S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్రాయడం మానేసాను

కృషీవలుడనై
నా మనస్సు మడుగులో
అక్షర సేద్యం చేసాను
వాక్య నిర్మాణముకై
భావస్ఫోరకాలు
మొలకెత్తడానికి
ఒకింత
అనుమానాస్పదం
కారణం
ఉపరితల ఆవర్తనం
సరిగా స్పందించక పోవడమా?
నిశిరాత్రిలో
గోడ గడియారపు
కంపన పరిమితితో
పోటీపడుతూ
శిల్పినై
జడత్వంగా
కదలని బండరాయై
మొద్దుబారిన మనస్సును
సానబెట్టిన
అక్షరాల ఉలితో చెక్కుతూ
విగ్రహ నిర్మాణం చేద్దామన్నా
చేయి సహకరించకపోగా
ఇప్పుడెందుకులే
అని మారాం...
శ్రామికుడనై
స్వేదం చిందించి
మోయడానికి
వస్తువులు
బోలెడన్ని ఉన్నా
బద్దకించిన శరీరం...
కాలచక్రంతో పోటీ పడలేక
నా మనస్సులోని
భావజాలపు జలము
ఒట్టిపోయిందనుకుంటా?
అయినవారి
అడిగిన ప్రశ్నలకు
నా సమాధానం
వ్రాయడం మానేశాను.
బహుశా
సజీవత్వం కోసం
ఋషినై తపస్సు!!

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655