S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/09/2015 - 13:41

న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం విపక్షాలపై అక్రమంగా కేసులు బనాయించేందుకు యత్నిస్తుందని లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల అవినీతిపై లోకసభలో పెద్ద చర్చ జరిగింది. హర్యానాలోనూ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

12/09/2015 - 13:41

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ అంశంపై రెండవరోజు రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనటంతో సభను వాయిదా వేశారు.

12/09/2015 - 11:29

ఢిల్లీ:కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఎపి, తెలంగాణ సిఎంలు చంద్రబాబు, కెసిఆర్ బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. వీరు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుంది. అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి సాయం పొందేందుకు సిఎంలు చర్చించేందుకు అవకాశం వుంది.

12/09/2015 - 11:29

చెన్నై:బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తమిళనాడులో చెన్నై సహా 13 తీర ప్రాంత జిల్లాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో జనంలో ఆందోళన నెలకొంది. వరద ముప్పునుంచి ఇప్పుడిప్పుడే చెన్నై నగరం తేరుకుంటున్న సమయంలో చిరుజల్లులు పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఎనిమిది జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

12/09/2015 - 11:28

చెన్నై:తమిళనాడులోని కొట్టివాక్కం వద్ద బుధవారం ఉదయం ఓ నీటి గుంటలో కారు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న తల్లీ, ఇద్దరు చిన్నారులు మరణించారు.

12/09/2015 - 07:33

చెన్నై, డిసెంబర్ 8: తమిళనాడులో వరదలకు అతలాకుతలమైన ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, కడలూర్ జిల్లాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా రెండువేల టన్నుల బ్రీచింగ్ పౌడరు, కోటికి పైగా క్లోరిన్ బిళ్లలు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.

12/09/2015 - 07:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: యువకులు సోదరభావం, అందరిపట్ల ప్రేమ, దయ, క్రమశిక్షణ, సంయమనం లాంటి కీలకమైన సామాజిక విలువలతో ఎదిగేలా చేయాలని, అప్పుడే దేశం పూర్తి సామర్థ్యంతో ఎదుగుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

12/09/2015 - 07:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో తమ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇరికించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కొనసాగనిచ్చే ప్రసక్తే లేదని ప్రకటించారు.

12/09/2015 - 07:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన దస్త్రాలు బహిర్గమైనప్పటికీ ఆయన అదృశ్యం మిస్టరీ వీడనేలేదు. 1945 తరువాత కూడా నేతాజీ జీవించే ఉన్నారన్న కథనాల నేపథ్యంలో బోస్ మేనల్లుడు, ఇండిపెండెంట్ జర్నలిస్టు అశీష్ రే మంగళవారం మరిన్ని పత్రాలు విడుదల చేశారు. తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని, ఈ విషయం రష్యాకు కూడా తెలుసని స్పష్టం చేశారు.

12/09/2015 - 07:30

ముంబయి, డిసెంబర్ 8: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును వచ్చే పది రోజుల్లోగా పూర్తిచేయాలని ముంబయిలోని ప్రత్యేక కోర్టు మంగళవారం సిబిఐకి స్పష్టం చేసింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేసిన సాక్షుల వాంగ్మూలాల ప్రతులను తనకు అందజేయాలంటూ ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం అనుమతించింది. ‘షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ఈ నెల 17వ తేదీ నాటికి పూర్తి చేయాలి.

Pages