S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

11/06/2017 - 18:27

ప్రముఖ సినీ నాటక అభ్యుదయ రచయిత అయిన యం.వి.యస్.హరనాథరావు మరణం కళాకారులకు, రచయితలకు కళాభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కేవలం తను నమ్ముకున్న నాటక రంగమునకు చనిపోయేవరకు సేవ చేసిన కళామణి. ఎన్నో ఎన్నో నాటకాలకు రచయితగా తాను సుపరిచితుడు. ‘జగన్నాధ రథచక్రాలు’ అనే నాటకం రచించి నటించిన మేటి కళాకారులు. మంచి సంభాషణలతో ప్రజల్లో ఆలోచనాశక్తిని పెంపొందించిన నాటక కర్త. నాటక సమాజాలు అంటే పంచప్రాణాలు.

11/06/2017 - 18:26

విద్య, వైద్యం, న్యాయ, పోలీస్ వ్యవస్థలు వాటికున్న నియమ నిబంధనల ప్రకారం నడుస్తాయి. సినిమాల్లో ఆ వ్యవస్థల్ని చూపేటప్పుడు అవి పాటించే విధి విధానాలకు వ్యతిరేకంగా చూపించకూడదు. కాని మన దర్శకులు సర్వస్వతంత్రులు కదా! వారికే రూల్స్ తెలియవు, తెలిసినా పట్టించుకోరు. ఫోన్ టాపింగ్ ప్రత్యేక పరిస్థితుల్లో పై అధికారుల ఆదేశ ఆమోదాలతో చేయాలి.

10/30/2017 - 18:53

ఎలాంటి పాత్ర అయినా అద్భుతమైన కమిట్‌మెంట్, అచంచల దీక్షతో అలవోకగా లీనమైపోయి మెప్పించడం ఈ తరం నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ వంటి అతి కొద్ది నటులకే సాధ్యం. ఆ ఎన్టీఆర్‌కు వారసుడుగా వచ్చిన ఈ ఎన్టీఆర్ తానెంత గొప్ప నటుడో జై లవకుశ చిత్రం ద్వారా మెప్పించాడు. స్వంత వాళ్లే చులకనగా చూడడం వలన ఈ సమాజంపై కసితో పెరిగిన జై పాత్రని ఎన్టీఆర్ అద్వితీయంగా చేశాడు.

10/30/2017 - 18:52

తెలుగు సినీ జగత్తులో పోతన చిత్రం ఓ అద్భుత కళాఖండం. నటీ నటులందరూ ఉద్దండ పిండాలే. సంగీత సాహిత్యాలు, సంభాషణలు ఏమా త్రం పక్కదారి పట్టకుండా నిండు కుండలా అన్నీ సమపాళ్లలో కుదిరాయి. ముఖ్యంగా పోతనగా నాగయ్య నటన, సంభాషణలు పలికిన తీరు, వదనంలో అత్యంత ప్రశాంతత, ఆటుపోట్లు వచ్చినా చెరగని చిరునవ్వు, రామభద్రుని మీద అచంచల విశ్వాసం వీటన్నిటిని ఏకకాలంలో వ్యక్తీకరించడం ఆ మహానటునికే చెల్లు.

10/30/2017 - 18:51

ఆస్కార్‌లు ఆంగ్ల చిత్రాలకే పరిమితం. ఆంగ్లేతర చిత్రాలు పోటీపడేది ఉత్తమ విదేశీ చిత్రం అనే ఒక్క విభాగంలోనే. పోటీ చాలా తీవ్రంగా వుంటుంది. అంత పోటీవున్న విభాగానికి ఎలాంటి సినిమాలు పంపాలో మనవాళ్లకి తెలియకపోవడం ఆశ్చర్యం! బాహుబలిని చూసి హాలీవుడ్ షేక్ అయిపోయింది. బాలీవుడ్ బావురుమంది అని మీడియా సృష్టించిన హైప్‌ని సామాన్య ప్రేక్షకులు నమ్మవచ్చు. కానీ రాజవౌళికి తన చిత్రం సత్తా తెలియదా?

10/30/2017 - 18:51

దశాబ్దాల క్రితం రచయిత, దర్శకుడు నిర్మాత కూర్చోని చక్కగా ఆలోచించి సినిమా కథ, స్క్రీన్‌ప్లే రాసుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక హీరోకి స్క్రిప్ట్ నచ్చపోతే ఇంకో హీరోకి ఇచ్చేస్తున్నారు. మొదటి హీరో కోసం కుట్టిన దుస్తులు రెండో హీరోకి సరిపోకపోవచ్చు. కొలతలు హెచ్చుతగ్గులుంటాయి. ఆ కొలతలు సరిచేయకుండా అలాగే సినిమా తీస్తే అది ఢాం అంటుంది.

10/30/2017 - 18:50

వెనె్నలలో వచ్చిన కథతోనే కాసుల పంట వ్యాసం బాగున్నా కొన్ని అంశాల్లో విభేదించక తప్పదు. మల్లీశ్వరి, ఏకవీర లాంటి చిత్రాలు మంచి కథలున్నా ఆర్థికంగా ఫ్లాప్ అయ్యాయి. ప్రేమ్త్రన్ ధన్ పాయో, కబాలి లాంటి చిత్రాలు జనామోదం పొందకపోయిననా సూపర్ హిట్ అయ్యాయి. దేవదాసు చితానికి ఎంత ఘనమైన పేరు వచ్చినా దానికి లభించిన స్వర్ణ పతకాలు అమ్మేసి శతదినోత్సవాలు జరిపినట్టు స్వయంగా నిర్మాతే వాపోయాడు!

10/30/2017 - 18:49

మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన స్పైడర్ విభిన్నంగా వుంది. తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక ఇంటిలింజెంట్ పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్ బాబు నటన అద్వితీయంగా వుంది. ఒక విపరీతమైన మానసిక సమస్యతో బాధపడుతూ తన సైకిక్ మనస్తత్వం కారణంగా సమాజానికి ఎంతో ప్రమాదకరంగా తయారైన భైరవ పాత్రలో ఎస్.జె.సూర్య నటన అద్భుతం.

10/30/2017 - 18:45

మాస్ ఇమేజ్ మాయలో పడకుండా మంచి కథలనే ఎంచుకుని నటిస్తూ సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా గొప్ప సాహసంతో తన సినిమాలను విడుదల చేస్తూ పెద్ద హీరోల సినిమాల ప్రభావం పడకుండా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న గ్రేట్ హీరో శర్వానంద్. మహానుభావుడు సినిమాలో హాస్య రసాన్ని అలవోకగా పండించి, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. కథా కథనాలను నమ్ముకుంటేనే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు.

10/23/2017 - 18:33

భర్తనుంచి విడిపోయి అమలాపాల్ పెద్ద తప్పు చేసిందని ఆమె నటజీవితం ఖతం అంటూ జోస్యాలు చెప్పారు సినీ పండితులు. కానీ ఆమె పుంజుకుంది. ఇప్పుడు తాజాగా ఆమె సిగరెట్ పీల్చుతున్న వీడియోలు వైరల్ అవగా సినిమా సినిమా సన్నివేశంలో సిగరెట్ కాల్చి ఆమె చాలా రిస్క్‌లో పడిదంటూ ఘోష! టాలీవుడ్‌లో తక్కువే గాని బాలీవుడ్ సిగరెట్ పీల్చే భామలు ఎక్కువే. సిగరెట్టే కాదు మద్యం, సహజీవనాలు మామూలు విషయాలు అయిపోతున్నాయి.

Pages