S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ ప్రజలు - జీవన సరళి

నిజాం సంస్థానంలో తెలంగాణ మొత్తంలో 10వేల 95 గ్రామాలున్నాయి (1941లో). నిజాంలెవరూ తెలుగు భాషను ప్రోత్సహించలేదు. కుతుబుషాహీలు పార్శీని నెత్తిన రుద్దితే వీరు ఉర్దూను నెత్తిన రుద్దారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ బోధనా భాషగా ఏర్పడ్డ తర్వాత, తెలుగును అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.
నిజాం పెద్ద జాగీరు, రాజ బంధువులు చిన్న జాగీర్దారు ఆ తర్వాత దేశ్‌పాండ్యాలు, దేశ్‌ముఖులు, మఖ్తేదార్లు; వీళ్లే జమీందార్లు లేదా భూస్వాములు. ఈ భూస్వాముల చేతి క్రింద పనిచేసే రైతులు. ఈ రైతుల్లో కౌలుదారులుండేవారు; జీతగాళ్లుండేవారు; రోజువారి కూలీలుండేవారు. 10, 20, 50 గ్రామాలు వేర్వేరుగా వేలం వేసేవారు. ఎవరెక్కువగా వేలం పాడితే ఆ గ్రామాలు రెండేండ్లపాటు (ఇంకా ఎక్కువే) వారి చేతుల్లో ఉండేవి. వారికి గ్రామాల్లో పూర్తిగా పన్నులు వసూలు చేసుకొనే అధికారాలుండేవి. రైతుల దగ్గర, వృత్తికారుల దగ్గర, గ్రామంలోని అన్ని ఇండ్లమీద ఏదో ఒక రకంగా పైసో, వస్తువో పన్ను రూపంలో వేలం పాట కొట్టేసిన వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయేది. సాధారణంగా వేలంపాడేవారు జాగిర్దారు చేతి క్రిందివాళ్ళే. వీళ్లలో భూస్వాములుండేవారు; గ్రామాధికారులుండేవారు. పది ఇరవై గ్రామాలకు జాగిర్దారుంటే, ఆ గ్రామాల్లోని ఈ వేలం పాటగాళ్లంతా అతని చేతిక్రింది అధికారులుగా చెలామణి అయ్యేవారు.
జాగిర్దారు, భూస్వామి, అధికారి (గ్రామాల్లో) ఈ ముగ్గురూ ప్రజల్ని సరిగా చూడొచ్చు. పీడించొచ్చు. వీరు గాక నిజాం పోలీసు; ఆ తర్వాత 1927లో ఏర్పడిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్ల సైన్యం. ఇలా ఇంతమంది ప్రజార(్భ)క్షకులమధ్య ప్రజల జీవనసరళి ఎలా వుంటుందో? ఆలోచించండి.
గ్రామాల్లోని పని పాటల వారు (చాకలి- బట్టలుతకడం; మంగలి- వెంట్రుకలు కత్తిరించడం: కుమ్మరి- కుండలు చేయడం; కమ్మరి- కట్టె, చెక్క, ఇనుప పని చేయడం, మాదిగ- చర్మకార వృత్తిలో ఉండడం) తమ తమ వృత్తి ధర్మాల్ని పాటించాలనే ఉద్దేశ్యంతో వీరికి ఇనాముల (మాన్యాల) పేరిట భూమినివ్వడం జరిగింది.
సాగుచేయని భూమిని వదలివేస్తే మిగతా భూములకు పన్నుండేది. వ్యవసాయదారుడే పంట- పాడికి మూలాధారం. కోళ్లు, గొర్రెలూ, మేకలూ అందరూ పెంచినా, ‘ఆవులు-బర్రెలూ-వ్యవసాయం’ మాత్రం ప్రధానంగా పెద్ద రైతుల చేతుల్లో ఉండేవి. భూస్వాములు భోగలాలసులై మధ్యదళారులమీద ఆధారపడేవారు. ఈ దళారులు నయా భూస్వాములయ్యేవారు. మిత్తీ, వడ్డీ, నాగులతో వీరింకా ప్రజల్ని పీడించేవారు. మొత్తంమీద రైతు కేంద్రబిందువై, తనకు నాగళ్లు చేసిన వారికి, వృత్తిపనులు చేసినవారికి (చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, మాదిగ తదితరులందరికి) తన ఆదాయంలో ఇంత ఇచ్చేవాడు. ఇది కొద్ది భేదంతో తెంలగాణ అంతటా ఒకేవిధంగా ఉండేది.
