జాతీయ వార్తలు

చెన్నైలో ముమ్మరంగా సహాయక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 8: తమిళనాడులో వరదలకు అతలాకుతలమైన ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, కడలూర్ జిల్లాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా రెండువేల టన్నుల బ్రీచింగ్ పౌడరు, కోటికి పైగా క్లోరిన్ బిళ్లలు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. వరద పీడిత ప్రాంతాల్లోని ఇళ్లకు డిసెంబర్ నెలకు కరెంటు బిల్లులు చెల్లించనక్కర్లేదని ఆమె స్పష్టం చేశారు. హాఫ్ ఇయర్లీ (అర్ధవార్షిక) పరీక్షల వాయిదా నిర్ణయం తమకూ వర్తింపచేయాలన్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్య విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి స్పందించారు. అన్ని విద్యా సంస్థల అర్ధవార్షిక పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, ఇది అందరికీ వర్తిస్తుందని జయలలిత స్పష్టం చేశారు. ‘అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లలో హాఫ్ ఇయర్లీ పరీక్షలు వాయిదా పడతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించాం. అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు’ అని ఆమె వెల్లడించారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు పెద్దఎత్తున చేపట్టినట్టు ఒక అధికార ప్రకటనలో తెలిపారు. అదనంగా సిబ్బందిని నియమించి శిథిలాలు తొలగిస్తున్నట్టు ఆమె చెప్పారు. ముందు జాగ్రత్తగా ప్రజలకు అంటువ్యాధులు రాకుండా టీకాలు వేస్తున్నట్టు జయ పేర్కొన్నారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోందని, వరద పీడత ప్రాంతాల్లో ఇంటింటికీ అరకిలో బ్లీచింగ్ పౌడర్, ఇరవై క్లోరిన్ మాత్రలు పంపిణీ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీళ్లు సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే రెండు వేల టన్నుల బ్లీచింగ్ పౌడరు, కోటి క్లోరిన్ మాత్రలు సంబంధిత స్థానిక సంస్థలకు అందజేసినట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1,105 వైద్యశిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు వివరించారు. పక్క రాష్ట్రాల నుంచి సమకూర్చిన బంగాళాదుంపలు, టమోటాలు ప్రభుత్వ డిపోల ద్వారా అందజేస్తున్నట్టు జయలలిత తెలిపారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు తక్కువ ధరకే ప్రజలకు అందజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.