జాతీయ వార్తలు

షీనా హత్య కేసు దర్యాప్తు 10రోజుల్లో పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును వచ్చే పది రోజుల్లోగా పూర్తిచేయాలని ముంబయిలోని ప్రత్యేక కోర్టు మంగళవారం సిబిఐకి స్పష్టం చేసింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేసిన సాక్షుల వాంగ్మూలాల ప్రతులను తనకు అందజేయాలంటూ ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా చేసుకున్న విజ్ఞప్తిని న్యాయస్థానం అనుమతించింది. ‘షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ఈ నెల 17వ తేదీ నాటికి పూర్తి చేయాలి. సాక్షుల వాంగ్మూలాలతో కూడిన సీల్డ్ ప్యాకెట్లను ఆ రోజు తెరిచి వాటిని నిందితురాలికి అందజేస్తాం’ అని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎస్.మహాజన్ కేంద్ర దర్యాప్తు సంస్థకు స్పష్టం చేశారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ సాక్షుల వాంగ్మూలాల ప్రతులను అందజేయాలని కోరుతూ ఇంద్రాణీ ముఖర్జియా గురువారం తన న్యాయవాది గుంజన్ మంగ్లా ద్వారా పిటిషన్ దాఖలు చేసుకుంది.
అయితే ఈ పిటిషన్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవితా పాటిల్ వ్యతిరేకించారు. ఎంతో పెద్ద కుట్రతో కూడిన ఈ కేసును సిబిఐ లోతుగా దర్యాప్తు జరుపుతోందని, దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో సాక్షుల వాంగ్మూలాలను నిందితులకు అందజేయడం హానికరమని ఆమె పేర్కొన్నారు. ఇదిలావుంటే, ఇంద్రాణీ ముఖర్జియాతో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామవర్‌రాయ్‌లను మరోసారి ఇంటరాగేట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కూడా న్యాయస్థానం అనుమతించింది.

ఎలాంటి వేధింపులు లేవు: జైట్లీ
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రతిపక్షాలను మోదీ ప్రభుత్వం ఎక్కడ ఏ విధంగా వేధింపులకు గురిచేసిందో చెబితే తగిన జవాబిస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి, రాజ్యసభ సభానాయకుడు అరుణ్ జైట్లీ ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్‌కు సవాలు విసిరారు. ప్రతిపక్షాలను తమ ప్రభుత్వం ఎప్పుడూ వేధించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమాజ్‌వాది, బిఎస్పీ నాయకులు వేధింపులకు గురయ్యారని వివరణ ఇచ్చారు. ఆస్తుల విక్రయం, నిధుల బట్వాడాలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసిన కేంద్ర బృందం ఇచ్చిన నివేదికపై ఢిల్లీ హైకోర్టు జారీచేసిన ఆర్డర్‌తో మోదీ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని జైట్లీ ప్రశ్నించారు. ఈ అంశంపై తక్షణమే చర్చను ప్రారంభించాలని ఆయన ఆజాద్‌కు సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ సభ్యుల అలజడితో సభలో ఏమీ వినిపించకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ విధిలేక బుధవారానికి వాయిదా వేశారు.

కుమారుడి వసూళ్ల కేసు
కర్నాటక లోకాయుక్త
రాజీనామా
బెంగళూరు, డిసెంబర్ 8: వివాదాస్పద కర్నాటక లోకాయుక్త జస్టిస్ వై.్భస్కర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. లోకాయుక్త కార్యాలయంలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాతో కుమారుడికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో భాస్కర్‌రావు ఉద్వాసన ముప్పును ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో లోకాయుక్త పదవి నుంచి వైదొలగాలంటూ వత్తిడిని ఎదుర్కొంటున్న భాస్కరరావు సోమవారం ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. కర్నాటక గవర్నర్ వాజూభాయ్ ఆర్.వాలా మంగళవారం ఈ రాజీనామాను ఆమోదించడంతో గత కొద్ది నెలల నుంచి కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. బలవంతపు వసూళ్ల కేసులో కుమారుడు అశ్విన్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేయడంతో జూన్ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న జస్టిస్ భాస్కర్‌రావు సోమవారం లోకాయుక్త పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను వాజూభాయ్ ఆర్.వాలా ఆమోదించారని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్‌భవన్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.