వీరేగాక నేత పనివార్లు; కల్లుగీతల వాళ్లు, వ్యాపారులు, రాళ్లు గొట్టి బావులు త్రవ్వి ఇండ్లు కట్టేవారు (సాలె, ఈడిగ, కోమటి, వడ్డెరలు) బుట్టలు - తట్టలు అల్లేవారు (మేదరి) ఉండేవారు. ఇలా ఎందరో పన్ను చెల్లించవలసి వచ్చేది (ఏదో ఒక రూపంలో). వస్తువునే పన్నుగా ఇచ్చే కాలం పోయి డబ్బే వినిమయ సాధనమయినా, మంచి వస్తువుమీద ఊరి పెద్ద కన్నుపడ్డా- పడకున్నా ఉత్పత్తిదారు తలవంచి ఇవ్వాల్సి వచ్చేది. ఆ మంచి వస్తువు తనది కావాలనుకొని ఇష్టపడ్డ ఉదారుడైన ఊరి పెద్ద ‘మడి-మాన్యం’ ఇచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇక కోయ, చెంచు, లంబాడీ తదితరులు వనగిరి కంధరాల్లో జీవించేవారు. వారి మీద, అందరూ జులుం చలాయించేవారే.
నిజాం నిజాం రాజబంధువులు, జాగిర్దార్లు, భూస్వాములు, గ్రామాధికారులు, నిజాం పోలీసులు, రజాకార్లు- వీరి మధ్య సామాన్య హిందూ జనం. వీళ్లందరూ అడకొత్తులు- సామన్యులైన హిందువులందరూ పోకలు. ఏ అడకొత్తి ఎక్కడ ఎట్లా ఎప్పుడు ఎందుకు ఒత్తుతుందో ఎవరికీ తెలియదు.
ప్రభువుల నియంతృత్వం
నిజాం ప్రభువులు వీధుల్లో కూడా (వీధిబళ్ళలో కూడా) తెలుగు నిషేధించారు. అసలు వీధి బళ్లే నడపరాదన్నారు. కాని పార్శీ, అరబ్బీ, ఉర్దూల్ని తమ మసీదు మదరసాల్లో బోధించే ఏర్పాటుచేశారు.
గణేశ్ ఉత్సవాల్ని, దసరా ఊరేగింపుల్ని నిషేధించారు. వాటి మీద దాడులు చేయించి హత్యలు చేశారు. భీభత్స కల్లోల వాతావరణాన్ని సృష్టించారు. పీర్ల ఊరేగింపులు, తమ పెండ్లిండ్ల బరాతులు, జెండా ఊరేగింపులు, పంఖా ఊరేగింపులు, దర్గాల ఉర్సులు వైభోపేతంగా జరుపుకొన్నారు.
గుళ్ళను కూలగొట్టించారు; విగ్రహాల దొంగల్ని ప్రోత్సహించారు. కొత్త గుళ్లు కట్టనివ్వలేదు. తమ గోరీలు - సమాధులు - మసీదులు లెక్కకు మిక్కిలి కట్టుకొన్నారు. పెళ్లాం పేరిట, తమ పేరిట, ఉంపుడుగత్తెల పేరిట సమాధులు కోకొల్లలుగా కట్టుకొన్నారు.
హిందూ శ్మశాన వాటికలకు రక్షణ లేకుండా చేశారు. అందులోనే గోరీలు కట్టి కబ్రస్థాన్లుగా మార్చి ఆక్రమించుకొన్నారు. కబ్రస్థాన్ల పేరిట వేల ఎకరాల భూమిని దురాక్రమించారు. బొందలగడ్డల్లో దర్గాలు - మసీదులూ కట్టుకున్నారు.
హిందువుల్లో వంశ పారంపర్య వృత్తులవల్ల ఏర్పడ్డ కులాల్ని ఉపయోగించుకొని వారిమధ్య అసమానతనూ, అస్పృశ్యతా దురాచారాల్ని మరీ పెరిగేవిధంగా వ్యవహరించారు. ‘దేడ్’ అంటూ ‘దేడ్‌దమాఖ్’ అంటూ నానా విధాలుగా కులం పేర దూషిస్తూనే ఆయా కులాలవారిని ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేశారు.
దీన్‌దార్ మతోన్మాద ఉద్యమాన్ని సిద్ధిక్ చేత ప్రారంభింపజేశారు. నిజాంను అవతార పురుషునిగా చిత్రీకరించారు. పాఠశాలల్లో నిజాం ప్రార్థననే ప్రారంభించారు. హిందూ దేవతల్ని తిట్టిపోసి, ముస్లిం మతంలో కలిపే విధంగా ఒత్తిడి తెచ్చి వేలాదిమందిని ముస్లింలుగా మార్పించారు. ఈ సిద్ధిక్ ఏడోనిజాం కాలంలోని వాడైనా అంతకుపూర్వం నుండే ఇలాంటి ప్రచారాలు జరిగినై. సిద్ధిక్ తనను ధర్మ గురువుగా, నిజాంను ధర్మరాజు అవతారంగా ప్రచారం చేసి, ఆ ధర్మరాజే ముస్లింగా పుట్టినందువల్ల ఇవాళ హిందువులందరూ ముస్లింలు కావాల్సిందే అన్నాడు.
