జాతీయ వార్తలు

1945 తరువాతా నేతాజీ జీవించే ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన దస్త్రాలు బహిర్గమైనప్పటికీ ఆయన అదృశ్యం మిస్టరీ వీడనేలేదు. 1945 తరువాత కూడా నేతాజీ జీవించే ఉన్నారన్న కథనాల నేపథ్యంలో బోస్ మేనల్లుడు, ఇండిపెండెంట్ జర్నలిస్టు అశీష్ రే మంగళవారం మరిన్ని పత్రాలు విడుదల చేశారు. తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని, ఈ విషయం రష్యాకు కూడా తెలుసని స్పష్టం చేశారు. తాను విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయం స్పష్టంగా ఉందని రే అన్నారు. 1945కు సంబంధించి బోస్ వివరాలు కోరుతూ 1991, 1995 మధ్య భారత్, రష్యాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నకళ్లను ఆయన వెల్లడించారు. రష్యా భూ భాగంలోకి నేతాజీ ప్రవేశించారా? అని అప్పటి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని రే చెప్పారు. ‘1991 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం రష్యా ఫెడరేషన్‌కు లేఖ రాసింది. బోస్ మీ దేశానికి రావడం లేదా అక్కడ ఉండడం జరిగిందా? అని భారత్ అడిగింది’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ లేఖపై 1992 జనవరిలో రష్యా బదులిస్తూ ‘బోస్ మా దేశం వచ్చినట్టుగానీ ఇక్కడ ఉన్నట్టుగానీ సమాచారం లేదు’ అని స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు. మూడేళ్ల తరువాత భారత్ మళ్లీ రష్యాకు లేఖ రాసిందన్నారు. రష్యా నుంచి అలాంటి జవాబే వచ్చింది. నేతాజీకి సంబంధించి సమాచారం తమ వద్ద లేదని రష్యా వివరించినట్టు అశీష్ రే వెల్లడించారు.

రెండు దేశాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పరిశీలిస్తే నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయినట్టు కచ్చితమైన ఆధారాలు లేవని దీనిపై ప్రభుత్వం కూడా ఓ నిర్ధారణకు రాలేకపోయిందన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. కాగా బోస్‌కు సంబంధించిన పత్రాలను ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ నృపేంద్ర మిశ్రాకు రే అందజేశారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే 64 ఫైళ్లను బహిర్గతం చేశారు. 1945 ఆగస్టు 18 తైవాన్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ వాటిని విశ్వసించడం లేదు.