జాతీయ వార్తలు

యువతకు విలువల నగిషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: యువకులు సోదరభావం, అందరిపట్ల ప్రేమ, దయ, క్రమశిక్షణ, సంయమనం లాంటి కీలకమైన సామాజిక విలువలతో ఎదిగేలా చేయాలని, అప్పుడే దేశం పూర్తి సామర్థ్యంతో ఎదుగుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం ఇక్కడ 2014 సంవత్సరానికి గాను రాష్టప్రతి స్కౌట్స్, గైడ్, రోవర్, రేంజర్, యువ నాయకుడి అవార్డులను ప్రదానం చేసిన అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ భారత్ స్కౌట్స్, గైడ్స్‌కు చెందిన వలంటీర్లు స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి జాతీయ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, మహిళల పట్ల గృహహింస, చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలు, భ్రూణహత్యలు లాంటి సామాజిక రుగ్మతలపట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి భారత్ స్కౌట్స్, గైడ్స్ చేస్తున్న కృషిని సైతం ఆయన ప్రశంసించారు. ఏ ప్రగతిశీల సమాజానికైనా సరే దాని పౌరులు అంతర్జాతీయ దృక్పథం, ఆధునిక ఆలోచనలు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగల డిజిటల్, వృత్తిపరమైన నైపుణ్యం కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ ఉద్దేశంతోనే యువతను పెంచాలని ఆయన ఉద్బోధించారు.
స్వచ్ఛ్భారత్, డిజిటల్ ఇండియా లాంటి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో యువకులు పాలు పంచుకోవాలని, మీరు పాల్గొనడమేకాక మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వాలని రాష్టప్రతి అన్నారు. దేశంలో 50 లక్షలకు పైగా సభ్యత్వం కలిగిన స్కౌట్స్, గైడ్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
రాష్టప్రతి భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌కు స్కార్ఫ్‌ను
అందజేస్తున్న స్కౌట్స్, గైడ్స్ అధ్యక్షుడు అశోక్ గెహ్లాట్