ధూప దీప నైవేద్యాలున్న కొన్ని దేవాలయాలు చుట్టూరా గోడలు లేపుకొని, లోన మాత్రమే మంత్రాలు చదువుకొనే పరిస్థితి దాపురింజేశారు.
స్ర్తిల, బాల, వృద్ధ, గోహత్యలు అంతూ పొంతూ లేకుండా చేశారు. పదివేల పైచిలుకు గ్రామాల్లో కనీసం తొమ్మిదివేల గ్రామాలు ఏదోవిధంగా హింసలకు, అత్యాచారాలకు, హత్యలకు విధ్వంసాలకు తలవంచేసినై.
రజాకార్ల ట్రక్కులు వెళ్లేదారి కిరుప్రక్కలగాని, నిజాం పోలీసులు వెళ్ళే దారికిరుప్రక్కలగానీ, ఏ వ్యవసాయ క్షేత్రంలోగానీ స్ర్తిలు పనిచేయడం కష్టమైపోయింది. దారిప్రక్క పొలాల్లో కనిపించిన స్ర్తిల నెత్కుకపోయేవారు. అందువల్ల దారులకిరువైపుల వ్యవసాయ క్షేత్రాలు బీళ్లయిపోయాయి. పెద్ద రైతులా భూముల్ని వదలి పెట్టేశారు. లేదా తమకు హక్కున్నవాటిని ‘గుఱ్ఱాన్ని గుగ్గిళ్ళ కమ్మినట్లు’ అమ్మేశారు.
ఏ సంస్థానం పరిధిలో (జాగిర్దార్ల పరిధిలో)నైనా హిందుత్వ వికాసానికి (్భష, మతం, ధర్మం, సంస్కృతి, కళల పునరుద్ధరణ) అంతంత మాత్రం కృషి జరిగినా నిజాం ప్రభువులు కనె్నఱ్ఱ చేసేవారు.
కొన్ని సంస్థానాల జాగిర్దార్లపై ముస్లిం స్ర్తిలనుసికొలిపి వారిని మస్లింలుగా మార్చే ప్రయత్నం చేశారు. (ఉదా: సంస్థాన్ నారాయణపురం).
ప్రభువుకు తనకువచ్చే ఆదాయంమీదనే దృష్టిగాని ప్రజా సంక్షేమం మీద ఎంత మాత్రం దృష్టి ఉండేది కాదు. నిజాం జాగీరు పరిధిలోనే ఒక తెలుగు పాఠశాల స్థాపించాలని యత్నాలు జరిగినపుడు ఆ ప్రయత్నానికి నిజామే అడ్డుపడ్డాడు.
రాజుల- రాజుల బేగంల సవారీలు వీధిలో వస్తున్నాయంటే, ఆ వీధిలో ఎవరూ కనిపించరాదు. రాజుగారికోరోజు దయ పుట్టి తన నివాసం నుండి వౌలాలికి (మాలీశ్వరాలయం) బయల్దేరి, వచ్చేప్పుడు డబ్బులు వెజల్లితే మాత్రం కాట్ల కుక్కల్లా జనం ఒకరిమీద ఒకరు పడి అవి ఏరుకోవచ్చు. అదీ ఆయనగారికి ఆనందదాయకం.
రాజుగారి బగ్గీ పోతుంటే అందమైన యువతి కంట్లో పడిందంటే చాలు, ఇక కంట్లో నిప్పులు పోసుకోవడమే.
రజాకార్లూ- పోలీసుల దాడికి తట్టుకోలేక గ్రామాలకు గ్రామాలే నిర్మానుష్యమైపోతే వాటిని బేచిరాగ్ (దీపంలేని) గ్రామాలుగా పిలిచే దుస్థితి కల్పించారీ నిజాంలు ప్రభువులు గదా!
ఇలా ఎంత నియంతృత్వంలో నిజాంలు పాలన చేశారో చరిత్ర పుటలు తిరగవేస్తే తెలుస్తుంది. ఇప్పటికీ ఈ దురంతాలకు గురై, ఈ నియంతృత్వాన్ని కళ్లార చూచిన మన తాత ముత్తాతల్ని అడిగితే తెలుస్తుంది. ఈ ఏడుగురు నిజాముల్లో ఆరో నిజాం మాత్రం ప్రజాభిప్రాయాన్ని మన్నించి మెలిగిన సందర్భాలు చరిత్రలో కనిపిస్తాయి.
తన భవనానికి సుదూర ప్రాంతంలోని గల్లీల్లో, హైదరాబాదులోని మారుమూల ప్రాంతాల్లో హిందూ స్ర్తిలు బతుకమ్మలాడుతుంటే- ఈ రాజు అటువైపు వెళ్లి ఆ ఆట చూసి, బతుకమ్మకో బంగారు నాణెం పెట్టి వచ్చేవాడు. 1908 కీలక సం.లో ముచికుంద (మూసి) పొంగి చార్‌మహల్‌పై దర్వాజా వరకు పారి వేలాదిమందిని కబళించిన సందర్భంలో, హిందూ పండితులూ- పురోహితులు చెప్పిన మాటల్ని పాటించి, తాను పట్టుచీర- పట్టురైక పసుపూ కుంకుమలు ధరించి ముచికుంద మాతకు మంగళహారతులిచ్చి దానధర్మాలు చేసిన పేరు ఈ ఆరవ నిజాంకే దక్కింది. శివాజీ- మహారాష్ట్ర ప్రజల బల ప్రాబల్యాల కారణంగా కుతుబుషాహిల్లో కొందరు వెనుకకు తగ్గారే కాని వారు కూడా దురంతాల్లో నియంతృత్వ పరిపాలనలో ఆసఫ్ జాహీలకు (నిజాంలకు) ఎంత మాత్రం తీసిపోకుండానే వ్యవహరించారు. కులీ భాగమతుల పేరిట ప్రేమ కథలు రాసే తిక్క రచయితలకు, అతను అల్లామీద దయవల్ల నాకు రోజుకో ఎఱ్ఱది, నల్లది, పచ్చది, తెల్లది, దానిమ్మ గింజ రంగుది, నేరెడు పండు వంటి రంగుది, పొట్టిది, పొడుగుది- అయిన ఆడది లభించింది అని రాసుకొన్న కథలు తెలియకపోవడం విచిత్రం.
రజాకార్ల దురంతాలు
రజాకార్ అంటే శాంతిసేన అని అర్థం. ప్రారంభంలో దీనికి పేరు లేదు. నిజాం ప్రోద్బలంతో 1926లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లిమీన్’ అనే సంస్థ ఏర్పడింది. నిజాం పరిపాలన వ్యవస్థలోని మత శాఖలోని ఉన్నతోద్యోగి అయిన బహుద్దూరు యార్ జంగ్ ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు.
ఈ సంస్థను స్థాపించడంలో అనేక ఉద్దేశాలున్నాయి. అది వరకే 1857 భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగింది. దాదాపు 70 సం.లు గడిచిపోయాయి. నిజాములందరూ బ్రిటీషువారికి అనుకూలంగా ఉండి తమ సంస్థానంలో, జాతీయ భావాలు పెరుగకుండా, బ్రిటీషు వ్యతిరేకత కనిపించకుండా అణగద్రొక్కారు. నిజాంలు తమ రాజ్య రక్షణ కొరకు బ్రిటీషు సైన్యాన్ని ఉంచుకొన్నారు. ఆ సైన్యానికయ్యే ఖర్చు క్రిందికి నేటి రాయలసీమను ధారాదత్తం చేశారు. అందుకే అవి దత్తమండలాలుగా ప్రసిద్ధి చెందాయి. నిజాం తమ చేతిలోనుండి జారిపోకుండా బ్రిటీషు వారు కూడా ‘రెసిడెంటు’ను నియామకం చేసి అతని అదుపాజ్ఞల్లో నిజాంలుండేట్టు చేయగలిగారు (ప్రస్తుతం ఈ రెసిడెంటు భవనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ‘కోటి ఉమెన్సు కళాశాల’ నడుస్తున్నది). దేశభక్తులైన కొందరు వీరులు అయిదారు పర్యాయాలు బ్రిటీషు రెసిడెంట్లపైదాడి చేసి, వారిని చంపివేయాలని విఫల ప్రయత్నం చేశారు. ఈ దాడులు వ్యక్తిగతంగనూ, మూకుమ్మడిగానూ జరిగాయి.
