S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/25/2016 - 12:32

దిల్లీ: పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న అనేక బిల్లులను ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని, అనవసర విమర్శలకు స్వస్తి పలికి నిర్మాణాత్మక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం విజ్ఞప్తి చేశారు.

04/25/2016 - 12:31

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాల్గో విడత పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ విడతలో 345 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా, ఏడుగురు మంత్రులు పోటీలో ఉన్నారు. మూడో విడత పోలింగ్‌లో హింస చోటుచేసుకోవడంతో సోమవారం నాటి పోలింగ్ సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

04/25/2016 - 08:42

తిరువనంతపురం, ఏప్రిల్ 24: వచ్చే నెల 16న అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న కేరళలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకోవడంతో పార్టీలు, వయసుతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి కూడా సోషల్ మీడియా ప్రధానమైన ప్రచార సాధనంగా మారుతోంది.

04/25/2016 - 08:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పోలవరం జాతీ య ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు తానే స్వయంగా ఆర్థిక శాఖను సంప్రదిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉమాభారతితో భేటీ అయి పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించారు.

04/25/2016 - 08:17

జంషెడ్పూర్, ఏప్రిల్ 24: అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా కోరారు. తమ ప్రభుత్వ పథకాలు, పుష్కలంగా అందిస్తున్న వనరులను అడ్వాంటేజిగా తీసుకుని అభివృద్ధి కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన గ్రామ పంచాయతీలను కోరారు.

04/25/2016 - 08:14

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం , రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, కరువుపై పార్లమెంట్ సమావేశాలలో చర్చిస్తామని టీడీపి ఏంపీ తోట నర్సింహం అన్నారు. సోమవారం నుండి పార్లమెంటు ప్రారంభంకానున్న నేపధ్యంలో ఆదివారం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షాతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి తోట నర్సింహం హాజరయ్యారు.

04/25/2016 - 08:07

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచటం ద్వారా న్యాయవ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

04/25/2016 - 08:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఎంతమాత్రం సజావుగా సాగేట్లు కనిపించటం లేదు. అధికార పక్షం, విపక్షం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్న తీవ్రమైన పరిస్థితి నెలకొంది. ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ వ్యవహారంలో అఫిడవిట్‌ను మార్చిన వ్యవహారం అధికార బీజేపీ అందిపుచ్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు అత్యంత తాజాగా ఉత్తరాఖండ్ వ్యవహారం బ్రహ్మాస్త్రంగా చేతికందివచ్చింది.

04/25/2016 - 08:04

అలీగఢ్, ఏప్రిల్ 24: అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ప్రత్యర్థి వర్గాల మధ్య కాల్పుల్లో యూనివర్శిటీనుంచి బహిష్కరణకు గురయిన ఓ విద్యార్థి సహా ఇద్దరు మృతి చెందాడు. దీంతో అధికారులు క్యాంపస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(రాఫ్)బలగాలను మోహరించడంతో పాటుగా ఎఎంయు హాస్టళ్లలో అసాంఘిక శక్తులను బయటికి పంపించి వేయడానికి పెద్ద ఎత్తున ప్రక్షాళన ఆపరేషన్‌కు ఆదేశించింది.

04/25/2016 - 08:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తుం టే మరోవైపు ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కారణంగా 356 అధికరణాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని వాదిస్తూ వస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ 356 అధికరణం అనేది అధికార పార్టీలకు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతోందనేది నిర్వివాదాంశం.

Pages