జాతీయ వార్తలు

గ్రామాభివృద్ధిలో మీదే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంషెడ్పూర్, ఏప్రిల్ 24: అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా కోరారు. తమ ప్రభుత్వ పథకాలు, పుష్కలంగా అందిస్తున్న వనరులను అడ్వాంటేజిగా తీసుకుని అభివృద్ధి కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన గ్రామ పంచాయతీలను కోరారు. దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపైనే ఎక్కువగా అధారపడి ఉందని ఆయన అంటూ, మారుమూల ప్రాంతాలకు కూడా అన్ని ఆధునిక సదుపాయాలు అందేలా చూడడం ద్వారా నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలని కోరారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, చిన్నారుల అనివృద్ధిపై దృష్టిపెట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అంటూ, తన అయిదేళ్ల పాలనపై రాబోయే రోజుల్లో కూడా మాట్లాడుకునే విధంగా ఒక వారసత్వాన్ని వదిలిపెట్టాలని తాను కోరుకుంటున్నానని మోదీ చెప్పారు. ‘మనం పంచాయతీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు ఎంత ముఖ్యమో గ్రామ సభలు కూడా అంతే ముఖ్యం’ అని జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో ఆదివారం పది రోజుల పాటు జరిగిన ‘గ్రామోదయ్‌సే భారత్ ఉదయ్’ కార్యక్రమం ముగిం పు కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని అన్నారు. ‘ప్రజల కలలను సాకారం చేయడానికి మనం భుజం భుజం కలిపి పని చేయాలి’ అని గ్రామ పంచాయతీలు, కేంద్ర ప్ర భుత్వం మధ్య సహకారం అవసరమ నే విషయాన్ని నొక్కి చెప్తూ అన్నారు.
గ్రామాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అంటూ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో, బహిరంగ మల విసర్జనను అంతం చేయడానికి టాయిలెట్ల నిర్మాణంలో, శిశు మరణాల నిరోధానికి సరయిన వైద్య సదుపాయాలు ఉండేలా చూడడానికి, మధ్యలో బడి మానేయడం లేకుండా చూడడానికి మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడం లాంటి వాటిలో ప్రధాన పాత్ర పోషించాలని గ్రామ సర్పంచులు ఆయన కోరారు. ఇంతకు ముందు నిధుల కొరత ఉండేదని, అయితే ఇప్పుడు నిధులకు కొరతే లేదని, అలాగే పథకాలకు కూడా కొరత లేదని ప్రధాని అంటూ, అయితే అట్టడుగు స్థాయిలో పని చేసే వారిలో అంకిత భావం ఉండాలన్నారు. మీరు ఆదర్శంగా నిలిస్తే అధికారులు కూడా అదే బాటలో నడుస్తారని ఆయన చెప్పారు. మన తల్లులు, అక్క చెల్లెళ్లు బహిరంగ మల విసర్జన చేసే పరిస్థితికి అంతం పలికి తీరాలని, ఇందుకోసం 30 లక్షల పంచాయతీప్రతినిధుల్లో 40 శాతం మేర ఉన్న మహిళా ప్రతినిధులంతా ప్రతిన బూనాలని ఆయన పిలుపునిచ్చారు.