ఇవన్నీ అధ్యయనం చేసిన నిజాం పుర్రెలో ఒక ఆలోచన వచ్చింది. అటు బ్రిటిషువారి విముక్తిని కోరుతున్న విధంగా, ఈ హిందువులు తన నుండి కూడా విముక్తిని కోరుతున్నారనుకొన్నాడు. అలా కోరేవారు ఆ గ్రామంలో ఒకరు, ఈ నగరంలో ఇద్దరు ఉంటారని నిశ్చయించుకొన్నాడు. అలా ఎదిగిన ఆ ఒకరిద్దరే ప్రజల్లో స్వాతంత్య్ర పిపాసను రెచ్చగొడతారనుకొన్నాడు. అందువల్ల శాంతి సేన పేరిట గ్రామాల్లో ప్రవేశించి, వారెవరో కనుగొని చాటుమాటుగా వారిని అంతం చేయాలనే నిర్ధారణకు వచ్చేశాడు.
దాని ఫలితమే 1926లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లిమీన్’ ఏర్పడడం. ఇందులోని బైనుల్ అందరి సంస్థ అనే విశాలమైన అర్థాన్నిస్తుంది. ఆ కారణంగా 1929లో ఆ పదం పోయి ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్’ అనే పదబంధం ఏర్పడింది. ఇది కూడా మరీ పెద్దగా కావడంతో రాక్షసులకు పర్యాయపదమా అన్నట్టుగా ‘రజాకర్లు’ అనే పదం ఏర్పడి స్థిరపడింది.
ఈ సంస్థ మొదటి అధ్యక్షుడైన ‘బహద్దూరు యార్ జంగ్’ చాలా గ్రామాల్లో (ప్రత్యేకంగా ముస్లింలున్న గ్రామాల్లో) రజాకార్లను తయారుచేయడంగానీ, లేదా రజాకర్ల మనఃప్రవృత్తిని ముస్లింలలో నిర్మాణం చేయడంగానీ, ఏదో ఒకటి తప్పకుండా చేశాడు.
ఎటూపోయి అంతా తామే ఉండాలి. తాము ఈ భూమిని శాశ్వత పరిపాలకులం అనే భావన ప్రతి ముస్లింలో ఏర్పడాలి. దీనినే ‘అనల్‌మాలిక్’ సిద్ధాంతంగా ప్రచారం చేశారు. తమ భాష, తమ జాతి, తమ మతం తమ సంస్కృతి, తమ వైవాహికాది జీవన వ్యవస్థ, ‘రహన్-సహన్’ అంతా మిగతావారు ఆచరించాలి. మొత్తంమీద ఇస్లాంలు తప్ప సంస్థానంలో ఇంకొకరెవరూ ఉండరాదు. ఉన్నా బానిసలుగానే ఉండాలి. బజార్లు ఊకుతూనో, పయఖానాలు ఎత్తిపోస్తూనో, సేవలు చేస్తూనో తమ దయా దాక్షిణ్యాల మీద ముస్లిమేతరులు ఆధారపడి బ్రతకాలి.
ప్రభుశక్తి తోడుంది. మతోన్మాదానికి రాజరికం సహాయముంటే ఏం జరగాలో అదే నిజాం సంస్థానంలో జరిగింది.
1935 నుండి 1944 వరకు ఈ సంస్థ వేలాదిమంది హిందువులను మతం మార్చింది. విధ్వంసాలు చేసింది. ఎదురుతిరిగిన వారిని సంహరించింది. దొమీలుచేసింది, ఊళ్లకు ఊళ్లు దోచింది. రాత్రివేళల్లో హత్యలు, దోపిడీలు, మానభంగాలు, గ్రామ విధ్వంసక కార్యకలాపాలెన్నో చేసి ప్రజల్లో భీతావహమైన వాతావరణాన్ని సృష్టించింది.
1944లో ఈ సంస్థకు కాశీం రజ్వీ నాయకుడయ్యాడు. ఇక్కణ్ణుంచి 47 వరకు ప్రతి ముస్లిం తానే రాజన్నంతగా వ్యవహరించేట్టు, అలాంటి మానసిక భావజాలాన్ని ఈ సంస్థ సృష్టింది. రజాకర్ సేనను నవాబు పోలీసుకన్నా ఎక్కువగా పెంచేసింది. జంబ్యాలతో, తల్వార్లతో, తుపాకులతో రజాకర్లు తిరిగేట్టుగా చేసి ఎన్ని దోపిడీలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని విధ్వంసాలు సృష్టించిందో అవన్నీ ఈనాటికీ చరిత్రపుటలెక్కలేదు. ఎక్కింది సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినతర్వాత మరో పదమూడు మాసాల రెండు రోజులకుగానీ హైదరాబాదుకు విముక్తి లభించలేదు. దేశం నడిబొడ్డులో మరో పాకిస్తాన్‌గా హైదరబాదు అవతరించాలని నిజాం కలలుగన్నాడు. కాశీం రజ్వీ అయితే నిజాంల జెండా ఎర్రకోటమీద ఎగరేస్తానన్నాడు. నిజాం పాదాలు తూర్పు సముద్రంలో కడిగిస్తానన్నాడు. అంటే యావద్భారతాన్ని ఇస్లాంమయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడన్నమాట.
