S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/18/2020 - 21:59

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో చిరకాలంగా ఆడియన్స్‌కి వినోదాన్ని అందిస్తోన్న థియేటర్ -సంధ్య. ఆ థియేటర్‌లో పదేళ్లకాలం పాటు ప్రొజెక్టర్‌గా పని చేసి ఇప్పుడు దర్శకుడయ్యాడు మహిపాల్‌రెడ్డి టి. సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై టిఎంఆర్ తెరకెక్కించిన చిత్రం -పోస్టర్. విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లు. ‘పోస్టర్’కు సంబంధించిన టీజర్‌ను నిర్మాత సురేష్‌బాబు విడుదల చేశారు.

02/18/2020 - 21:57

వలయం చిత్రంలో దిశ పాత్రలో కనిపిస్తా. సంప్రదాయ యువతిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దశ, అనూహ్యంగా మాయమవుతుంది. అసలు దిశకు ఏమైంది? ఎలా మాయమైంది? అన్న సస్పెన్స్‌ను రివీల్ చేసే చిత్రమే వలయం అంటోంది -హీరోయిన్ దిగంగన సూర్యవంశీ. ఆమె మాయమవ్వడానికి అక్రమ సంబంధాలే కారణమా? అన్న సందిగ్ధంతో కూడిన సస్పెన్స్‌తో కథ నడుస్తుందంటోంది.

02/18/2020 - 21:56

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ముందుంటే -దారి. నా పక్కనుంటే -అండ. నా వెనుకుంటే -్ధర్యం. సింపుల్‌గా చెప్పాలంటే నా మార్గదర్శక అదృష్టం అన్నాడు హీరో నితిన్. రష్మిక జోడీగా నితిన్‌తో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం -్భష్మ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించిన చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.

02/18/2020 - 21:53

కుటుంబ విలువలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే సెటైరికల్ ఎంటర్‌టైనర్ -ప్రజెర్ కుక్కర్ అంటున్నారు దర్శకుడు సుజోయ్, సుశీల్. లైఫ్‌లో చూసిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో సినిమాను తెరకెక్కించామని అన్నారు. సాయిరోనక్, ప్రీతి అస్రాని జోడీగా నిర్మాత అప్పిరెడ్డితో కలిసి సుజోయ్, సుశీల్ నిర్మించిన చిత్రం 21న విడుదలవుతోంది.

02/17/2020 - 22:08

ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటింది. 35 సినిమాలకంటే ఎక్కువ చేయలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలకంటే ఎక్కువ చేయలేకపోయా. ఈ లెక్క ప్రకారం చూస్తే కెరీర్ కూల్‌గా వెళ్తున్నట్టే. బట్, ఇకపై వేగాన్ని పెంచాలనుకుంటున్నా. పెంచుతా.
*

02/17/2020 - 22:06

సీనియర్ హీరోగా కెరీర్లో ఎన్నో హిట్లు ఫ్లాపులు చూశాడు బాలకృష్ణ. వరుసగా రెండు మూడు ఫ్లాపులొచ్చేసరికి -బెదిరిపోతాడని అనుకోలేం. కథానాయకుడు, మహానాయకుడు, రూలర్.. ఇలా గత ఏడాదిలో మూడు డిజాస్టర్లు ఎదురొచ్చినా -ప్రయోగాలపై తనకున్న ఆసక్తిని మరోసారి రుచి చూపేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడన్న మాట వినిపిస్తోంది. అందుకు -బోయపాటి ప్రాజెక్టు వేదికకానుందన్న మాట వినిపిస్తోంది.

02/17/2020 - 22:04

మాతృకను మించి రీమేక్‌పై అంచనాలు పెరగడంతో -జాను ఫెయిల్యూర్ కాంబోపై ఇంపాక్ట్ చూపిస్తోంది. శర్వా, సమంత.. ఇద్దరూ మంచి పెర్ఫార్మెర్లే. కాకపోతే -జాను ఇంపాక్ట్.. మరో ప్రాజెక్టు కలిసి చేయడానికి సాహసం చేయలేనంత భయాన్ని క్రియేట్ చేసినట్టే కనిపిస్తోంది. ప్రాజెక్టు ఫెయిల్యూర్‌కి అసలు కారణాలు వేరున్నా -కాంబోపై మాత్రం బలమైన ఇంపాక్టే పడిందన్న వాతావరణం కనిపిస్తోంది.

02/17/2020 - 22:01

జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రం -తలైవి. కంగనా రనౌత్‌ను జయగా చూపించనున్నాడు దర్శకుడు ఎఎల్ విజయ్. ఈ పాత్ర పోషణకు పెద్ద పరిశోధనే చేశానంటూ అనేక సందర్భాల్లో చెప్పింది, చెబుతోంది కంగన. అయితే, జయ జీవిత చరిత్ర అనగానే -ఆ చరిత్రతో ముడిపడివున్న కొన్ని ముఖ్యపాత్రలు మస్తిష్కంలోకి వస్తాయి. అలా -తలైవి కథలో అతి ముఖ్యమైన ఎంజీ రామచంద్రన్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నాడు.

02/17/2020 - 21:59

తమిళ ప్రాచీన యుద్ధ విద్య ఆడిమురై నేపథ్యంగా రూపొందిన చిత్రం -లోకల్ బోయ్. ధనుష్ ద్విపాత్రాభినయ పాత్రతో రూపొందిన సినిమా తమిళంలో సంక్రాంతికి విడదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ఆ చిత్రాన్ని ఫిబ్రవరి 28న తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సీహెచ్ సతీష్‌కుమార్ అందిస్తున్నారు. హీరోయిన్లుగా మెహరీన్, స్నేహ చేసిన సినిమాలో ప్రతినాయక పాత్రను నవీన్‌చంద్ర పోషించాడు.

02/17/2020 - 21:58

రవిజతే, శ్రావణి నిక్కీ, శృతిశెట్టి లీడ్‌రోల్స్‌లో రాజారెడ్డి బ్యానర్‌పై విడుదలైన సినిమా -అనుభవించు రాజా. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ -తెలుగు రాష్ట్రాల్లో మా అంచనాలకు మించి సినిమాకు స్పందన వస్తోంది. ఇలాంటి టైంలో మాకో దురదృష్టకర సంఘటన ఎదురైంది. బుక్ మై షో కొలమానంలో మా సినిమాకు వస్తోన్న స్పందనను తక్కువ చేసి చూపించటం దారుణం.

Pages