S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/18/2016 - 07:12

శ్రీకాకుళం, మే 17: తుది దశకు ‘అణువు’ చేరుకుంటోంది. ప్రతిష్ఠాత్మకంగా భారత-అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జి.ఇ.కంపెనీ, వెస్టింగ్‌హౌస్ పర్యవేక్షణతో శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. పది వేల మెగావాట్ల సామర్థ్యంతో లక్ష కోట్ల రూపాయలతో దీనిని నిర్మిస్తున్నారు.

05/18/2016 - 07:12

కర్నూలు, మే 17 : రాష్ట్రంలో కరవును తలపై పెట్టుకుని తిరిగే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కరే అని, బాబు వస్తే జాబు రాదు కానీ కరవు మాత్రం శరవేగంగా వస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.

05/18/2016 - 07:11

గుంటూరు, మే 17: రాజధాని అమరావతి నగరంలో జోన్లకు సీఆర్డీయే కసరత్తు జరుపుతోంది. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ప్రకారం నివాసాలు, వాణిజ్య, వ్యాపార భవనాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిర్దిష్టమైన అనుమతులు తప్పనిసరి చేశారు. ఈనెల 20వ తేదీతో రైతుల ప్లాట్ల పంపిణీ ప్రక్రియపై అభ్యంతరాల గడువు పూర్తవుతుంది. నెలాఖరులోగా భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభించాలని సీఆర్డియే భావిస్తోంది.

05/18/2016 - 07:10

పోలవరం, మే 17: పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తికావాలంటే పక్కా ప్రణాళిక అవసరమని కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్ల్యుసి) మాజీ ఛైర్మన్ ఎపి పాండ్య అన్నారు. సిడబ్ల్యుసి మాజీ సభ్యులు వైబి పాండా, డిపి భార్గవ్, పోలవరం అథారిటీ కార్యదర్శి ఆర్కె గుప్తతో కలిసి మంగళవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.

05/18/2016 - 07:09

కర్నూలు, మే 17 : కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టులేనని ఏపి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమైనవని తేల్చేందుకు తమ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో వాటిని కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.

05/18/2016 - 05:13

హైదరాబాద్, మే 17: ‘ప్రత్యేక హోదా కావాలని ప్రధానిని కోరాను’ ‘అయినా హోదా వస్తే ఏం వస్తుందండి? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభమండి’? ‘హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందాయండి’?- ఇవన్నీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో చేసిన పొంతన లేని వ్యాఖ్యలనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ప్రత్యేక హోదాపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలివి.

05/18/2016 - 05:11

విజయవాడ, మే 17: గడచిన రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న డిఎస్సీ 2014 అభ్యర్థుల కలలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయి. సుమారు 10,300 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం జరిగిన డిఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు 2015 జూన్ 2వ తేదీ విడుదలయ్యాయి. కోర్టు వివాదాలతో నియామకాల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దీనిపై అభ్యర్థులు రెండేళ్లుగా ఆందోళన చేస్తూ వచ్చారు.

05/18/2016 - 05:08

విశాఖపట్నం, మే 17 : బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం రాత్రికి చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం దక్షిణ దిశగా కదులుతూ చెన్నై తీరాన్ని సమీపిస్తున్నదని తెలిపారు.

05/17/2016 - 18:16

విజయవాడ: ఎపి ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే వైకాపా అధినేత జగన్ దిల్లీ వెళ్లి దీక్షలు చేయాలని ఎపి మంత్రి పత్తిపాటి పుల్లారావు సలహా ఇచ్చారు. రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికి జగన్ చేస్తున్న దీక్షలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాల్లో కడుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు.

05/17/2016 - 18:16

కర్నూలు: కాపుకులస్థుల ప్రగతి కోసం గతంలో ఎవరూ చేయని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి మంగళవారం ఇక్కడ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహించిన సదస్సులో అన్నారు. సదస్సు సందర్భంగా వచ్చిన సూచనలను అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. 344 మంది లబ్దిదార్లకు సుమారు మూడున్నర కోట్ల రూపాయల రుణాలను ఆయన అందజేశారు.

Pages