ముస్లింల విశ్వాస గ్రంథమైన ‘హదీన్-38’లో ‘‘అల్లా తప్ప మరో దేవుడు లేడని, మహమ్మదు తప్ప మరో ప్రవక్త లేడని ఒప్పుకునేదాకా ప్రజలతో పోరాటం సాగించా’’లని ఉంది. ఇలాంటి భావాలే హిందువుగానీ, హిందుత్వాన్నిగానీ సహించలేని స్థితికి ముస్లింలను దిగజార్చాయి. అందువల్లనే మజ్లిస్ రజాకర్లు ఇన్ని హత్యలకు, ఇంత విధ్వంసానికి పూనుకొన్నారు. హిందువుల్ని రాచి రంపాన పెట్టారు. ఇక్కడ ఒకటి రెండు సూత్రప్రాయంగా చెబుతాను.
బతుకమ్మ పండగ సందర్భంగా కొన్నివేల ప్రదేశాల్లో స్ర్తిలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించి వినోదించారు. రైతులు పండించిన కూరగాయలతోపాటు వారు పెంచుకొన్న కోళ్లనూ, మేకల్ని, గొర్రెల్ని ఎత్తుకొనిపోయిన ఘట్టాలు లక్షలున్నాయి. (పాలిచ్చే మేక కనిపిస్తే చాలు దొంగనాకొడుకులు అప్పటికప్పుడే పట్టుకొని, దాని పిల్లను పక్కకు నెట్టి ‘చన్ను’ చీకేవారు. ఈ మాట ఓ తాతగారు తుప్పున ఉమ్మిస్తూ అన్నారు). పొలాల్లో వ్యవసాయం పనులమీదున్న స్ర్తిలను ఎత్తుకొని వెళ్ళేవారు. సామూహింగా మానభంగాలకు లెక్కలేదు. జనానాలో చేర్చుకొన్నవారికి లెక్కలేదు. గ్రామాలకు గ్రామాలే దోచి వాటిని బేచిరాగ్ (దీపం పెట్టే దిక్కులేని) గ్రామాలుగా మార్చారు. ఆర్యసమాజ్, స్టేటు కాంగ్రెస్, హిందూ మహాసభ, హిందూ స్వయం సేవక్ సంఘం, కమ్యూనిస్టు పార్టీలోని నిజాం వ్యతిరేక దళాలవారిని హింసించడం, ఘోరంగా చంపడం లాంటి పైశాచిక కృత్యాలు వేలకొలది చేశారు. ఎన్నో గుళ్లను కూల్చేసి పాడుబెట్టారు (హైదరాబాద్‌లో ప్రస్తుతం సైదాబాద్ పోలీసు స్టేషన్ ఎదురుగా వున్న (శిథిలమై కబ్రస్థాన్‌గా మారిన) శివాంజనేయ దేవాలయ స్థితి చూస్తే తెలుస్తుంది.
నిజాం సంస్థానంలో రజాకర్లు చేసిన అక్రమాల్ని, హత్యల్ని, దురంతాల్ని, విధ్వంసాల్ని, భ్రష్టాచారాల్ని, తేదీల వారీ కథనం చేస్తే కనీసం లక్ష పుటల చరిత్ర అవుతుంది. ఇక వీరికి తోడు నిజాం పోలీసులు.
నిజాం పోలీసులు దురంతాలు
కాశీం రజ్వీ సంసిద్ధం చేసిన రజాకార్ల సైన్యం ఏభైవేలు. అయితే ఇది మూడు నాలుగు లక్షలుగా ప్రచారం చేశారు. ముసలీ- ముతకా అందరికీ తుపాకులిచ్చి మైదానాల్లో పరేడ్ చేయించి సంఖ్య ఎంతో ఉందన్నట్టుగా చూపించారు. ఇక నిజాం పోలీసుల సంఖ్య కూడా ఇరవై ఐదువేలు. ఇందులో పైనుండి క్రింది స్థాయి వరకు నిలువెల్లా అవినీతి నిండి ఉన్నవాళ్లు నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు.
