S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/25/2016 - 15:18

తిరుపతి: పట్టణంలోని ఓ హోటల్‌లో బుధవారం నాడు వంట మాస్టార్ల మధ్య వివాదం ముదిరి కార్మికులు పరస్పరం దాడులకు దిగారు. ఈ సందర్భంగా ముగ్గురు హోటల్ కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

05/25/2016 - 15:17

కాకినాడ: వైకాపా అధినేత జగన్‌తో తనకు దోస్తీ ఉందని నిరూపిస్తే ఉద్యమాన్ని ఆపేస్తానని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం బుధవారం నాడు ఎపి సిఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈమేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తన రాజకీయ అనుభవం అంత వయసులేని జగన్ నుంచి తాను సలహాలు పొందాల్సిన అవసరం లేదన్నారు.

05/25/2016 - 12:14

విజయవాడ: రాష్ట్ర సమస్యలపై ఎలాంటి అవగాహన లేని కొన్ని పార్టీల నేతలు సిఎం చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఇక్కడ బుధవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎపిని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకు తప్ప ఎవరికీ లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలకు స్వస్తి పలికి, రాష్ట్ర ప్రగతి కోసం అన్ని వర్గాల వారూ సిఎంకు సహకరించాలన్నారు.

05/25/2016 - 12:14

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయలేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వడం లేదని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇక్కడ బుధవారం బిజెపి ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు త్వరలోనే గడువు ముగుస్తుందని తెలిపారు. ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

05/25/2016 - 12:13

విజయవాడ: గత రెండేళ్ల కాలంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా నవ్యాంధ్రలో రెవెన్యూ శాతాన్ని పెంచుకోగలిగామని సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో జిల్లాల మధ్య పోటీతత్వం పెరగాలన్నారు. నవ్యాంధ రెండేళ్ల పాపలాంటిదని ఆయన అభివర్ణించారు. లక్ష్యసాధనకు కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిల్లో అధికారులంతా అంకిత భావంతో పనిచేయాలన్నారు.

05/25/2016 - 12:12

విజయనగరం: తాటిపూడి రిజర్వాయర్‌లో మంగళవారం గల్లంతైన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం వారి మృతదేహాలు లభించాయి. దీంతో మృతుల బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి.

05/25/2016 - 12:12

విజయవాడ: ఎపిలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ 11 శాతం వృద్ధిరేటును సాధించామని, ఈ విషయంలో కలెక్టర్ల పాత్ర కీలకమని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇక్కడ బుధవారం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సేవారంగం, పరిశ్రమల రంగంలో వలే ఇతర విభాగాల్లోనూ ప్రగతి సాధించాలన్నారు. ఆర్థికంగా అన్ని జిల్లాలూ బలోపేతం కావాలంటే కలెక్టర్లు పోటీతత్వంతో పనిచేయాలన్నారు.

05/25/2016 - 08:49

శ్రీకాళహస్తి, మే 24: రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఈ ఏడాదిలోనే కుంభాభిషేకం చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. మంగళవారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 2012లో జరగాల్సిన కుంభాభిషేకం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందని గురవయ్యనాయుడు, ఈ ఓ భ్రమరాంబలు వెల్లడించారు.

05/25/2016 - 08:48

తిరుపతి, మే 24: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందే తరుణంలో తిరుపతిలో నిర్వహిస్తున్న మహానాడుకు విచ్చేసే కార్యకర్తలు, నాయకులకు హైటెక్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మరో 48 గంటల్లో (శుక్రవారం నుంచి) తిరుపతిలోని నెహ్రూమున్సిపల్ హె స్కూల్ క్రీడామైదానంలో ప్రారంభం కానున్న మహానాడుకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి.

05/25/2016 - 08:34

గుంటూరు, మే 24: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ భవనాలు జీ ప్లస్ వన్‌కే పరిమితం కానున్నాయి.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తును ఆరు లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ భవనాలు జూన్ 15 నాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే సచివాలయ విభాగాలన్నింటికీ ఈ భవనం సరిపోదనే భావనతో మరో రెండంతస్తులతో కలుపుకుని మొత్తం 12లక్షల చదరపు అడుగులలో నిర్మించాలని నిర్ణయించారు.

Pages