మీ వ్యూస్

అన్నీ వాళ్లమాటలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దికాలం క్రితం వరకు హీరోయిన్లు తమకెవరూ పోటీ కాదు. ఎవరి సినిమాలు వాళ్లకుంటాయి. ఏ పాత్రకు ఎవరు సూట్ అవుతారో వాళ్లనే తీసుకుంటారు దర్శకులు. మరి పోటీ ఎక్కడ అనేవారు. కాని ఈమధ్య ట్రెండ్ మారింది. ఒక సినిమాకు ఒక హీరోయిన్‌ని అనుకున్న తర్వాత ఆమెను తప్పించి మరొకరిని తీసుకునే సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. మరి పోటీ ఉన్నట్టే కదా! అప్పుడలా అన్న హీరోయిన్లు ఇప్పడు అన్ని రంగాల్లోనూ పోటీ ఉంది, ఇక్కడా ఉంది. పోటీ వుంటేనే సమర్థత బయటపడుతుంది అంటున్నారు. ఇంతలో ఎంత మార్పు!
-పవన్‌పుత్ర, రామారావుపేట

ఎందుకంత కోపం?
ఒక కామెడీ షోలో ‘రాఘవేంద్రరావు హీరోయిన్లను అందంగా చూపిస్తారు కానీ నాభిమీదకు పళ్లు విసరడంలో ఏం అందం ఉందో ఆయనకే తెలియాలి’ అన్నదట తాప్సీ. దాంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. భావ, వాక్ స్వాతంత్య్రాలు తమకేగాని ఇతరులకు ఉండవని నెటిజన్ల నమ్మకం. తాప్సి ఆ దర్శకునికి క్షమాపణ చెప్పినా వీరు శాంతించడంలేదు. తాప్సీ చెప్పినదాంట్లో తప్పేం ఉంది? అలాంటి సీన్లు చూసి మేము కామెంట్లు చేసేవాళ్లం. బొడ్డుమీద గుమ్మడికాయ విసిరితే పాత్ర చచ్చి ఊరుకుంటుంది. అప్పుడు అందరూ హాపీ అనుకునేవాళ్లం. ఎవరి అభిప్రాయం వారిది. కోపం ఏల?
-సోనాలి, సూర్యారావుపేట
కిక్ కోసమేనా..?
వారం పది రోజులుగా తెలుగు నాట మోగుతున్న మాట డ్రగ్స్. ఈ అంశంపై ఎందరో ఎన్నో చెప్పినా కొత్త విషయాలు రెండున్నయి. మోర్ కిక్ అన్నది బహుళ జనాభిప్రాయం కాగా, కొత్త విషయాలు- బాగా అలసిపోయి అర్థరాత్రి ఇంటికి చేరుకుంటే నిద్ర పట్టక మర్నాడు ముఖం పీక్కుపోతుంది. కొద్దిగా డ్రగ్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టి మర్నాడు ఫ్రెష్‌గా కళకళలాడుతూ ఉంటుంది ముఖం. ఇక రెండో అంశం శరీరాకృతి బాగుండాలని జిమ్‌లో శ్రమిస్తే కండరాలు పట్టేస్తాయి. ఆ నొప్పి తగ్గడానికి స్వల్పంగా డ్రగ్స్ తీసుకుంటారు. నిజానికి డ్రగ్స్ స్లో పాయిజన్. మనిషిని పీల్చేసే పిప్పి చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త!
-సదాప్రసాద్, గొడారిగుంట
ఆనాటి స్నేహబంధం!
1948వ సంవత్సరం చివరినాటికి వాహిని స్టూడియో నిర్మాణం పూర్తి అయినది! ఆ స్టూడియోలో మొదటి చిత్రం గుణసుందరి కథ ఆరంభమైనది. ఆ చిత్రంలో కస్తూరి శివరావు, జూనియర్ శ్రీరంజని, సౌంత్ ఇంజనీర్‌గా శివ.శివరామ్ ముఖ్యపాత్రధారులు! కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో ఆరంభమైన ఈ చిత్రానికి మాటలు వ్రాయడానికి కమలాకర కామేశ్వరరావు, పింగళి నాగేంద్రని కె.వి.రెడ్డి పరిచయం చేశారు. అప్పటినుండి పింగళి కలంనుండి ఎన్ని అమృతధారలు కురిసినవో? ఆ తరంవారికి తెలుసు. పింగళి, కె.వి.రెడ్డి స్నేహబంధం విజయావారి సంస్థలో ఆచంద్ర తారాస్థాయిలో నిలచిన ఎన్నటికీ మరపురాని సంఘటన. అది తలచుకుంటే తనువు పులకిస్తుంది! ఆనాటి అనుభూతి మనసును వికసింపజేస్తుంది.
