S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/20/2016 - 04:46

హైదరాబాద్, మే 19: ఆంధ్ర రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చే విషయమై నియమించిన జస్టిస్ మంజునాత్ కమిషన్ నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంజునాథ్ కమిషన్ పనిని వేగవంతం చేయాలన్నారు.

05/19/2016 - 18:19

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రోను’ తుపాను ప్రస్తుతం కోస్తాంధ్ర తీరం వెంబడి కొనసాగుతోంది. ఫలితంగా ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ముమ్మడివరంలో నాలుగు గంటల వ్యవధిలో సుమారు 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాకు 5 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కాకినాడ, విశాఖ తదితర జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

05/19/2016 - 17:24

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా రిటైర్డ్ ఉపాధ్యాయిని మాదల ఝాన్సీలక్ష్మి రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఈమేరకు ఆమె గురువారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు.

05/19/2016 - 17:21

విశాఖ: తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తున్నందున విశాఖ ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కిరండొల్-కొరాపుట్ లైన్‌లో గురువారం కొండచరియలు విరిగిపడడంతో ఓ రైలు ఇంజన్, బోగీ ధ్వంసమయ్యాయి. దీంతో కెకె లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

05/19/2016 - 17:20

కాకినాడ: తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులు వీచడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం తదితర తీర ప్రాంతాల్లో అలలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతోంది.

05/19/2016 - 17:19

విజయవాడ: తుపాను ప్రభావంతో బందరు వద్ద కెరటాలు భారీగా ఎగసిపడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

05/19/2016 - 16:10

కర్నూలు: తుపాకీ పొరపాటున పేలడంతో ఓ గన్‌మెన్ గాయపడి ఆస్పత్రి పాలైన సంఘటన కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం బోధనం గ్రామంలో జరిగింది. సర్పంచ్ మహేశ్వర రెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న గన్‌మెన్ సుబ్రమణ్యం గురువారం ఉదయం తుపాకీని శుభ్రపరుస్తుండగా మిస్‌ఫైర్ అయింది. తీవ్రంగా గాయపడిన గన్‌మెన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించరు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది.

05/19/2016 - 13:20

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘రోను’ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ‘రోను’ తుపాను ఒడిశావైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను ఎపి ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

05/19/2016 - 13:19

కాకినాడ: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త కట్టుకున్న ఇల్లాలిలే కడతేర్చి మృతదేహాన్ని చెరువులో పడేసిన ఘటన తొండంగి మండలం చిన్నాయిపాలెంలో గురువారం వెలుగు చూసింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

05/19/2016 - 06:55

కర్నూలు, మే 18: కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పుకోసం రెండు నెలలు వేచిచూస్తానని, అప్పటికీ ఆయన తీరు అలాగే ఉంటే గోదావరి నదీ జలాలకోసం జలదీక్ష చేస్తానని వైకాపా అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Pages