‘హీరో’ ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస ఫ్లాపులు దేవరకొండ ‘హీరో’యిజానికి చెక్‌పెట్టినట్టే కనిపిస్తోంది. అప్పుడెప్పుడో మొదలెట్టి, ఇప్పటికే కొంత షూట్ చేసిన ‘హీరో’ ప్రాజెక్టు ఇక ముందుకెళ్లడం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. చాలాకాలం క్రితం -బైక్ రేసింగ్ నేపథ్యంగా ఇంట్రెస్టింగ్ కానె్సప్ట్‌తో మైత్రి మూవీ మేకర్స్ ‘హీరో’ ప్రాజెక్ట్ మొదలెట్టింది. అప్పటికి విజయ్ ఇమేజ్ ఒక లెవెల్లో ఉండటంతో భారీ బడ్జెట్‌తోనే ప్రాజెక్టు ప్లాన్ చేశారు. అది నడుస్తుండగానే మైత్రి కోసం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ చేశాడు. తాజాగా విజయ్ నుంచి వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సైతం ఆశించినంత లేకపోవడంతో -విజయ్ మార్కెట్ గ్రాఫ్ తిరోగమనంలో పడింది. ఈ సీజన్‌లో ‘హీరో’ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం ఎంతమాత్రం మంచిది కాదని భావిస్తోన్న మైత్రి సంస్థ -హీరో ఊసే ఎత్తడం మానేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. కంప్లీట్ మాస్ యాక్షన్ మూడ్‌లో సినిమా ఉండే అవకాశం ఉంది కనుక -విజయ్ సైతం ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ప్లాపులతో సతమతమవుతోన్న రామ్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’తో కొత్త ఊపిరి ఇచ్చినట్టే.. తిరోగమనంలోవున్న విజయ్‌ని ‘ఫైటర్’తో పూరి పైకి లేపుతాడేమో చూడాలి. అదే జరిగితే ఆ ఒక్క సినిమాతో విజయ్ చేతిలోకి మళ్లీ చాలా ప్రాజెక్టులో వచ్చిపడతాయి. లేదంటే -కొత్త ప్రాజెక్టుల్ని వెతుక్కోక తప్పని స్థితి రావొచ్చు. ఏ క్షణంలో ఎలాంటి హిట్టు పడుతుందో అనూహ్యం కనుక -విజయ్ డేట్స్‌ని దృష్టిలో పెట్టుకుని మైత్రి మూవీ మేకర్స్ యంగ్ డైరెక్టర్లను లాక్ చేసే ప్రయత్నాల్లో ఉందని వినిపిస్తోంది. అదే జరిగితే -మారుతి, సుజీలాంటి దర్శకులు మైత్రితో కలిసి విజయ్‌తో సినిమా చేసే అవకాశాలు ఉండొచ్చు. అలా చాన్స్‌కొట్టిన దర్శకుడు ‘హీరో’కావొచ్చు కూడా.