S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/19/2019 - 20:15

తెలుగు బాగా వచ్చిన వాళ్లు కూడా పబ్లిక్ (public), ప్రైవేట్ (private) అనే ఇంగ్లీషు మాటలకి సమానార్థకాలైన తెలుగు మాటలు తట్టక, ఆ ఇంగ్లీషు మాటలనే యథాతథంగా వాడేస్తూ ఉంటారు.

10/19/2019 - 19:56

దుఃఖపు మూట చిట్లి
ఆనందం తెరలు తెరలుగా
గుండె శిఖరం మీద వాలుతుందేమోనని
కనుచూపుల్ని భవిష్యత్ కాలానికి
తగిలించేసి ఎదురుచూస్తున్నా
విషాదం గరళమై ఘనీభవిస్తూ
కనుపాపల మధ్య వేలాడుతోంది
బతుకు నిత్య కన్నీటి దృశ్యమై
అష్టకష్టాల కాన్వాసుపై
వెలసిన రంగు లద్దుకుంటోంది
వేదనలు ఆవేదనలు
జన్మ జన్మల బంధమన్నట్లు
మనోఫలకంపై

10/19/2019 - 19:56

కృషీవలుడనై
నా మనస్సు మడుగులో
అక్షర సేద్యం చేసాను
వాక్య నిర్మాణముకై
భావస్ఫోరకాలు
మొలకెత్తడానికి
ఒకింత
అనుమానాస్పదం
కారణం
ఉపరితల ఆవర్తనం
సరిగా స్పందించక పోవడమా?
నిశిరాత్రిలో
గోడ గడియారపు
కంపన పరిమితితో
పోటీపడుతూ
శిల్పినై
జడత్వంగా
కదలని బండరాయై
మొద్దుబారిన మనస్సును
సానబెట్టిన

,
10/19/2019 - 19:06

ఈనాడు సమాజానికి కావలసింది సాధన కాదు. కొలదిపాటి సాధనతో కూడిన బహుళార్థ సాధక కార్యాచరణ. మన దేశంలో ఇప్పుడు జరగవలసింది మతపరమైన పని అంతా ప్రజోపయోగ కార్యక్రమాలలో వినియోగింపబడాలి. అప్పుడు దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం ఏ రీతిగా ముందుకు పరుగెడుతుందో మీరే ఊహించుకోవచ్చు. దేశంలో అనేక చోట్ల నేడు భజనలు, పూజలు, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిర్మాణాత్మకమైన పని కదా. ఇదే పని భక్తియార్ ఖిల్జీ సమయంలో జరిగింది.

10/19/2019 - 19:00

ఆల్చిప్పల్లాంటి కళ్లు.. శిల్పంలాంటి శరీరాకృతి.. అచ్చం జక్కన చెక్కిన చక్కని శిల్పంలా.. అనువైన, అరుదైన అందమైన ముఖం. ఆ ముఖాన్ని ఎంతసేపు చూసినా.. ఎంతగా అభివర్ణించినా.. తరగని అందం ఆ పిల్లది. అలా చూస్తుండిపోక కాస్త స్వతంత్రించి ఆ కన్యని సమీపించాడు ఆకర్ష్. ముఖంపై చెరగని చిరునవ్వు స్థానంలో రవ్వంత చిరాకు ప్రకటితవౌతోంది ఆమె వదనంలో. తలస్నానం చేసిందో ఏమో భృకుటి ప్రశ్నార్థకమైంది.

10/19/2019 - 18:37

‘‘సోమరి చీకటిని బద్దలుచేసిన
వేకువ కరాలు!..
వేళ్ళ కొసల్ని బాకులు చేసి
ఆకలికి ఆశల్ని జతకూర్చి అందమైన ‘మేదరి’ బుట్టలల్లుతాయి!

శ్రమని చువ్వలుగా చీలుస్తూ
బతుకు పొద్దును
చిక్కని తాటాకు చాపగా విస్తరిస్తాయి!

స్వేదాన్ని వర్ణంగా పూస్తూ
ఆరిన పేగుల్ని కళాఖండాలుగా
దండేలకు వేలాడేస్తాయి!

10/19/2019 - 18:36

ఇన్నాళ్లూ
సన్నగా సనసన్నగా
మెత్తగా నాలో ప్రవహించే
నాడులే నాకు జవసత్వాలనిచ్చి
నా ఊపిరి వాటి ఊపిరి కలగలసి
ప్రకృతిలో హేమం
పిండుకుంటూ
మురుస్తూ మురిపిస్తూ
మెరుస్తూ కురిసే మేఘంతో
సరసాలాడుతూ
నాలో నాటుకుపోయిన నాడులన్నీ
మొక్కలై చెట్లై మహావృక్షాలై
రమణీయత పర్యావరణ సమతుల్యత
వన్యమృగ సంరక్షణ నాతో నాలో నాపై

10/19/2019 - 18:31

ఎప్పుడు చూసినా అలజడి
ఏమిటో తెలియదు జనం నాడి
ఎందుకో వాళ్లకంత వేడి
ఏమన్నా అంటే అర్థంలేని దాడి
తడిలో ఏముందంటూ మడిని
బోడి బొమ్మ దేవుడేమిటంటూ గుడిని
పంతులా గింతులా అంటూ బడిని
గేలిచేస్తూ గోలచేస్తూ గందరగోళం
తల్లి, తండ్రి, గురువు, దైవంకన్నా
పదవి, పెదవి, పైకం, మైకమే మిన్న
అన్న ధ్యాసలో కాలరెత్తుకొని
అనుక్షణం కాలక్షేపం

10/19/2019 - 18:22

తుఫాను తరువాత జీవితం ఉంటుందా?
ఈ ప్రశ్నకి సమాధానం అవునని, కాదని వస్తుంది. కానీ తుఫాను తరువాత ఏమీ వుండదని అనుకుంటారు చాలామంది. కానీ అది వాస్తవం కాదు. తుఫాను తరువాత కూడా జీవితం ఉంటుంది. జీవితం చిగురిస్తుంది.
గాలి, దుమారం బాగా వీచినప్పుడు చెట్లు విరిగిపోవడం, పడిపోవడం సహజం.

,
10/12/2019 - 19:48

ఓ తరం క్రితం నాటి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ముఖ్యంగా మహిళల జీవన విధానాన్ని, వారి ఆహార్యాన్ని అలంకరణను, హావభావాల్ని చిత్రకారిణి కనె్నకంటి వెంకట నాగమణి చిత్రిక పట్టి వీక్షకులను అబ్బుర పరుస్తున్నారు.

Pages