జాతీయ వార్తలు

అభ్యర్థులందరిదీ అదే బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఏప్రిల్ 24: వచ్చే నెల 16న అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న కేరళలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకోవడంతో పార్టీలు, వయసుతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి కూడా సోషల్ మీడియా ప్రధానమైన ప్రచార సాధనంగా మారుతోంది. మార్క్సిస్టు పార్టీ కురువృద్ధుడు విఎస్ అచ్యుతానందన్ మొదలుకొని ప్రస్తుత యుపిఏ ప్రభుత్వంలో అందరికన్నా యువ ఎమ్మెల్యే అయిన కెఎస్ శబరినాథన్ దాకా అందరు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి, ఓటర్లకు చేరువ కావడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సామాజిక మాధ్యమ సైట్లను ఎంచుకుంటున్నారు. కేవలం వారం రోజుల క్రితం సోషల్ మీడియాను ఎంచుకున్న అచ్యుతానందన్ శనివారం ఫేస్‌బుక్‌లో మొదట తన వ్యాఖ్యలను వక్రీకరించినందుకు మీడియా ప్రతినిధులను విమర్శించడంతో పాటు ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ‘నేను ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అయితే అన్ని విషయాలను పార్టీ నాయకత్వం, ఎల్‌డిఎఫ్ నిర్ణయిస్తాయి’ అని మాజీ ముఖ్యమంత్రి అయిన అచ్యుతానందన్ నిన్న ఒక ఇంగ్లీషు దినపత్రికలో వ్యాఖ్యానించారు. తాము సాధించిన విజయాలు, నెరవేర్చిన ఎన్నికల హామీల వివరాలతో వ్యక్తిగత వెబ్‌సైట్లు ప్రారంభించిన వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, హోం మంత్రి రమేశ్ చెన్నితల, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మనోమ్ రాజశేఖరన్, కెపిసిసి అధ్యక్షుడు విఎం సుధీరన్ సహా ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపించడం ఎక్కువ చేశారు.

ఆధునిక టెక్నాలజీ అంటే ఎంతో మక్కువ చూపించే ముఖ్యమంత్రి ఊమన్ చాందీ అయితే ఫేస్‌బుక్ సామర్థ్యం, ప్రజలకు అది ఎంతగా చేరువ అయిందో అందరికన్నా ముందే గ్రహించడమే కాదు 2010 ఏప్రిల్‌లోనే ఫేస్‌బుక్ అకౌంట్ ప్రారంభించారు కూడా. పదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన కొంతకాలంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో దూసుకు వెళ్తున్నారు. నియోజకవర్గాల్లో, ఇతర ముఖ్యమైన కార్యఅకమాల్లో తన పర్యటనలకు సంబంధించిన వార్తలు, ఫోటోలే కాకుండా 72 ఏళ్ల చాందీ మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలు, విధానాలు లాంటి వాటిని సైతం మైక్రోబ్లాగింగ్ సైట్లలో ఉంచుతున్నారు. చాందీ అధికారిక ఫేస్‌బుక్ పేజిలో 9 లక్షల మందికి పైగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సారి కూడా చాందీ తన సొంత నియోజకవర్గమైన పుతుప్పల్లినుంచి 11వ సారి అసెంబ్లీకి ఎన్నిక కావడానికి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కారణంగా తన అధికారిక వెబ్‌సైట్లో ప్రభుత్వ పథకాల వివరాలను ఎప్పటికప్పుడు ఉంచడానికి వీలు లేక పోవడంతో చాందీ ఇటీవలే ఒక వ్యక్తిగత సైట్‌ను ప్రారంభించారు కూడా. మలయాళం, ఇంగ్లీషు భాషల్లో ఉండే ఈ వెబ్‌సైట్లో ప్రభుత్వ కార్యక్రమాల గురించిన సమాచారమే కాకుండా ముఖ్యమంత్రి హాజరయిన వివిధ కార్యక్రమలాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, ఆయన గురించిన వ్యాసాలు కూడా ఉన్నాయి.