S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/25/2016 - 05:09

రాజమహేంద్రవరం, మే 24: ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం వాగులు, వంకల ద్వారా వృథాగా పోయే జలాలను సైతం ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తోంది. వృథాగా పోయే కొండ కోనల్లోని వాగులు, సెలయేర్ల నీటిని సద్వినియోగం చేయడానికి రిజర్వాయర్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు కనుమల్లోని పాములేరు వాగుపై సాగునీటి ప్రాజెక్టుకు అంకురార్పణ పలికారు.

05/24/2016 - 17:13

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమృత్’ పథకం కింద ఎపిలో 33 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం 800 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలను ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని, అనుకున్న సమయానికే సచివాలయాన్ని తరలిస్తామన్నారు.

05/24/2016 - 17:12

నెల్లూరు: తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై త్వరలో అనర్హత వేటు పడుతుందని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మంగళవారం ఇక్కడ తెలిపారు. రాజకీయ స్వార్థంతో పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి కూడా అవమానాలు తప్పవన్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా ఫిరాయింపులకు పాల్పడడం అనైతికమన్నారు.

05/24/2016 - 17:12

కడప: రాష్ట్రం గురించి ఏనాడూ పట్టించుకోని వైకాపా అధినేత జగన్ దీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ జరిగిన టిడిపి మినీ మహానాడులో ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సహకరించడానికి బదులు అభివృద్ధి పథకాలకు ఆయన అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణలో అక్రమ నీటి ప్రాజెక్టులపై జగన్ దిల్లీలో నిరాహార దీక్షలు చేయాలని గంటా సూచించారు.

05/24/2016 - 16:53

విజయవాడ: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈనెల 27న ఏపీ సర్కారు ప్రకటన చేయనుంది. జూన్‌ 6 నుంచి 9 వరకు ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. జూన్‌ 15 నుంచి ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

05/24/2016 - 14:16

విజయవాడ: 2014కు ముందు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కాపులకు చేసిందేమీ లేదని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాపులపై కాంగ్రెస్‌కు ఇన్నాళ్లూ లేని ప్రేమ ఇపుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిందన్నారు.

05/24/2016 - 13:35

హైదరాబాద్: ఎపిలోని పది గురుకుల జూనియర్ కాలేజీలు, రెండు గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రన్స్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. గురుకుల విద్యాలయాల్లో అయిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన ఎంట్రన్స్ ఫలితాలను కూడా ఆయన విడుదల చేశారు.

05/24/2016 - 13:34

విజయవాడ: నవ్యాంధ్ర నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు మహిళగా నీలిమ చరిత్ర సృష్టించింది. పర్వతారోహణకు ఇటీవల బయలుదేరిన ఆమె మంగళవారం ఉదయం నాటికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు ఇక్కడికి సమాచారం అందింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది.

05/24/2016 - 13:32

విశాఖ: ఇక్కడికి సమీపంలోని రాంకీ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకర్ కెమికల్స్‌లో అమ్మోనియం నైట్రేట్ ట్యాంకు పేలడంతో మంటలు వ్యాపించాయని సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగినపుడు ఎక్కువ మంది కార్మికులు లేనందున ప్రాణనష్టం జరగలేదు.

05/24/2016 - 11:57

హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ తప్పనిసరి కావడంతో విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ‘నీట్’ను ఈ ఏడాదికి మినహాయంపు ఇస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోదం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Pages