S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/18/2016 - 16:23

కర్నూలు: నదులపై ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారం ప్రాజెక్టులను కడితే దిగువ రాష్ట్రాల పరిస్థితి ఏమిటని వైకాపా అధినేత జగన్ ప్రశ్నించారు. ఇక్కడ మూడు రోజులుగా చేస్తున్న జలదీక్షను ఆయన బుధవారం మధ్యాహ్నం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదులపై మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్నందున ఎపి రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.

05/18/2016 - 16:22

ఏలూరు: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) పనులకు ఎపి సర్కారు అడ్డుపడుతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని, అసలు చర్చలకు రాకుండానే విమర్శలెందుకు చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాయచూరు కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్ రాశారంటున్న లేఖను హరీష్‌రావు బహిర్గతం చేయాలన్నారు.

05/18/2016 - 16:21

విజయవాడ: భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.

05/18/2016 - 16:20

విశాఖ: ఎడతెరిపిలేని వర్షానికి నానిపోయిన గోడ కూలిపోవడంతో నరసాయమ్మ అనే వృద్ధురాలు మరణించింది. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.

05/18/2016 - 13:56

తిరుమల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం ఉదయం కేబుల్స్ అంటుకుని శ్రీవారి ఆలయం సమీపంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. వర్షం కురుస్తుండగా మరోవైపు దట్టమైన పొగ కమ్మేయడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు.

05/18/2016 - 13:50

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో ఎపిలో పలు జిల్లాల్లో బుధవారం నాడు విస్తారంగా వర్షం కురుస్తోంది. వాయుగుండంగా ఇంకా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో కోస్తాజిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం , కృష్ణపట్నం, ఓడరేవు తదితర తీర ప్రాంతాల్లో స్థానిక ప్రమాద సూచికలను ఎగురవేశారు.

05/18/2016 - 13:50

కర్నూలు: తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి బుధవారం ఇక్కడ అన్నారు. తెలంగాణలో చేపట్టే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామన్నారు. వైకాపా అధినేత జగన్ చేస్తున్న దీక్షలను ఎవరూ పట్టించుకోనవసరం లేదన్నారు.

05/18/2016 - 13:50

గుంటూరు: వెలగపూడి వద్ద చేపట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులను ఎపి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినులు బుధవారం పరిశీలించారు. వీరు హైదరాబాద్ నుంచి మూడు బస్సుల్లో ఇక్కడికి చేరుకున్నారు. ఆరు బ్లాకుల్లో చేపట్టిన సచివాలయ నిర్మాణం పనులు వచ్చే నెల 15 నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రెయిన్ ట్రీ పార్కు వద్ద గృహనిర్మాణాలను కూడా ఉద్యోగినులు పరిశీలించారు.

05/18/2016 - 13:49

తిరుపతి: వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా బుధవారం ఉదయం ఎడతెరిపి లేని రీతిలో వర్షం కురుస్తోంది. ఉదయం 11 గంటల సమయానికే పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకటి, రెండు రోజులు ఇలాగే వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. భారీ వర్షంతో ఆలయ పరిసరాల్లో నీరు చేరడంతో భక్తులు నానాపాట్లు పడుతున్నారు. మోటార్లను వినియోగించి వరద నీటిని బయటకు పంపుతున్నారు.

05/18/2016 - 13:49

విజయనగరం: గ్రామదేవత పండగ సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలూ పరస్పరం దాడులకు దిగడంతో ఓ యువతి గాయపడింది. జియ్యమ్మవలస మండలం గడసింగిపురంలో బుధవారం గ్రామదేవత జాతర సమయంలో ఈ సంఘటన జరిగింది. గాయపడిన యువతికి పార్వతీపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Pages