S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాలుష్య రాజధాని.. ఢిల్లీ

నగరాల్లో, పట్టణాల్లో శుభ్రమైన గాలి లభిస్తున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల్లో అధ్యయనం చేసి నిర్దిష్ట పరిమితిని మించి కాలుష్యం బారిన పడిన నగరాల జాబితా తయా రుచేసింది. మరీ ముఖ్యంగా వాయు కాలుష్యం మరింత తీవ్రం కావడం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పింది. ఈ జాబితాలో న్యూయార్క్, లండన్ వంటి నగరాలే కాక ఢిల్లీ కూడా ఉంది. 91 దేశాల్లోని దాదాపు 1600 నగరాల్లో జరిపిన అధ్యయనాల ఆధారంగా ఒక నివేదిక తయారుచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని ప్రకారం అత్యంత కాలుష్యం బారిన పడిన వంద నగరాల్లో భారతదేశానికి చెందిన 34 నగరాలు ఉన్నాయి. అలాగే భరించశక్యం కానంత తీవ్రస్థాయికి చేరిన యాభై నగరాల్లో 22 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. వీటిని మరింత వర్గీకరించి అత్యంత వాయుకాలుష్యం బారిన పడిన నగరాలుగా పదింటిని గుర్తించారు.
అవి...
1. ఢిల్లీ
2. పాట్నా - బీహార్
3. గ్వాలియర్ - మధ్యప్రదేశ్
4. రారుపూర్ - చత్తీస్‌గఢ్
5. అహ్మదాబాద్ - గుజరాత్
6. ఫిరోజాబాద్ - ఉత్తరప్రదేశ్
7. అమృతసర్ - పంజాబ్
8. కాన్పూర్ - ఉత్తరప్రదేశ్
9. ఆగ్రా - ఉత్తరప్రదేశ్
10. లూథియానా - పంజాబ్
ఈ పది నగరాల్లో నిర్దిష్ట స్థాయికి మించిన అత్యంత ప్రమాదకర కాలుష్య కారకాలైన సల్ఫేట్, నైట్రేట్, బ్లాక్ కార్బన్ కణాలు గాలిలో కలుస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు వివరించాయి. వేగంగా పారిశ్రామీకరణ చెందుతున్న దేశాల్లో కాలుష్యమరణాలు అధికంగా ఉన్నాయి. వాయుకాలుష్యం కారణంగా ప్రపంచంలో శ్వాసకోశ వ్యాధులతో ఏటా సుమారు 38 లక్షల మంది చనిపోతుంటే వారిలో భారత్‌కు చెందినవారు సుమారు 15 లక్షల మంది ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాలుష్య మరణాలు మూడోవంతు ఉన్న భారతదేశానికి ఈ నివేదిక ఓ హెచ్చరిక. గాలిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన కణాలు శరీరంలోకి చేరడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్, ఇనె్ఫక్షన్స్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి రోగాల బారిన పడి చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున వాయుకాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని, ఆర్థికరంగం కొత్త పుంతలు తొక్కుతున్నదనీ పాలకులు చెబుతున్నప్పుడు వినడానికి బాగుంటుంది కానీ అది ప్రాణాలను తోడేస్తున్నదని ఎవరూ ఆలోచించడం లేదు. అభివృద్ధి యావలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులకు ఈ నివేదిక హెచ్చరికలతో పాటు తక్షణ చర్యల అవసరాన్ని కూడా గుర్తుచేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పర్యావరణాన్ని, కాలుష్యాన్ని అభివృద్ధి నిరోధక అంశాలుగా చూడటమంటే ప్రజల ప్రాణాలకు ముప్పు తేవడమే..