అటు రజాకర్లలోను, ఇటు పోలీసులలోనూ భర్తీ అయిన వారు చాలావరకు దోచుకొని సంపాదించుకోవచ్చు అనే దృష్టి ఉన్నవారే. ‘‘కంచారు గాడ్డులాను - లంచగొండి పోలీసోల్లా- నీవు పెంచినావు కొడుకో - నైజాము సర్కారోడా’’ అనే పంక్తులు ఓ గేయంలో ఈ కారణంగానే చోటుచేసుకొన్నాయి. ఈ పోలీసులు పనిచేసే పద్ధతి ఇలా ఉండేది.
రాత్రిపూట రజాకర్లు వచ్చి ఓ ఊరుమీద పడేవారు. తుపాకులు పేల్చేవారు. కొందరిని చంపేవారు. కొందరిమీద అత్యాచారం జరిపేవారు. కొన్ని ఇళ్లు దోచుకునేవారు. ఎవరికి దొరికినంతవారు దండుకొని వెళ్లిపోయేవారు. మరుసటిరోజు పగటిపూట నిజాం పోలీసులు వచ్చేవారు. తమ్ముడు చనిపోతే అన్నను, అన్న చనిపోతే తమ్ముణ్ణి నీవే చంపావని అరెస్టు చేసేవారు. హింసించి గ్రామసావడి దగ్గరికి తెచ్చి అతను ఏ కొద్దిపాటి ఉన్నవాడైనా, అతని నుండి ఎంత పిండాలో అంత పిండేవారు. స్ర్తిల ఆభరణాలు, రైతుల - వృత్తికారుల ఆస్తిపాస్తులు, వెండి రూపాయలు- ఏవీ ఎన్ని దొరికితే అన్ని తీసుకొని అతణ్ణి వదలిపెట్టి పోయేవారు. అతనేమీ ఇవ్వలేకోతే పోలీసు ఠాణాకు తీసుకొని వెళ్లి అక్కడ హింసించేవారు. అతని బంధువులు వచ్చి కావాల్సినంత సమర్పిస్తే వదలిపెట్టేవారు.
ఈ కారణంగానే ఆనాడు రాత్రి పాలన - పగటి పాలన అని ఇలా రెండువిధాలుగా ఉండేదని చెబుతారు. అంటే రాత్రిపూట పాలించే (హింసించే) వాడొకడు, పగటిపూట పాలించే వాడొకడు అన్నమాట.
నైజాం నవాబు మాటిమాటికి ‘‘హిందువులు, ముస్లిములు నాకు ఇద్దరూ రెండు కళ్ళు’’ అంటుండేవాడు. నిజానికి అతని ఒక కన్ను రజాకర్లు, మరో కన్ను నిజాం పోలీసులు. ఈ రెండు కళ్ళతో సర్వభక్షకుడై పరిపాలన చేశాడు ఏడో నిజాం.
నిజాం పోలీసుల్లో అల్లా ఉద్దీన్ అనే పఠాన్, పోలీసు జవానుగా ఉండేవాడు. 1948 జూలైలో పోలీసులు చేసిన అత్యాచారాల్ని నిరోధించే శక్తి లేక, మానవత్వం వున్న మనిషిగా తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. అతను చెప్పిన విషయాల్లో ఒకటి మాత్రం ఉదాహరిస్తాను.
‘‘పోలీసులో కానిస్టేబుల్‌గా ఉంటూన్నందున గవర్నమెంటు నన్ను వరంగలు జిల్లాలోని ఎర్రుపాలానికి, పుట్టుకతో పఠాన్ ఔటం చేత ట్రాన్స్‌ఫర్ చేసింది. సబ్ ఇన్స్‌పెక్టర్ చాంద్‌ఖాన్ 25గురు పోలీసువాళ్లు 80 మంది రజాకర్ల వెంటబడి రుూ గ్రామంపై విరుచకపడ్డారు. వదలకుండా ఇళ్లనే గాక పూరిగుడిసెలని, పాకలని సహితం దోయించాడు. ఆడవాళ్లని నడి వీధులలో, చౌకులలో చెరిపిస్తూ 70 మందిని చంపించాడు. కేవలము పోలీసు వాళ్లవల్లనే 12మంది స్ర్తిలను చెరిపించి, కార్యానంతరం పిల్లల ఎదుట కాల్చి చంపించాడు. పోలీసు మిలటరీ కట్టుదిట్టంతో రజాకార్లు సంస్థానమందు అనుదినము యిలాంటి దౌర్జన్యాలని అమితంగా జరిపారు. వారికి ఇలాంటివి, మిలటరీ పరేడు మల్లే దైనందిన చర్యలుగా చేయబడ్డాయి.
