ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు ముందు ‘కర్నూలు పార్టీ పంచాయితీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: వైకాపా నుంచి వలసలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో అదే స్పీడులో వర్గ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి, నంద్యాల తెలుగుదేశం ఇన్‌చార్జ్ శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రెండు వర్గాలను పిలిపించుకుని పంచాయితీ పెట్టారు. ఎవరికి వారు సిఎంను కలిసి తమ వాదనలు వినిపించారు. ముందుగా శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు చంద్రబాబును కలిసి భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించినట్లు తెలిసింది. తాము మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్యమంత్రిని కలిసారు. వీరిద్దరూ శిల్పాపై ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఓపికగా ఇరువర్గాల వాదనలు విని కలిసి పనిచేయాలంటూ సూచించారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భూమా నాగిరెడ్డికి స్థానం లభించబోతుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ పంచాయితీ ప్రత్యేకతను సంతరించుకుంది.