S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/23/2020 - 22:42

గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది -రాహు. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం 28న థియేటర్లకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అభిరామ్ వర్మ ఆదివారం మీడియాతో ముచ్చటించాడు.

02/23/2020 - 22:41

ఎంఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్‌గౌడ సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం -కాలేజ్ కుమార్. కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగు రీమేక్ చేశాడు దర్శకుడు హరి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు.

02/23/2020 - 22:39

బాలకృష్ణ -బోయపాటి ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే టైం వచ్చేసినట్టే. అంతా సిద్ధమైనా హీరోయిన్ల కొరత కారణంగా ప్రాజెక్టు ఆలస్యమవుతుండటం తెలిసిందే. పూజాధికాలు నిర్వహించి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించినా -బాలయ్యకు జోడీ దొరక్క షూటింగ్‌కు వెళ్లలేకపోతున్నారన్న కథనాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులోకి ఇద్దరి హీరోయిన్ల ఎంపిక విషయం కొలిక్కి వచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది.

02/23/2020 - 22:37

కలిసొచ్చిన కాలంలో మహిళా ప్రాధాన్యతా చిత్రాలు చేసి -స్వీటీ మంచి పేరే తెచ్చుకుంది. ఉమెన్ సెంట్రిక్ కథల్ని వరుసగా చేసి.. అలాంటి సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ స్వీటీ అనిపించుకుంది కూడా. అనుష్క నుంచి రానున్న తాజా చిత్రం -నిశ్శబ్ధం. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

02/23/2020 - 22:35

భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ -బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడం తెలిసిందే. రెండువారాల క్రితమే సినిమా వచ్చిపోయినా -్ఫ్లప్‌పై మాత్రం ఇంకా పోస్ట్‌మార్టమ్స్ నడుస్తున్నాయి. తాజాగా సినిమా ఫ్లాప్‌నకు విజయ్ కారణమంటూ దర్శకుడు క్రాంతిమాధవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కథనాలు వస్తుండటం గగ్గోలు లేపుతోంది.

02/23/2020 - 22:34

వైభవీజోషి, శ్రీజితఘోష్, మధుసూధన్, రాజేష్ నటరంగ ప్రధాన తారాగణంగా దర్శకుడు రానా సునీల్‌కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం -డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మీనాబజార్. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావడంతో -సినిమాను థియేటర్లకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు సునీల్‌కుమార్ మాట్లాడుతూ -ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

02/20/2020 - 22:22

పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు బోర్డులోకి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తాజాగా చేరింది. మొదటి షెడ్యూల్ ముంబైలో పూర్తిచేసిన చిత్రయూనిట్, తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలెట్టింది. సెకెండ్ షెడ్యూల్‌కు వచ్చిన అనన్య -సెట్స్‌లో విజయ్, దర్శకుడు పూరి, నిర్మాత చార్మితో దిగిన ఫొటోలను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

02/20/2020 - 22:21

నితిన్, రష్మిక జోడీగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ -్భష్మ. భారీ అంచనాల మధ్య శుక్రవారం సినిమా థియేటర్లకు వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు వెంకీ మీడియాతో ముచ్చటించాడు.

02/20/2020 - 22:17

వరుస ఫ్లాపులు దేవరకొండ ‘హీరో’యిజానికి చెక్‌పెట్టినట్టే కనిపిస్తోంది. అప్పుడెప్పుడో మొదలెట్టి, ఇప్పటికే కొంత షూట్ చేసిన ‘హీరో’ ప్రాజెక్టు ఇక ముందుకెళ్లడం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. చాలాకాలం క్రితం -బైక్ రేసింగ్ నేపథ్యంగా ఇంట్రెస్టింగ్ కానె్సప్ట్‌తో మైత్రి మూవీ మేకర్స్ ‘హీరో’ ప్రాజెక్ట్ మొదలెట్టింది. అప్పటికి విజయ్ ఇమేజ్ ఒక లెవెల్లో ఉండటంతో భారీ బడ్జెట్‌తోనే ప్రాజెక్టు ప్లాన్ చేశారు.

02/20/2020 - 22:15

ధనుష్ 40వ చిత్రంగా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తోన్న చిత్రం -జగమే తంత్రం. ఎస్ శశికాంత్ నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్‌ని ఖరారు చేస్తూ ధనుష్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌తో పోస్టర్ విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్న చిత్రాన్ని తెలుగు ఆడియన్స్‌కు జిఏ2, యూవీ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి.

Pages