జాతీయ వార్తలు

’పోలవరం’ సకాలంలో పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పోలవరం జాతీ య ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు తానే స్వయంగా ఆర్థిక శాఖను సంప్రదిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉమాభారతితో భేటీ అయి పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలవరం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు, ఇది పూర్తి అయితే భాక్రానంగల్, ఫరక్కా బ్యారేజీ అంతటి ప్రాజెక్టు అవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసే అంశంపై చంద్రబాబు కొంత ఆందోళన చెందుతున్నారని, అయితే దీనిని 2018 నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినా అవి సకాలంలో పరిష్కారం అవుతాయనే పూర్తి విశ్వాసం తనకు ఉన్నదని ఉమాభారతి భరోసా వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పదిహేను రోజుల్లో పరిష్కరించుకుంటామంటూ, మరికొన్ని సమస్యల పరిష్కారానికి తానే స్వయంగా ఆర్థిక శాఖకు వెళ్లవలసి ఉన్నదని ఉమా భారతి చెప్పారు. ప్రాజెక్టును ఫాస్ట్‌ట్రాక్‌లో పెట్టాలని చంద్రబాబు కోరుతున్నారని, తమ శాఖ తరపున ఆయనకు అన్ని హామీలను ఇచ్చామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తక్కువ నిధులు కేటాయించటం గురించి అడగ్గా, 2020 నాటికి 80 లక్షల హెక్టార్లకు నీరు అందజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నందున 2018లోగా పూర్తి చేయవలసిన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ అవసరమైన నిధులు కేటాయిస్తుందనే భావిస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పట్ల సంతృప్తిగా ఉన్నారా? అని అడగ్గా సంతృప్తి అనేది ఎప్పుడూ ఉండదన్నారు.
కాగా,ప్రాజెక్టు నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. 2018నాటికి దీనిని పూర్తి చేయాలని ఉమాభారతిని కోరానని, అవసరమైతే నాబార్డ్ నుండి నిధులు తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. ఇంకా ఏడు కోట్ల క్యూబిక్ మీటర్ల పని చేయవలసి ఉన్నదంటూ ప్రతి రోజు రెండు లక్షల క్యూబిక్ ఫీట్ల పని లక్ష్యాన్ని సాధించవలసి ఉన్నదని బాబు చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి పనికి లక్ష్యాలు నిర్ధారించి పని చేయిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. నిధుల కేటాయింపులు జరిగితే అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఆదివారం కేంద్రమంత్రి ఉమాభారతితో చర్చిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు