S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/21/2019 - 20:00

ఇంగ్లీషులో ఇనె్ఫక్షస్, కంటేజియస్ అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియానువల్ల కాని, వైరస్ వల్ల కాని, బేక్టీరియం వల్ల కాని, ఫంగస్‌వల్ల కాని, పేరసైట్‌వల్ల కాని వచ్చే రోగాలని ‘‘ఇనె్ఫక్షన్ డిసీజెస్’’అంటారు. అంటే, మన శరీరానికి ‘స్వంతం’కాని లాటి పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు ‘ఇనె్ఫక్షన్’ అన్న మాట వాడతాం.

,
09/21/2019 - 19:55

నగరాల్లో, పట్టణాల్లో శుభ్రమైన గాలి లభిస్తున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల్లో అధ్యయనం చేసి నిర్దిష్ట పరిమితిని మించి కాలుష్యం బారిన పడిన నగరాల జాబితా తయా రుచేసింది. మరీ ముఖ్యంగా వాయు కాలుష్యం మరింత తీవ్రం కావడం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పింది. ఈ జాబితాలో న్యూయార్క్, లండన్ వంటి నగరాలే కాక ఢిల్లీ కూడా ఉంది.

09/21/2019 - 19:19

ఈ మిట్ట పల్లాల బతుకు నీడలేద
సాహిత్యపు దారిన నే పయనిస్తుంటే
నను కదలకుండ బిగిస్తుంటిని
ఓ ప్రేమామృత కవిత్వమా!

నీపై నాకున్న అభిమానం నీకు తెల్సి
ఏదైనా సొంపైన కవిత్వం రాయమని
నాలో ఎగిసిపడుతుంటివి
ఓ చిరునగవుల కవిత్వమా!

09/21/2019 - 19:18

ఏకాంతంలో నేనొక
ప్రశ్నల పుట్టనయిపోతాను
ఎనె్నన్నో ప్రశ్నలు!
నేనెవరు?
నా గమ్యం ఏమిటి?
నా గమనం ఎటువైపు?
మనసు సంద్రంలో
ఏవేవో ప్రశ్నల కెరటాలు!

ఏకాంతంలో నేనొక
అక్షరాల చెట్టయిపోతాను
వాక్యాల కొమ్మలకు
ఊగుతుంటాను
నావేలి కొసలు ప్రసవించిన
అక్షరాలను ప్రేమగా
నిమురుతుంటాను!

09/21/2019 - 18:45

మనం ఏ పని చేద్దామని అనుకొన్న దానికి అడ్డువేసే వ్యక్తులు ఎందరో-
మన ఆకాంక్షలని, ఆశలని తక్కువ చేసేవాళ్ళే ఎక్కువమంది వుంటారు.
ఆ పనిలో మనం అనుకున్న విధంగా విజయం సాధించకపోతే - వాళ్ళు అనేమాట- ‘నేను ముందే చెప్పాను’.
అక్కడితో వూరుకోరు.
మన మొఖంమీద ఓ చిన్న నవ్వును విసిరి మనలని చిన్నబుచ్చుతారు.
మనం చేయబోయే పని విజయవంతం కాదని వాళ్ళు లక్ష కారణాలు చెబుతారు.

,
09/14/2019 - 19:53

సూర్యోదయమంత సుందరంగా, లేలేత కిరణాల్లాంటి రంగుల మిశ్రమంతో, ఆకట్టుకునే అలంకరణతో, ఆకర్షణీయ ‘ఫ్రేమ్’లో పరవశింపజేసే చిలువేరు ఉదయలక్ష్మి వర్ణచిత్రాలు అందరిని అబ్బురపరుస్తాయి.
సుకుమారం, సున్నితత్వం, సౌందర్యం- స్ర్తి హృదయం నిండుగా ఆమె బొమ్మల్లో రాశీభూతమై ఆవిష్కృతమవుతుంది.

09/14/2019 - 19:48

ఓ కృష్ణశిల.. నీకెంతటి భాగ్యం?
మాలోని తృష్ణను తీర్చడానికే
నువ్వు ఎన్ని ఉలిదెబ్బలు తింటావు?

09/14/2019 - 19:43

నిజాం సంస్థానంలో తెలంగాణ మొత్తంలో 10వేల 95 గ్రామాలున్నాయి (1941లో). నిజాంలెవరూ తెలుగు భాషను ప్రోత్సహించలేదు. కుతుబుషాహీలు పార్శీని నెత్తిన రుద్దితే వీరు ఉర్దూను నెత్తిన రుద్దారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ బోధనా భాషగా ఏర్పడ్డ తర్వాత, తెలుగును అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

09/14/2019 - 19:39

ఆనాటి వీరోచిత కృత్యాల నిజానిజాలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీ ఖండేరావు కులకర్ణి ఆ విమోచనద్యోమంలోని వెలుగు చూడని వివరాలను వెలికితీసి హిందీ పుస్తక రూపంలో ‘హైదరాబాద్ ముక్తి సంగ్రామం - కొన్ని అజ్ఞాత పుటలు’ పేరుతో తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని సరళానువాదం చేసి ‘హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు’ పేరుతో తెలుగులోకి తీసుకువచ్చారు నిఖిలేశ్వర్. ఇందులో ఇరవైకి పైగా చారిత్రాత్మక గాథలున్నాయి.

09/14/2019 - 18:32

మనల్ని ఎవరో అంచనా వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. మనల్ని మనం అంచనా వేసుకుని అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. మన విజయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ అంచనా విషయంలో మనకు నిజాయితీ ఉండాలి. నిబద్ధత ఉండాలి.
మనల్ని మనం ఏ విధంగా అంచనా వేసుకుంటాం?
మనల్ని మనం ఏ రకంగా క్రమశిక్షణని అలవర్చుకుంటాం?
దీనికి గడిచిన సమయం మొత్తం అవసరం లేదు.
ఒక్క 24 గంటలు చాలు..

Pages