ఆంధ్రప్రదేశ్‌

మంజునాథ్ కమిషన్ ఏమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ఆంధ్ర రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చే విషయమై నియమించిన జస్టిస్ మంజునాత్ కమిషన్ నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంజునాథ్ కమిషన్ పనిని వేగవంతం చేయాలన్నారు. బడ్జెట్‌లో కాపుల సంక్షేమానికి ఐదు వేల కోట్లరూపాయలు మంజూరు చేస్తామని చెప్పారని, కాని వందకోట్లు కూడా ఇంతవరకు ఖర్చుపెట్టలేదన్నారు. కాపుల సంక్షేమం కోసం చంద్రన్న కాపు భవనాలను నిర్మిస్తామని పేర్కొనడం తగదన్నారు.