ఆ పఠాన్ పోలీసు ఈ సంఘటనలెన్నో చూశాడు. కలత చెందాడు. ఇది ధర్మంకాదు, ఇస్లాం ఒప్పుకోదని వాదిస్తే తుపాకి గురిపెట్టి కాల్చేస్తామన్నారు. వీడో పిరికిపంద అని హైదరాబాద్ దగ్గరగా వున్న అమీర్‌పేటకు బదిలీ చేశారు.
మనిషి రక్తం త్రాగే మృగాలకన్నా హీనాతిహీనంగా పోలీసులూ, రజాకార్లు వ్యవహరించారు. ఒకటి ప్రభుత్వ సంస్థ, మరోటి ప్రైవేటు తుపాకీ సంస్థ; రెండు రెండే.
నిజాం పోలీసులలో ఎలాంటివారు చేరేవారో, ఎలా అధికారులయ్యేవారో ఒక ఉదాహరణ ఇస్తాను. ‘‘ఓ ఊళ్ళో కరడుగట్టిన ముప్ఫయ్యేళ్ళ ముస్లిం యువకుడుండేవాడు. అతను హిందూ కుటుంబాలను దోచి కావాల్సినంత సంపాదించాడు. అతని తల్లిదండ్రులు సర్కారు (ప్రభుత్వంలో) ఏదైనా ఉద్యోగం సంపాదించుకోమన్నారు. ఉపాయం కూడా చెప్పారు. అతను దోచి తెచ్చిన బంగారంతో పది ‘అషఫ్రీలు’ (తులం బంగారుబిళ్ళ) చేయించారు. కొడుకు చేతికిచ్చి నిజాం సాల్గిరా (పుట్టినరోజు) నాడు హైదరాబాద్‌కు పంపించారు. అతను వెండి పళ్లెంలో ఆ నాణాలు పెట్టి, మీద ఆకుపచ్చ ‘మఖ్మల్ గుడ్డ’ పరచి కానుకగా సమర్పించాడు నిజాంకు. నిజాం సంతోషించి ఏంకావాలో కోరుకొమ్మన్నాడు. అమీన్ సాబ్.. అమీన్ సాబ్ అని సలాంగొడ్తూ నసిగాడు. అలిబ్బేలు కూడా సరిగా రాని ఆ యువకుడు, రాజు అప్పటికప్పుడే అతణ్ణి అమీన్‌గా చేసేశాడు. అతను ఓ పోలీసు ఠాణాకు అధిపతి అయ్యాడు. వంద దోపిడీలు, పది రేపులు చేసి, పది అషఫ్రీలు ఇచ్చి సబ్ ఇన్స్‌పెక్టర్ అయిన ఈ వ్యక్తి మున్ముందు ఎలా వ్యవహరిస్తాడో ఊహించుకోవచ్చు.
నిజాం ప్రభుత్వ పాలనా వ్యవస్థను తన కళ్లారా చూచిన ఓ తాతగారు చెప్పినమాటలివి. శిక్షణ లేని, నీతిలేని, చదువూ సంస్కారం లేని అధికారులూ, పోలీసులూ.. ఇక పరిపాలించేదేలాగో ఊహించండి. ఆ రోజుల్లో ప్రజలు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని, బతుకుకై తాము నమ్ముకున్న వృత్తినే అనుసరిస్తూ, తమ భాషను మరచి, గుళ్లకు పోవడం మానుకొని, ఉత్సవాల్లో పాల్గొనడం వదలిపెట్టి, కేవలం తమ పల్లెకు మాత్రమే అంకితమై క్షణమొక ప్రాణాంతకాంశంగా గడిపిన రోజులు ప్రపంచంలో ఏ దేశ చరిత్రలో అయినా ఉన్నాయా?
నిజాం పోలీసులు రక్షకులు కారు! ప్రజాభక్షకులు! దేశమంతా స్వాతంత్రోత్సవాలు జరుపుకొంటుంటే 1947 ఆగస్టు 15 నుండి 48 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాదు సంస్థానం ఈ భక్షకుల అకృత్యాలకు బలి అయింది. నరరూపరాక్షసులైన రజాకార్ల కామభోగానికి, ఆధిపత్య వాంఛకు గురై ఈ సంస్థానం గుండె పుండ్లు పడ్డది. మరి ఇంత శిథిలం కావడానికి, ఇంత జర్ఘరితం కావడానికి, ఈ రక్తసిక్త వీర తెలంగాణ చరిత్ర దౌర్భాగానికి, అది కూడా చివరి రోజుల్లో జరిగిన అంతులేని అత్యాచారాలకు కారకుడెవరు! ఇంతమంది ‘ఉసురు’ మూటగట్టుకొన్న మూర్ఖుడెవరు! ఆ మూర్ఖునికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిందెవరు?