S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/26/2016 - 12:04

విజయవాడ: అవినీతికి పాల్పడేవారే ఆలయాలకు వెళుతూ హుండీల్లో డబ్బులు వేస్తుంటారని వ్యాఖ్యానించిన ఎపి సిఎం చంద్రబాబు గురువారం తన మాట మార్చారు. దేవుళ్లు, నమ్మకాలకు సంబంధించి తాను చెప్పిన మాటలను ఓ వర్గం మీడియా తప్పుగా ప్రచారం చేసిందని వివరణ ఇచ్చారు. ఇక్కడ గురువారం కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు.

05/26/2016 - 12:03

హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో వైకాపా అభ్యిర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో వైకాపా అధినేత జగన్ గురువారం భేటీ అయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు జగన్ సమావేశంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఎపి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు, వైకాపా నుంచి ఒకరు రాజ్యసభకు ఎన్నికవుతారు.

05/26/2016 - 11:59

గుంటూరు: తెనాలి పట్టణం ఐతానగర్ వద్ద చెరువులో మునిగి గురువారం ఉదయం ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేసవితాపం అధికంగా ఉండడంతో వీరు చెరువులో దిగారు. మృతులను చందు (6), సుశీల్ (5), లావణ్య (5)లుగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలముకుంది.

05/26/2016 - 11:58

తిరుపతి: తిరుపతిలో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే పార్టీ ప్రతినిధులకు ఇక్కడ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ప్రధాన వేదిక నిర్మాణం అనుకున్న స్థాయిలో లేదని పార్టీ యువనేత నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదిక నిర్మాణంలో ఆయన దగ్గరుండి కొన్ని మార్పులు చేయిస్తున్నారు.

05/26/2016 - 11:58

నెల్లూరు: తమిళనాడుకు చెందిన కొందరు రౌడీషీటర్లు కొద్దిరోజులుగా సూళ్లూరుపేటలో తిష్ట వేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓ అంబులెన్స్ డ్రైవర్ ఇంట్లో వీరు ఆశ్రయం పొందినట్లు తెలిసింది. పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేసి రామలింగరాజు అనే రౌడీషీటర్‌ను పట్టుకోగా, మరో నలుగురు నిందితులు పరారయ్యారు.

05/26/2016 - 06:52

విజయవాడ, మే 25: విశాఖలో జూలై రెండవ తేదీన సాగర తీరాన బే మారథాన్ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక సత్ సంకల్పంతో ఈ మారథాన్‌ను చేపడుతున్నామని అన్నారు. ఈ మారథాన్ ప్రజలకు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు.

05/26/2016 - 06:52

నెల్లూరు, మే 25: నామినేషన్ల ప్రా రంభం కావడంతో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం నాలుగు స్థానాల కోసం ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో శాసనసభ్యుల మెజార్టీని బట్టి టిడిపి మూడు స్థానాలు, వైసిపి ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ ఒక్క స్థానాన్ని కూడా టిడిపి గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ నాల్గవ స్థానానికి, నెల్లూరు జిల్లాకు లింకు ఏర్పడింది.

05/26/2016 - 06:51

కర్నూలు, మే 25: వివాదాస్పద ప్రాజెక్టు రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఎత్తు పెంచడానికి కర్నాటక ప్రభుత్వం సిద్ధపడగా తమ వైపు పూడిక తీయడానికి తెలంగాణ ప్రయత్నిస్తోందని రైతులు మండిపడుతున్నారు.

05/26/2016 - 06:50

విజయవాడ, మే 25: విజయవాడలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది పనిచేయకపోయినా ఆదాయం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఆశాఖ ఆదాయం 27 శాతం పెరిగిందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆలయాల్లో పవిత్రమై హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. తప్పులు చేసిన వారు, బాధల్లో ఉన్న వారు ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళుతున్నారు. తద్వారా హుండీ ఆదాయం పెరుగుతుంది.

05/26/2016 - 06:50

కడప, మే 25: కడప జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తన బాబాయ్ వైఎస్.వివేకానందరెడ్డికి పులివెందుల నియోజకవర్గం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ పటిష్టతకు తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంథా అవలంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Pages