జాతీయ వార్తలు

ఈసారీ ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఎంతమాత్రం సజావుగా సాగేట్లు కనిపించటం లేదు. అధికార పక్షం, విపక్షం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్న తీవ్రమైన పరిస్థితి నెలకొంది. ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్ వ్యవహారంలో అఫిడవిట్‌ను మార్చిన వ్యవహారం అధికార బీజేపీ అందిపుచ్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు అత్యంత తాజాగా ఉత్తరాఖండ్ వ్యవహారం బ్రహ్మాస్త్రంగా చేతికందివచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే ఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కాంగ్రెస్ పూర్తి సన్నద్ధతతో ఉంది. ఉత్తరాఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తూ తీర్మానం చేయాలంటూ ఇప్పటికే రాజ్యసభలో నోటీసు ఇచ్చింది. రాజ్యసభలో అధికార పక్షం మైనారిటీలో ఉన్న పరిస్థితిని ఈ సమావేశాల్లో కూడా అవకాశంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ తీర్మానానికి వామపక్షాలు, ఇతర విపక్షాలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాలు కూడా జరిగే అవకాశాలు కన్పించటం లేదు.
బి.జె.పి ఇషత్ జహాన్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను లక్ష్యం చేసుకుని దాడి చేసే అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటు మలి విడత సమావేశాలను సజావుగా జరిపించటం కోసం అన్ని పక్షాలు సహకరించాలని కోరారు. తాము అన్ని విధాలా సహకరిస్తామని ప్రతిపక్ష పార్టీల నాయకులు హామీ ఇచ్చినప్పటికీ.. అది ఏ మేరకు సాధ్యమన్నది అందరికీ తెలిసిందే. మరోవైపు ఉత్తరాఖండ్ వ్యవహారంతో కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య అంతరం మరింత పెరగటంతో జీ ఎస్టీ బిల్లుకు ఈ సమావేశాల్లో కూడా ఆమోదం లభిస్తుందని ఆశించలేం.
అయినప్పటికీ జీ ఎస్టీతో పాటు మొత్తం 13 బిల్లులను లోకసభలో, పదకొండు బిల్లులను రాజ్యసభలో పాస్ చేయించుకునేందుకు ప్రయత్నించనుంది. వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లపై చర్చ జరపటంతోపాటు వాటికి ఆమోదం తీసుకోవటం ప్రభుత్వం ముందున్న అత్యంత ముఖ్యమైన పని. ఈ బిల్లుకు సంబంధించిన పార్లమెంటు జాయింట్ కమిటీ నివేదికను సభకు సమర్పించనున్నారు.