ఆంధ్రప్రదేశ్‌

చర్చలకు రాకుండా విమర్శలెందుకు?: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) పనులకు ఎపి సర్కారు అడ్డుపడుతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని, అసలు చర్చలకు రాకుండానే విమర్శలెందుకు చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాయచూరు కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్ రాశారంటున్న లేఖను హరీష్‌రావు బహిర్గతం చేయాలన్నారు. మూడు రాష్ట్రాలకు చెందిన నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టరాదన్నారు. అక్రమంగా ప్రాజెక్టులు కడితే ఆయకట్టు చివరి భూముల పరిస్థితి ఏమిటని దేవినేని ఉమ ప్రశ్నించారు. అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి పదివేల కోట్ల రూపాయల మేరకు కాంట్రాక్టులు తీసుకున్న జగన్ నేడు దొంగదీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.