాజీలేని పోరాటం చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్రంనుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్నారు. నిధుల రాబట్టే విషయంలో తగిన విధంగా స్పందించడం లేదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, ఇది రాజకీయమని అన్నారు.

05/01/2016 - 16:30

విజయవాడ:అసంఘటిత కార్మికులకోసం ఏపీ ప్రభుత్వం చంద్రన్న భీమా పథకం పేరిట ఓ స్కీమ్‌ను ప్రకటించింది. విజయవాడ ఏ1 కనె్వన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా కొత్త భీమా పథకంగురించి వివరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 1.5కోట్లమంది కార్మికులకు ఈ పథకం వల్ల లబ్ది చేకూరుతుందని ఆయన చెప్పారు. పనిచేస్తున్న కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.

05/01/2016 - 04:27

విశాఖపట్నం, ఏప్రిల్ 30: కృష్ణ, గోదావరి నదీజలాల పంపిణీ, వినియోగానికి కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల సిఎంలతో కూడిన అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నీరు- ప్రగతి కార్యక్రమంలో భాగంగా విశాఖ నగరంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ అపెక్స్‌బాడీ ఏర్పాటు అంశాన్ని విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తుచేశారు.

05/01/2016 - 04:06

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని, అందుకు అవసరమైన వౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ హెల్త్‌సిటీలో అపోలో గ్రూప్ రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన 250 పడకల ఆసుపత్రిని శనివారం ఆయన ప్రారంభించారు.

05/01/2016 - 03:56

గుంటూరు, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రహదారుల చక్రబంధంలో ఇరుక్కోనుంది. అందుబాటులో జాతీయ రహదారులు ఉన్నప్పటికీ అనాలోచిత నిర్ణయాల కారణంగా వందల కోట్ల రూపాయల వృథా ఖర్చుతోపాటు భవిష్యత్తు ప్రయోజనాలకు ప్రమాదకరంగా పరిణమించే నిర్ణయాలతో డిజైన్లు రూపొందిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజధాని ప్రాంత, నగర, సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌లను సింగపూర్ సర్బానో జురాంగ సంస్థ అందించింది.

05/01/2016 - 03:38

విజయవాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలగపూడి దగ్గర నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం విస్తరణ, వౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.530 కోట్లు మంజూరు చేసింది.

Pages