S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

08/28/2017 - 20:58

చూస్తూనే ఉన్నాం

08/21/2017 - 21:03

కోట్లు వెచ్చించి తీస్తున్న సినిమాలు థియేటర్ల వద్ద చతికిల పడుతున్న వైనం చూస్తుంటే బాధేస్తోంది. గత వారం మూడు పెద్ద సినిమాలు వచ్చాయ. నితిన్ లై, బెల్లంకొండ జయజానకి నాయక, రానా నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు ఎంతమందిని ఆకట్టుకున్నాయ. ఎంతమందికి సినిమా సంతృప్తిని మిగిల్చాయ. హిట్ రేంజ్‌కి చేరని సినిమాలకు కోట్ల వసూళ్ల ఎలా వస్తున్నాయ. చూస్తుంటే, తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్ నడుస్తోందేమో అనిపిస్తుంది.

08/14/2017 - 20:49

వాసుకి చిత్రసమీక్ష బాగుంది. అయితే చట్టాలన్నీ తెలిసిన లాయర్ భర్త ఆధ్వర్యంలో చట్టవిరుద్ధంగా ఆత్మహత్యకు ప్రేరేపించి విలన్‌లను చంపే తీవ్ర న్యాయ ప్రతిపాదన సమాజానికి ఎంతో చేటు చేస్తుందని చెప్పడం సరే. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విలన్‌లను హీరో చంపడం చూస్తున్నాం. అపరిచితుడు, భారతీయుడు, ఠాగూర్ లాంటి చిత్రాలే కాక హత్యచేసి తెలివిగా తప్పించుకునే దృశ్యం లాంటి చిత్రాలూ వచ్చాయి. ఇలాంటివి హిట్ అయాయి.

08/07/2017 - 21:21

హీరోగా గోపీచంద్ గ్రాఫ్ అంతంతమాత్రంగానే ఉన్న టైంలో వచ్చిన సినిమా గౌతమ్‌నంద. టైటిల్ బావుందికానీ, సినిమా తేలిపోవడంతో గోపీచంద్ కెరీర్ క్వొశ్చన్ మార్కైంది. విడుదలకు ముందు రొటీన్ పబ్లిసిటీలాగే ఆహా ఓహో అనేసినా, థియేటర్లలో బోర్ కొట్టించాడు. తన ఈడు హీరోలతో పోటీ పడలేక జిల్ తరువాత గ్యాప్ తీసుకుని సినిమా చేసినా ఫలితం లేకపోయింది.

07/31/2017 - 20:43

కొద్దికాలం క్రితం వరకు హీరోయిన్లు తమకెవరూ పోటీ కాదు. ఎవరి సినిమాలు వాళ్లకుంటాయి. ఏ పాత్రకు ఎవరు సూట్ అవుతారో వాళ్లనే తీసుకుంటారు దర్శకులు. మరి పోటీ ఎక్కడ అనేవారు. కాని ఈమధ్య ట్రెండ్ మారింది. ఒక సినిమాకు ఒక హీరోయిన్‌ని అనుకున్న తర్వాత ఆమెను తప్పించి మరొకరిని తీసుకునే సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. మరి పోటీ ఉన్నట్టే కదా! అప్పుడలా అన్న హీరోయిన్లు ఇప్పడు అన్ని రంగాల్లోనూ పోటీ ఉంది, ఇక్కడా ఉంది.

07/24/2017 - 23:32

ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. ముగ్గురు కాదు. నలుగురు హీరోలు. ‘ఐదు’కోట్ల కథను రక్తికట్టించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒక్క హీరో రెండు భాగాల కథను చెప్పే స్టయిల్‌కు భిన్నంగా -నలుగురు హీరోలు సింగిల్ పాయింట్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. ఏమైంది? పాతకంపు కొట్టింది. కథలో హీరో పాతకాలపు రోల్స్ రోయిస్ కారు అయినంత మాత్రాన -కథను నడపలేదుగా. నడపాల్సింది డ్రైవర్లేగా.

07/17/2017 - 20:42

పూర్వం సినిమాలు శతదినోత్సవాలు జరుపుకుంటే ఎంత లాభం వచ్చిందో తెలియకపోయినా హిట్ అనేవారు. ఈ కాలంలో ఏ గొప్ప సినిమా అయినా పాతిక రోజులు ఆడకున్నా సూపర్‌హిట్టని ప్రచారం చేస్తున్నారు. వెయ్యి థియేటర్లలో వారం ప్రదర్శనలోనే ఏ మాత్రం సినిమా బాగున్నా వంద కోట్ల వర్షం కురుస్తోంది. అదే హిట్ సినిమాగా ముద్రపడిపోతోంది.

07/10/2017 - 20:44

తెలుగు సినిమా కథ ఏమిటంటే చిన్నపిల్లవాడు కూడా చెబుతాడు. పాత చింతకాయ పచ్చడికి కొత్త తాళింపు అని. భారీ హీరో, కోట్లకు కోట్లు ఖర్చులు, అత్యాధునిక హంగులు అన్నింటిమీద ఎంతో శ్రద్ధపెడుతూ కీలకమైన కథ, కథనాలనే గాలికి వదిలేస్తున్నారు. భారీ అంచనాలు పెరుగుతూ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్ళతో ఎదురుచూసే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఏ యేడు చూసినా విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా ఉంటున్నాయి.

07/03/2017 - 20:50

వరుస విజయాలతో టాలీవుడ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్ వేగానికి దువ్వాడ జగన్నాథం కాస్త బ్రేక్ వేసినట్టు అయ్యంది. వైవిథ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, మాస్ హీరోయజానికి మరింత పదును పెట్టుకుంటూ వస్తున్న బన్నీ, డిజెలో చేసిన ప్రయోగం తనవరకూ ఓకే అయనా, దర్శకుడు హరీశ్ శంకర్ వైఫల్యం బన్నీ కెరీర్‌కు బ్రేక్ వేసిందా? అనిపించింది.

06/26/2017 - 21:28

తెలుగులో వచ్చే ‘ఆత్మ’ కథల పంథా మారడం లేదు. పాడుబడిన భవంతి లేదంటే కొత్త అపార్ట్‌మెంట్. అవుట్‌డోర్‌లోకి వస్తే ఓ ఫాంహౌస్ లేదంటే సిటీకి దూరంగా ఉండే అడవి. కొనే్నళ్ల క్రితం హత్యకు గురైనవాళ్లో, కొన్ని జన్మల క్రితం ఆశతీరని వాళ్లో.. ఆత్మరూపం ఎత్తడం సినిమాకు సరిపడినంత పగను కథగా అందించటం. పోస్టర్లు మారుతున్నాయ తప్ప, స్క్రీన్ మీద స్టోరీ మారడం లేదు. పోయనవారం వచ్చిన అవంతిక అందుకు మినహాయంపు కాదు.

Pages