-కెవిపి రావు, కందుకూరు
పిచ్చికి పరాకాష్ట
ఓ ప్రైవేట్ చానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టే విధంగా నిర్వహిస్తున్నారు. జూలో జంతువుల్లాగా రకరకాల మనస్తత్వాలతో కోపాలు తాపాలు ఆవేశాలతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయా నటీనటులు అసహనంగా ఆ సెట్‌లో తిరుగుతున్నారు. ఈ షో ఉద్దేశ్యం ఏమిటో నిర్వాహకులకు కూడా తెలుసా? ప్రేక్షకులకు అర్థంకాని విధంగా ఆయా నటీనటుల నటనా కౌశల్యం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. వారాంతంలో జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించే సమీక్షలు చూస్తుంటే ఆయనపై వున్న క్రేజ్ తగ్గే విధంగా వుంది. నాటకీయ పరిణామాలతో అర్థంలేని వినోదాల పేరుతో ప్రేక్షకులకు పిచ్చి ముదిరేలా ఈ కార్యక్రమం చూస్తే చానల్స్ ప్రసారం చేసేవాటిపై విరక్తి కలుగుతోంది. ప్రేక్షకుల మానసిక దౌర్భాగానికి ఇలాంటి షోలు దోహదం చేస్తాయి అనడం నిజం. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కుటుంబ కథా వస్తువుతో వినోదాత్మకంగా చిత్రీకరించడం చేతకాక అంతా పాశ్చాత్య సంస్కృతి కుప్ప పోసినట్లుగా నానా యాగీ చేస్తున్నారు.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఆ హీరోతో నటించిన వారంతా...
హాస్య హీరోగా, కుటుంబ కథా చిత్రాల హీరో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోలకు తమ్ముడిగా, విలన్‌గా విభిన్న పాత్రలలో నటించిన చంద్రమోహన్‌కు ఒక ప్రత్యేకత వుంది. చంద్రమోహన్‌తో తొలి హీరోయిన్‌గా నటించిన వారందరూ ఉన్నత శిఖరాలను అందుకున్నారు. అప్పుడు అదొక సెంటిమెంట్ కూడా- చంద్రమోహన్‌తో నటించినవారు పెద్ద పెద్ద హీరోయిన్‌లుగా ఎదిగారు. వాణిశ్రీ (రంగులరాట్నం), విజయనిర్మల (బంగారుపిచ్చుక), జయప్రద (సిరిసిరిమువ్వ), జయసుధ (లక్ష్మణరేఖ), శ్రీదేవి (పదహారేళ్ళ వయస్సు), రాధిక (రాధాకల్యాణం, పెళ్లిచూపులు), విజయశాంతి (పెళ్లి చేసి చూపిస్తాం, సుందరీ సుబ్బారావు), సుహాసిని (శిక్ష), అనురాధ పంచకల్యాణి సినిమాలో చంద్రమోహన్‌తో నటించి హీరోయిన్ కాకపోయినా గొప్ప డాన్సర్‌గా ఎదిగింది. తాళ్ళూరి రామేశ్వరి (సీతామహాలక్ష్మి), ప్రభ (సీతాపతి సంసారం), మాధవి (ఒక చల్లని రాత్రి), లక్ష్మి (బాంధవ్యాలు), రోజారమణి (్భరతంలో ఒక అమ్మాయి), వెన్నిరాడై నిర్మల (బొమ్మా బొరుసు)- వీరే కాక అతని పక్కన హీరోయిన్‌గా కాకుండా నటించిన చంద్రకళ (ఆత్మీయులు), జయలక్ష్మి, తులసి ఇతర నాయకలూ చంద్రమోహన్‌తో నటించినవారే.
-ఏఆర్‌ఆర్ గౌడ్, ఖమ్మం