AADIVAVRAM - Others

నిత్య చైతన్య కవిత్వమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మిట్ట పల్లాల బతుకు నీడలేద
సాహిత్యపు దారిన నే పయనిస్తుంటే
నను కదలకుండ బిగిస్తుంటిని
ఓ ప్రేమామృత కవిత్వమా!

నీపై నాకున్న అభిమానం నీకు తెల్సి
ఏదైనా సొంపైన కవిత్వం రాయమని
నాలో ఎగిసిపడుతుంటివి
ఓ చిరునగవుల కవిత్వమా!

మబ్బులపై తేలియాడే పక్షుల తోరణాలవలె
కొండల్లో జాలువారె నదీ సోయగాలవలె
వసంత కోకికల రాగాలవలె
సుమధుర గేయాల రాయిస్తుంటివి ఓ బహువనె్నల కవిత్వమా!

ఇలా అయితే నాకు తీరికెలాయని
నే సాగర పాతాళంలో దాక్కుంటె
మత్యగ్రంధివైవచ్చి నా కళ్ళు మూస్తుంటివి
దాగుడుమూతలతో నన్నాట పట్టించకమ్మా
ఓ మాయలమారి కవిత్వమా!

నీకందొద్దని ఆకాశానికెగిస్తే
చంద్రుడిపై మోజుగల తారలవలె
నన్నాకర్షిస్తూ నీ వలలో పడేస్తుంటివి
ఓ తళుకులొలుకు కవిత్వమా!

దారేది కానరాక నీకందకుండా
నే దైన్యంగా పరుగెడుతూంటే
దివ్య వాగ్దేవివై అమృత సుభాషితాల వర్షిస్తుంటివి
ఓ మహత్వ పూర్ణ కవిత్వమా!

సరే! రావమ్మా! ఓ సృజనశీల కవిత్వమా!
నీ కృపామలంతో కాలానుగుణ
కవిత్వ శిఖరాన్నధిరోహిస్త
నను వీడిపోకమ్మా ఓ నిత్య కవిత్వ చైతన్యమా!

తోట సదానందము